పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

"నిశ్శబ్దపు సంభాషణ: అంచుల నుండి కేంద్రం వరకు" అన్న ఇతివృత్తంతో మూడు రోజుల గిరిజన కళా ప్రదర్శన ముగింపు


దేశవ్యాప్తంగా పులుల అరణ్య ప్రాంతాల నుండి వచ్చిన
కళాకారులు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతితో భేటీ

సంభాషణ ఎజెండాలో ప్రధానమైన కమ్యూనిటీలను శక్తివంతం చేసే లక్ష్యంతో
గిరిజన, ఇతర అటవీ నివాస కళాకారుల పరిరక్షణ నైతికత ఈ పెయింటింగ్‌లలో ప్రముఖంగా ప్రస్తావన

Posted On: 08 NOV 2023 12:17PM by PIB Hyderabad

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ), పర్యారణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్&సిసి), సంకల ఫౌండేషన్‌ సంయుక్తంగా కొత్త ఢిల్లీలో నిర్వహించిన "నిశ్శబ్ద సంభాషణ:  అంచుల నుండి కేంద్రం వరకు"  పేరుతో ఇటువంటి తరహాలో చేపట్టిన  మొట్టమొదటి కళా ప్రదర్శన. నవంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించారు.

  

A group of people posing for a photoDescription automatically generated

ఈ ప్రదర్శనను గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నవంబర్ 3న ప్రారంభించారు. పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా మానవాళి మనుగడకు కూడా అత్యవసరమైన వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించేందుకు సమగ్రమైన,  ఐక్యమైన దృక్పథం అవసరమని ఉద్ఘాటిస్తూ రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రకృతితో సహజీవనం చేస్తూ సంపన్నమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపాలనే దానిపై వారి నుండి నేర్చుకోవలసిన విలువైన పాఠాలు ఉన్నాయని పేర్కొంటూ, గిరిజన, ఇతర అటవీ నివాస వర్గాల సాంప్రదాయ పద్ధతులను స్వీకరించడానికి గల ప్రాముఖ్యతను ఈ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

 

A group of people holding a pictureDescription automatically generated

కన్హా టైగర్ రిజర్వ్‌లోని మహార్ కమ్యూనిటీకి చెందిన కళాకారుడు తయారు చేసిన జ్ఞాపికను రాష్ట్రపతికి అందజేశారు. చుక్క/బిందు స్టైల్‌లో ఉన్న బాగ్‌దేవ్ అనే పెయింటింగ్, పులి శాశ్వతమైన రక్షణను కోరుతూ మహార్‌లు నీలాకాశపు రాత్రిపూట పూజా ఆచారాలలో ఎలా నిమగ్నమై ఉన్నారో సూచిస్తుంది. 

ప్రారంభ వేడుకలో కేంద్ర పర్యావరణ, అటవీ,  వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, కార్యదర్శి శ్రీమతి. లీనా నందన్, ఎన్హెచ్ఆర్సీ సెక్రటరీ జనరల్  శ్రీ భరత్ లాల్, ; డీజీ (ఫారెస్ట్) & ప్రత్యేక కార్యదర్శి, శ్రీ సీపీ గోయల్, ఏడీజీ (పీటీ&ఈ)/సభ్య కార్యదర్శి, ఎన్టీసీఏ శ్రీ ఎస్పీ యాదవ్, ప్రభుత్వం నుండి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అలాగే రాయబారులు/ హై కమిషనర్లు/దౌత్యవేత్తలు, కళ, వన్యప్రాణుల రంగానికి చెందిన ప్రముఖులు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

గోండ్, భిల్, పాతచిత్ర, ఖోవర్, సోహ్రాయ్, వార్లీ, మరెన్నో కళా శైలులకు ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశంలోని 12 వేర్వేరు రాష్ట్రాల నుండి 43 మంది కళాకారుల అసాధారణ ప్రతిభను ప్రదర్శనలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన భారతదేశంలోని పులుల రిజర్వ్‌ల చుట్టూ నివసించే గిరిజన, ఇతర అటవీ నివాస సంఘాల మధ్య సంక్లిష్ట సంబంధాన్ని, అటవీ, వన్యప్రాణులతో వారి లోతైన సంబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

రాష్ట్రపతి భవన్‌ను సందర్శించాల్సిందిగా కళాకారులను ఆహ్వానం అందడంతో వీరికి రాష్ట్రపతిని కలుసుకునే అవకాశం లభించింది 

 

 A group of people in colorful dressesDescription automatically generated

ఈ కమ్యూనిటీల కళ, సంస్కృతిలో లీనమయ్యేలా ప్రజలకు అసాధారణ వేదికను అందించిందిఎగ్జిబిషన్.  వారి ఆచార, సంస్కృతులపై లోతైన ప్రశంసలను పొందేలా చేసింది. వారాంతంలో, ఢిల్లీ ఎన్సిఆర్ వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబారులు, హైకమిషనర్లు వంటి అనేక మంది ప్రముఖ అతిథులకు ఆతిథ్యం ఇచ్చింది. వారు, వారి కుటుంబాలతో పాటు, కళాకారులతో నిమగ్నమై ఉండటమే కాకుండా, ఈ ప్రత్యేకమైన పెయింటింగ్‌లు, కళాఖండాలను కొనుగోలు చేయడం, తద్వారా గిరిజన కళలు, వారసత్వం ప్రోత్సాహం, పరిరక్షణకు దోహదపడటం కోసం ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యత, పులుల నిల్వలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో పులుల కీలక పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన వేదికగా ఉపయోగపడింది. కళాకృతుల విక్రయం ద్వారా, ప్రదర్శనలో పాల్గొనే కళాకారులను ఆర్థికంగా బలం చేకూరింది. వారికి ప్రత్యామ్నాయ, స్థిరమైన జీవనోపాధిని అందించారు. క్యూఆర్ కోడ్ ద్వారా గిరిజన కళాకారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పంపడం విశేషం.

      A person pointing at a paintingDescription automatically generated

కళాకారులు నగరంలోని కొన్ని ప్రధానమైన ఆకర్షణ కేంద్రాలను సందర్శించారు. వారి ప్రయాణంలో దేశం గర్వించదగ్గ, త్యాగానికి ప్రతీక అయిన ఇండియా గేట్, కర్తవ్య పథం సందర్శించారు. 

A person in a traditional dressDescription automatically generated

ఈ ఎగ్జిబిషన్ భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కళ, సంస్కృతి, పులుల సంరక్షణ సందేశాన్ని విస్తృతంగా ప్రేక్షకులకు వ్యాప్తి చేసే ప్రస్థానానికి నాంది పలికింది.

 



(Release ID: 1976024) Visitor Counter : 73