వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (దేశీయ) కింద 21వ ఇ-వేలంలో 2.84 ఎల్ఎంటిల గోధుమను, 5830 ఎంటిల బియ్యాన్ని కొనుగోలు చేసిన 2334 మంది బిడ్డర్లు
Posted On:
16 NOV 2023 1:29PM by PIB Hyderabad
బియ్యం, గోధుమలు, గోధుమ పిండి చిల్లర ధరను నియంత్రించేందుకు మార్కెట్ జోక్యం కోసం భారత ప్రభుత్వ చొరవలో భాగంగా ప్రతి వారం గోధుమలు, బియ్యం ఇ-వేలాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 21వ ఇ-వేలాన్ని 15-11-2023న నిర్వహిస్తూ 3 ఎల్ఎంటిల గోధుమలను, 1.79 ఎల్ఎంటిల బియ్యాన్ని బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (దేశీయ) కింద వేలానికి పెట్టగా, అందులో 5830 ఎంటి2.84 ఎల్ఎంటి గోధుమలను 2334 మంది బిడ్డర్లకు విక్రయించారు.
దేశవ్యాప్తంగా ఎఫ్‌ఎక్యూ గోధుమలకు వెయిటెడ్ రిజర్వు ధర క్వింటాలుకు రూ. 2150కు వ్యతిరేకంగా సగటు విక్రయ ధర రూ 2246.86గా ఉండగా, యుఆర్ ఎస్ గోధుమలకు వెయిటెడ్ రిజర్వు ధర క్వింటాలుకు రూ. 2125కు వ్యతిరేకంగా సగటు విక్రయ ధర రూ 2232.35గా ఉంది.
పైన పేర్కొన్న దానికి అదనంగా, 2.5 ఎల్ఎంటిల గోధుమలను సెమీ (పాక్షిక) ప్రభుత్వ సంస్థలకు, కేంద్రీయ భండార్/ ఎన్‌సిసిఎఫ్/ ఎన్ఎఎఫ్ఇడి వంటి సహకార సంస్థలకు ఒఎంఎస్ఎస్ (డి) కింద ఈ గోధుమలను పిండిగా మార్చి భారత్ ఆటా బ్రాండ్ కింద ప్రజలకు కిలో రూ. 27.50కు మించకుండా విక్రయించేందుకు కేటాయించింది. నవంబర్ 14, 2023 వరకు ఈ మూడు సహకార సంఘాలు 15337 ఎంటిల గోధుమలను పిండి రూపంలోకి మార్చేందుకు తీసుకున్నాయి.
వ్యాపారులను ఒఎంఎస్ఎస్ (డి) కింద గోధుమల అమ్మకం పరిధి నుంచి ఆవల ఉంచి, దేశవ్యాప్తంగా 14.11.2023 వరకు సరుకు నిల్వలను నివారించేందుకు 1917 అకస్మాత్తు తనిఖీలను నిర్వహించారు.
***
(Release ID: 1977544)
Visitor Counter : 82