బొగ్గు మంత్రిత్వ శాఖ
2027 నాటికి 1404 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రణాళిక
ప్రస్తుతం మొత్తం బొగ్గు నిల్వలు 73.56 ఎంటిలు
16 అక్టోబర్ నుంచి విద్యుత్ కేంద్రాలు, గనుల వద్ద క్రమంగా పెరుగుతున్న నిల్వలు
Posted On:
13 NOV 2023 4:18PM by PIB Hyderabad
ఏడాదికి ఒక బిలియన్ టన్నుల చొప్పున ప్రస్తుత ఉత్పత్తి స్థాయితో, 2027వ సంవత్సరం నాటికి 1404 మిలియన్ టన్ను (ఎంటి) బొగ్గును, 2030 నాటికి 1577 ఎంటిలను ఉత్పత్తి చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న బొగ్గు దాదాపు 821 ఎంటిలుగా ఉంది.
దేశంలో 2030 నాటికి జోడించనున్న అదనపు 80 జిడబ్ల్యు థెర్మల్ సామర్ధ్యానికి అదనపు బొగ్గు అవసరాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకున్నది. అదనపు థర్మల్ సామర్ధ్యానికి బొగ్గు అవసరం 85% వద్ద 400 ఎంటిల వరకూ ఉంటుంది. వాస్తవ అవసరం అన్నది పునరావృత మూలాల నుంచి వచ్చే తోడ్పాటు కారణంగా రానున్న కాలంలో ఉత్పాదన పై ఆధారపడి బొగ్గు అవసరాలు తగ్గవచ్చు.
దేశీయ బొగ్గు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ ఉత్పత్తి పెంపొందించే ప్రణాళికలో అదనపు పరిణామంలో బొగ్గును ఉత్పత్తి చేసే యోచనను బొగ్గు మంత్రిత్వ శాఖ కలిగి ఉంది.
కొత్త గనులను తెరవడం, గనుల సామర్ధ్యాన్ని విస్తరించడం, కాప్టివ్/ వఆణిజ్య గనుల నుంచి ఉత్పత్తి అన్నవి ఉత్పత్తి ప్రణాళికలలో ఉన్నాయి. ఈ మూడు కార్యాచరణ భాగాలు దోహదం చేస్తూ, మరింత పెంపుదలకు స్పష్టమైన ప్రణాళికలను కలిగి ఉన్నాయి.2027& 2030కి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికలు దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల దేశీయ అవసరాల కన్నా ఎక్కువగా ఉండటమే కాదు అదనపు సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటాయి.
ప్రస్తుత సంవత్సరంలో బొగ్గు పరిస్థితికి సంబంధించి, నిల్వలు పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వ దాదాపు 20 ఎంటిలుగా ఉండగా, గనుల వద్ద 41.59 ఎంటిలు ఉంటుంది. మొత్తం నిల్వ (ట్రాన్సిట్ & కాప్టివ్ గనులు సహా) 73.56 ఎంటిలు. ఇది గత ఏడాదిలో 65.56 ఎంటిల కన్నా ఎక్కువగా ఉండి 12% వృద్ధిని సూచిస్తుంది.
బొగ్గు, విద్యుత్, రైల్వే మంత్రిత్వ శాఖలు సన్నిహిత సహకారంతో పని చేస్తున్నాయి. అనుగుణంగా, ఆటంకాలు లేకుండా బొగ్గు సరఫరాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 16.10.23 నాటికి అతి తక్కువ టిపిపి నిల్వ, తర్వాత థర్మల్ థర్మల్ కేంద్రాలు, గనుల వద్ద నిల్వల నిర్మాణాన్ని ప్రారంభమైంది. దేశీయ బొగ్గు ఆధారిత కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి 8.99% కాగా, బొగ్గు ఉత్పత్తిలో వార్షిక ప్రాతిపదికన (నేటివరకు) 13.02% వృద్ధి ఉంది. గత ఏడాదితో పోలిస్తే గత మూడు నెలల్లో థర్మల్ విద్యుత్ కోసం డిమాండ్ పెరగిందన్నది గమనార్హం.
***
(Release ID: 1976812)
Visitor Counter : 88