ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో టెలిఫోన్ లో మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు


పశ్చిమ ఆసియా లో స్థితి ని గురించి చర్చించిన ఇరువురు నేత లు

ఉగ్రవాదం, హింస మరియు పౌరజీవనానికి కలుగుతున్న నష్టం ల పట్లఆందోళన ను వ్యక్తం చేయడం తో పాటు ఈ దిశ లో ఉమ్మడి ప్రయాస ల కోసం వారుపిలుపునిచ్చారు

జి20 కి బ్రెజిల్ అధ్యక్షత వహించే కాలం లో భారతదేశం పూర్తిస్థాయి లో సమర్థిస్తుంది అని తెలియజేసిన ప్రధాన మంత్రి

అన్ని రంగాల లోద్వైపాక్షిక సహకారాన్ని విస్తరింపచేసుకొనేందుకు ఉన్న పద్థతుల ను గురించి వారుచర్చించారు

Posted On: 10 NOV 2023 8:39PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా దా సిల్వా ఈ రోజు న టెలిఫోన్ మాధ్యం ద్వారా మాట్లాడారు.


ఇరువురు నేత లు పశ్చిమ ఆసియా లో వర్తమాన ఘటన క్రమాల పై ఆందోళన ను వ్యక్తం చేశారు.


ఉగ్రవాదం, హింస మరియు పౌర జీవనాని కి కలుగుతున్న నష్టం ల పట్ల ఉభయ నేత లు తీవ్ర ఆందోళన ను వ్యక్తం చేశారు. ఈ స్థితి కి వీలయినంత త్వరలో పరిష్కారం కనుగొనడం కోసం ఉమ్మడి ప్రయాస లు అవసరం అంటూ వారు పిలుపు ను ఇచ్చారు.

జి20 కి అధ్యక్ష పదవి ని బ్రెజిల్ సంబాళించడం లో సాఫల్యాన్ని సాధించేందుకు భారతదేశం పూర్తి అండదండల ను అందిస్తుంది అని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పేర్కొన్నారు.


నేత లు ఇద్దరూ జి20 శిఖర సమ్మేళనం న్యూ ఢిల్లీ లో జరిగిన క్రమం లో వారి మధ్య చోటు చేసుకొన్నటువంటి సమావేశాని కి తరువాయి గా అన్ని రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరింపచేసుకొనేందుకు గల పద్ధతుల పైన సైతం చర్చించారు.

 

***

 



(Release ID: 1976672) Visitor Counter : 73