ఆయుష్
'వరల్డ్ ఫుడ్ ఇండియా' లో ఆయుర్వేదం, యోగా ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించి వివరించిన ప్రధానమంత్రి
'వరల్డ్ ఫుడ్ ఇండియా' లో ఆయుష్ పై చర్చలు,ఆయుష్ వీసా, ఆయుష్ ఆహారం, ఏఐ పై మేధోమధన సమావేశం నిర్వహించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
రూ. 100 బిలియన్లకు పెరిగే అవకాశం ఉన్న ఆయుష్ ఆహార ఉత్పత్తుల రంగం
అంతర్జాతీయ ఆహార శైలిలో భాగం అవుతున్న ఆయుర్వేద సూపర్ ఫుడ్స్
Posted On:
03 NOV 2023 8:16PM by PIB Hyderabad
'వరల్డ్ ఫుడ్ ఇండియా' లో ఆయుర్వేదం, యోగా ప్రాముఖ్యతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ నరేంద్ర మోదీ " వేల సంవత్సరాల కృషి ఫలితంగా భారతదేశం స్థిరమైన ఆహార సంస్కృతిని సాధించింది. మన పూర్వీకులు ఆయుర్వేదాన్ని సామాన్య ప్రజల ఆహార శైలితో ముడిపెట్టారు. భారతదేశం చేసిన కృషి ఫలితంగా అంతర్జాతీయంగా ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. భారతదేశం చొరవతో నిర్వహించిన యోగా దినోత్సవం యోగాను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లింది, అదేవిధంగా ఇప్పుడు చిరుధాన్యాలు కూడా ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకుంటాయి." అని అన్నారు.
న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 2023 నవంబర్ 3 నుంచి నవంబర్ 5 వరకు జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ నరేంద్ర మోదీ ఆయుర్వేదం, యోగా ప్రాముఖ్యతను వివరించారు. అంతర్జాతీయంగా యోగాకు లభిస్తున్న గుర్తింపును ప్రధాన మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న జైపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ప్రొఫెసర్ అనుపమ్ శ్రీవాస్తవ దేశంలో ఆరోగ్య పర్యాటక రంగం ప్రాధాన్యత వివరించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్ వీసా విధానం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలు అవసరమైన వారికి ప్రయోజనం కలిగిస్తుందన్నారు.
ఓమ్ని యాక్టివ్ హెల్త్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ మారివాలా మాట్లాడుతూ ప్రస్తుతం ఆయుష్ ఉత్పత్తుల భారత మార్కెట్ 3.5 బిలియన్ యూఎస్ డాలర్ల వరకు ఉందని, ఇది 100 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివ్ కుమార్ హార్తీ ప్రజల ఆరోగ్యం ఆహారం, నిద్ర , జీవనశైలిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆయుష్ ఉత్పత్తులు అంతర్జాతీయ ఆహార శైలిలో భాగమవుతున్నాయని ఆయన తెలిపారు. ఆయుష్ ఉత్పత్తుల అభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న అంశాన్ని ఎఫ్ఐఐటి-ఐఐటీ ఢిల్లీ కి చెందిన డాక్టర్ సాకేత్ చటోపాధ్యాయ వివరించారు.
హిమాలయా వెల్ నెస్ కంపెనీ అధిపతి శ్రీ విజేంద్ర ప్రకాష్ మాట్లాడుతూ సహకారం, భాగస్వామ్యంతో ఆయుష్ పరిశ్రమ అభివృద్ధి పేర్కొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ మీడియా సలహాదారు శ్రీ సంజయ్ దేవ్ ఆధ్వర్యంలో చర్చా గోష్టి జరిగింది. ఆయుష్ వైద్య విధానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించిన శ్రీ సంజయ్ దేవ్ వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదం దేశ సంస్కృతిలో భాగంగా ఉందన్నారు. ఆయుష్ వైద్య విధానానికి మరింత గుర్తింపు లభించేలా చూసేందుకు ఆయుష్ మంత్రి శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.
వరల్డ్ ఫుడ్ ఇండియా నిర్వహణకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలు అందిస్తోంది. వరల్డ్ ఫుడ్ ఇండియాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. పెవిలియన్ లో ప్రస్తుత జీవితంలో ఆయుష్ ఆహారం ప్రయోజనం, ఆయుష్ ఆహారం ప్రాముఖ్యత, దానిని పొందే పద్ధతులు మొదలైన వాటితో పాటు ఆయుర్వేద ఆహారం గురించి సవివరమైన సమాచారం అందిస్తారు. సంప్రదాయ వైద్య విధానాల ప్రకారం సరైన ఆహారం, ఆహార పదార్థాలకు సంబంధించి సామాచారం అందుబాటులో ఉంచారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటేచా కూడా ఈరోజు ఆయుష్ పెవిలియన్‌ను సందర్శించారు. కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు, ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1974640)
Visitor Counter : 60