ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రచార కార్యక్ర మం 3.0 కింద గణనీయమైన ఫలితాలు


22,454 ఫైళ్ళను సమీక్షించారు, 8,621 ఫిజికల్ ఫైళ్లను తొలగించారు, 3260 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించారు, 1787 పరిశుభ్రతా ప్రచారాన్ని నిర్వహించారు. 35,268 చదరపు అడుగుల స్థలాన్ని శుభ్రం చేసి, పనికిరాని వస్తువులను తొలగించి,

వ్యర్థాల అమ్మకం ద్వారా రూ 13,70,211 లు ఆర్జించారు.

Posted On: 01 NOV 2023 12:26PM by PIB Hyderabad

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ (డిఒహెచ్ఎఫ్డబ్ల్యు) విభాగం స్వచ్ఛత,  పెండింగ్ అంశాల పరిష్కారానికి సంబంధించి  3.0 ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ విభాగం కేంద్ర కార్యాలయంలో, అనుబంధంగా ఉన్న
కార్యాలయాలు, సబార్డినేట్ కార్యాలయాలు, స్వతంత్ర విభాగాలు, దేశంలోని వివిధ ప్రాంతాలలో గల సిపిఎస్ఇలలో దీనిని పెద్ద ఎత్తున  నిర్వహించారు.  ఈ ప్రత్యేక ప్రచార లక్ష్యం పెండింగ్ సమస్యల పరిష్కారం, స్వచ్ఛతా కార్యక్రమాలను సంస్థాగతం చేయడం,
అంతర్గత పర్యవేక్షక యంత్రాంగాన్ని బలోపేతం చేయడం,  రికార్డుల నిర్వహణలో అధికారులకు శిక్షణ ఇవ్వడం, రికార్డులను డిజిటలైజ్ చేయడం, రికార్డుల నిర్వహణను మెరుగుపరచడం వంటి అంశాలు ఉన్నాయి.
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఫీల్డు ఆఫీసులకు ప్రాధాన్యం ఇచ్చి వాటిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం
కార్యదర్శి శ్రీ సుధాంషు పంత్ ఎప్పటిప్పుడు సమీక్షిస్తూ వచ్చారు..  ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 సమర్థవంతంగా అమలకు,  సంయుక్త కార్యదర్శి, నోడల్ అధికారి శ్రీ ఎలంగబం రాబర్ట్ సింగ్,  నోడల్ అధికారిగా ఉన్నారు.
ఈ కార్యక్రమ అమలుకు సంబంధించిన వివిధ దశలను పరిపాలనా సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల విభాగం (డిఎఆర్పిజి) కు చెందిన  ఎస్.సి.డి.పి.ఎం పోర్టల్ లో (https://scdpm.nic.in)
 ఎప్పటికప్పుడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం అప్ లోడ్ చేస్తూ వచ్చింది..
 ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 జరిగిన (01.10. 2023 ‌‌ 31.10.2023) వరకు పార్లమెంటు సభ్యులనుంచి వచ్చిన 224 రెఫరెన్సులను, 3,260 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది.
అలాగే 22,454 ఫైళ్లను సమీక్షించి, అందులో ఉపయోగంలో లేని 8,621 ఫైళ్లను తొలగించారు. 1787 పరిశుభ్రతా ప్రచారాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన వివిధ కార్యాలయాలలో నిర్వహించారు.
ఈ విభాగానికి చెందిన వివిధ కార్యాలయాలలో 35,268 చదరపు అడుగుల స్థలంలో వ్యర్థాలను తొలగించి , ఆ స్థలాన్ని వాడుకునేందుకు సిద్ధం చేశారు.. వ్యర్థాల అమ్మకం ద్వారా రూ 13,70,211 రూపాయలను ఆర్జించారు.

 

***


(Release ID: 1973998) Visitor Counter : 63