ప్రధాన మంత్రి కార్యాలయం
వన్డేలలో 50వ శతకం సాధించిన విరాట్ కోహ్లీకి ప్రధానమంత్రి అభినందన
Posted On:
15 NOV 2023 6:43PM by PIB Hyderabad
వన్డే అంతర్జాతీయ క్రికెట్లో 50 శతకాలు సాధించిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘మన విరాట్ కోహ్లీ ఇవాళ విరాడ్రూపం దాల్చి తన 50వ వన్డే సెంచరీ సాధించడమేగాక ప్రతిభ, పట్టుదల, స్ఫూర్తితో అత్యుత్తమ క్రీడాస్ఫూర్తికి నిర్వచనంగా నిలిచాడు. ఈ అద్భుత మైలురాయి నిరంతర అంకితభావంతోపాటు అతని అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఈ ఘనత సాధించిన సందర్భంగా అతనికి నా హృదయపూర్వక అభినందనలు. రాబోయే తరాలకు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పడాన్ని భవిష్యత్తులోనూ అతడు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1977261)
Visitor Counter : 115
Read this release in:
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam