గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తొలివిడత వికసిత భారత్సంకల్ప యాత్రలో భాగంగా గిరిజన జిల్లాల గ్రామపంచాయితీలకు అభినందనపత్రాల సమర్పణ.


డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం లక్ష్యం, ఆధునిక, సమగ్ర, పారదర్శక భూ రికార్డుల నిర్వహణకు వీలుకల్పించడం.

2023 నవంబర్ 15 నుంచి 2024 జనవరి 26 వరకు భారత ప్రభుత్వం వికసిత భారత్ సంకల్ప యాత్రను నిర్వహిస్తోంది. వివిధ పథకాల శాచురేషన్ను సాధించడానికి, ఔట్రీచ్ కార్యక్రమాల ద్వారా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది.

వికసిత్ భారత్ సంకల్పయాత్ర కింద, భూ వనరుల విభాగం అర్హత గలిగిన గ్రామాలకు అభినందన పత్రాలు అందజేయడంతోపాటు ఆయా గ్రామపంచాయతీల అధినేతలను సత్కరించడం జరుగుతోంది..

Posted On: 15 NOV 2023 4:54PM by PIB Hyderabad

డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం (డిఐఎల్ఆర్ఎంపి) , కేంద్ర ప్రభుత్వ రంగ పథకం.  దీనిని డిపార్టెంట్ ఆఫ్ ల్యాండ్ రిసొర్సెస్ అమలు చేస్తున్నది, ఇది నూరుశాతం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ.
డి.ఐ.ఎల్.ఆర్.ఎం.పి  లక్ష్యం, ఆధునిక, సమగ్ర, పారదర్శక, భూ రికార్డు యాజమాన్య వ్యవస్థను అభివృద్ధి చేయడం.  ఈ విభాగం, వివిధ జిల్లాలను  వాటి  పనితీరును  బట్టి గ్రేడింగ్ చేసింది. ఆరు మౌలిక  అంశాలలో, 99 శాతం
పైగా పనినిపూర్తిచేసిన జిల్లాలకు  ప్లాటినం గ్రేడింగ్ కిందికి తెస్తున్నారు. అలాగే 26.10.2023 నాటికి, డిఐఎల్ఆర్ఎంపి ఎం.ఐ.ఎస్ కి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతల సమాచారాన్ని అందించడం జరిగింది. 14 రాష్ట్రాలలోని
157 జిలలాలు 99 శాతం ఆ పై స్థాయిలో పనులను ఆరు కీలక కాంపొనెంట్లలో పూర్తి చేశాయి.
అవి...
1) భూ రికార్డుల కంప్యూటరైజేషన్ (ఆర్ఒఆర్)
2) కాడస్ట్రాల్ మ్యాప్లు, ఎఫ్.ఎం.బిల డిజిటలైజేషన్
3) ఆర్.ఒ.ఆర్ పత్రాలను కాడస్ట్రాల్ మ్యాప్లతో అను సంధానం.
4) రిజిస్ట్రేషన్ ల కంప్యూటరైజేషన్
5) రిజిస్ట్రేషన్ (ఎస్.ఆర్.ఒ)ను భూ రికార్డులతో (రెవిన్యూ  కార్యాలయం) అనుసంధానం.
6) ఆధునిక రికార్డు  రూము

ఈ ఆరు అంశాలు, భూ రికార్డులకు సంబంధించి  తాజాసమాచారాన్ని అందించానికి ఉపకరిస్తాయి. అలాగే  భూ వనరులను గరిష్టంగా ఉపయోగించుకోవడానికి వీలు   కల్పిస్తాయి. ఇది భూ  యజమానలకు, భూమి కొనుగోలు  చేయాలనుకునే  వారికి,
ఉపయోగకరంగా  ఉంటుంది. ప్రణాళికల రూపకల్పనలో, విధానాల రూపకల్పనలో ఉపకరిస్తాయి. భూవివాదాలను తగ్గిస్తాయి.. మోసపూరిత,బినామీ లావాదేవీలకు అడ్డుకట్టవేయడానికి ఇవి ఉపకరిస్తాయి.రెవిన్యూ అధికారులు,,రిజిస్ట్రేషన్ సిబ్బంది క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించాల్సిన
అవసరం లేకుండా చూస్తాయి, వివిధ సంస్థలు,ఏజెన్సీలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, సమాచార బట్వాడాకు వీలు కల్పిస్తాయి.

భారత ప్రభుత్వం వికసిత భారత్ సంకల్పయాత్రలను  నవంబర్ 15 2023 నుంచి జనవరి 26, 2024 వరకు నిర్వహిస్తోంది.  వివిధ పథకాల శాచురేషన్ స్థాయి వరకు ఔట్ రీచ్ కార్యకలాపాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహిస్తారు.
ఇందుకు  ప్రత్యేక కృషి జరుగుతోంది. ప్రభుత్వ పథకాల గురించి చిట్టచివరి లబ్ధిదారుకు కూడా తెలియజెప్పేలా చర్యలు తీసుకుంటున్నారు.
వికసిత భారత్ సంకల్పయాత్ర లక్ష్యాలు కిందివిధంగా ఉన్నాయి.
ఎ) ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి ,  ఇప్పటికీ ఆ పథకాలు అందుకోలేని వారిని చేరడం, ఇప్పటి వరకూ ఆ పథకాలను ఉపయోగించుకోనివారిని చేరడం.
బి)వివిధ పథకాల గురించిన సమాచారం అందించడం,  వాటిపై ప్రజలలో అవగాహన పెంచడం.
సి) పౌరులనుంచి సమాచారం తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాల  లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించడం, వారి వ్యక్తిగత అనుభవాలను తెలుసకోవడం.
డి) వికసిత  భారత్ సంకల్పయాత్ర ద్వారా అర్హులైన లబ్ధిదారుల  సమాచారం తెలుసుకుని  వారి వివరాల నమోదు.

వికసిత భారత్ సంకల్ప యాత్ర కింద ,  అర్హత సాధించిన గ్రామాలకు, గ్రామపంచాయతీలకు, గ్రామస్థాయి పాలనా బాధ్యతలలోఉండే పట్వారి, లేఖపాల్, మండల్ వంటి వారు, అలాగే గ్రామ పంచాయతీ బాధ్యులైన
సర్పంచ్ వంటి వారికి , ప్రభుత్వ షెడ్యూలు ప్రకారం ఆయా గ్రామాల ద్వారా వికస భారత్ సంకల్ప యాత్రలో భాగంగా , భూ వనరుల విభాగం,  99 శాతం పైగా భూ రికార్డులు డిజిటలైజేషన్ సాధించిన గ్రామాలకు
అభినందన పత్రం, సర్టిఫికేట్ను అందజేస్తోంది. ఇందుకు సంబంధించి ఆమోదిత సర్టిఫికేట్ డిజిటల్ నమూనాను రాష్ట్రాలకు పంపడం జరిగింది. వీటిని తొలివిడతగా 11 రాష్ట్రాలలోని 103 జిల్లాలలో పంపిణీ చేసేందుకు డిపార్టమెంట్ ఆఫ్
లాండ్ రికార్డ్స్ కార్యదర్శి ద్వారా సమాచారం అందించడం జరిగింది.
వికసిత భారత్ సంకల్ప్ యాత్ర  తొలిదశలో పలు కార్యక్రమాలు,  అభినందన పత్రాల పంపిణీ వంటి వాటిని ఏర్పాటు చేశారు.

 

***



(Release ID: 1977318) Visitor Counter : 101