సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అభివృద్ధి భారత్ (విక్షిత్ భారత్) సంకల్ప యాత్ర ప్రారంభం
దేశం అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి బయలుదేరిన ఐఈసి వ్యాన్లు
Posted On:
15 NOV 2023 4:57PM by PIB Hyderabad
గిరిజన నాయకుడు బిర్సా ముండా జన్మదినోత్సవాన్ని జన జాతీయ గౌరవ దినోత్సవంగా పాటిస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న అభివృద్ధి భారత్ (విక్షిత్ భారత్) సంకల్ప యాత్రను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జార్ఖండ్‌లోని ఖుంటిలో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ కార్యక్రమాల వివరాలతో ప్రత్యేకంగా రూపొందించిన 5 ఐఈసి( సమాచారం, విద్య, ప్రచారం) వ్యాన్లు గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న ఖుంటి జిల్లా, దాని చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామ పంచాయతీలకు బయలుదేరి వెళ్లాయి.
దేశం వివిధ ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉన్న 68 జిల్లాల్లో ఐఈసి వ్యాన్లు ప్రారంభమయ్యాయి. వీటిని గవర్నర్‌లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వంటి ముఖ్యమైన ప్రముఖులు వ్యాన్‌లను ప్రారంభించారు.
జమ్మూ కాశ్మీర్‌లో రాజౌరి జిల్లా బుధాల్, బందిపోరా జిల్లా గురేజ్ నుంచి సంకల్ప్ యాత్రలు ప్రారంభమయ్యాయి. సముద్ర మట్టానికి 8,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి శీతల గాలిని లెక్క చేయకుండా స్థానికులు, యువకులు, పంచాయతీరాజ్ సంస్థలు, ప్రభుత్వ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ సుబంసిరి జిల్లాలోని జిరో వద్ద జరిగిన కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కె.టి. పట్నాయక్ (రిటైర్డ్) వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి స్వనిధి, పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఈసి వ్యాన్‌లు దిగువ సుబంసిరి, తవాంగ్ , తూర్పు కమెంగ్ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అట్టడుగు స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. నాగాలాండ్‌లోని దిమాపూర్ జిల్లా ఇండిసెన్ గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించారు అస్సాంలో విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర బక్సా, కోక్రాఝర్, కర్బీ అంగ్లాంగ్ నుంచి ప్రారంభమయింది. .
మహారాష్ట్ర గిరిజన జిల్లా నందుర్బార్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బెయిన్స్ , ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. గుజరాత్‌లోని దాహోద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా , రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ అంబాజీ వద్ద వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా నుంచి విక్షిత్ భారత్ ప్రచార వ్యాన్‌లను కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు జెండా ఊపి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారాంరాజు జిల్లా నుంచి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జెండా ఊపివిక్షిత్ భారత్ యాత్రను ప్రారంభించారు. తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, పశుసంవర్ధక , మత్స్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నీలగిరి జిల్లా నుంచి యాత్రను ప్రారంభించారు. కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పాలక్కాడ్ జిల్లాలోని అట్టపాడిలో ప్రచారాన్ని ప్రారంభించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లోని కరవట్టి ద్వీపంలో కూడా ప్రచారాన్ని ప్రారంభించారు.
సంకల్ప యాత్ర లక్ష్యాలు:
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా సంకల్ప యాత్ర జరుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న
పారిశుద్ధ్య సౌకర్యాలు, అందిస్తున్న ఆర్థిక సేవలు, విద్యుత్ కనెక్షన్లు, వంట గ్యాస్ సిలెండర్లు, పేదలకు గృహాలు, ఆహార భద్రత, సరైన పోషకాహారం, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు వివరించి అవగాహన కల్పిస్తారు.
ఆయుష్మాన్ భారత్; పీఎం జె, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన;, దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ); పీఎం ఉజ్వల యోజన , పీఎం విశ్వకర్మ; పీఎం కిసాన్ సమ్మాన్ ;కిసాన్ క్రెడిట్ కార్డ్,పీఎం పోషన్ అభియాన్, హర్ ఘర్ జల్ - జల్ జీవన్ మిషన్; గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాల్లో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్, జన్ ధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన; పీఎం ప్రమాన్, నానో ఎరువులు మొదలైన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న సికిల్ సెల్ అనీమియా వ్యాధిని నిర్మూలించడానికి అమలు జరుగుతున్న కార్యక్రమాలు,ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో నమోదు, స్కాలర్‌షిప్ పథకాలు; అటవీ హక్కు , వ్యక్తిగత సామాజిక భూములు సమస్యలు, వన్ ధన్ వికాస్ కేంద్రం: స్వయం సహాయక బృందాల నిర్వహణ అంశాలు కూడా యాత్రలో వస్తాయి.
జాతీయ, రాష్ట్ర , జిల్లా స్థాయిలో విజయవంతంగా అమలు జరుగుతున్న ప్రధాన పథకాలు, ముఖ్యాంశాలు , సాధించిన విజయాలపై హిందీ రాష్ట్ర భాషల్లో ఆడియో విజువల్స్, కార్యక్రమాలు,, కరపత్రాలు, బుక్‌లెట్‌లు ద్వారా ప్రజలకు సమాచారం అందించే విధంగా వ్యాన్ల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాల్గొనే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పథకాల లబ్ధిదారుల అనుభవాన్ని పంచుకోవడం, ప్రగతిశీల రైతులతో చర్చలు, ఆయుష్మాన్ కార్డ్, జల్ జీవన్ మిషన్, జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన,ఓడిఎఫ్ ప్లస్ వంటి పథకాల అమలులో 100% లక్ష్యాలు సాధించిన గ్రామ పంచాయతీలు సాధించిన విజయాలు వివరిస్తూ క్విజ్ పోటీలు, డ్రోన్ ప్రదర్శన, ఆరోగ్య శిబిరాలు, మేరా యువ భారత్ వాలంటీర్ నమోదు మొదలైనవి కార్యక్రమాలు జరుగుతాయి.
***
(Release ID: 1977248)
Visitor Counter : 116