వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దేశీయ లభ్యతను కొనసాగించేందుకు మెట్రిక్ టన్ను ఉల్లి ఎగుమతి కనీస మద్దతు ధరను (ఎంఇపి)ని యుఎస్‌డి 800గా ప్రకటించిన ప్రభుత్వం
నిల్వ కోసం 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించిన ప్రభుత్వం; ఇప్పటికే 5 లక్షల టన్నుల సేకరణ
రైతులకు లాభదాయకమైన ధరలను ఖరారు చేసేందుకు, ధరలను అందుబాటులో ఉంచేందుకు బఫర్ నుంచి నిరంతర సేకరణ, విక్రయాలు
Posted On:
28 OCT 2023 7:03PM by PIB Hyderabad
ఉల్లిపాయల ఎగుమతులకు ఎఫ్ఒబి ఆధారంగా ఒక మెట్రిక్ టన్నుకు 800 యుఎస్ డాలర్లను కనీస ఎగుమతి ధరగా (ఎంఇపి) ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ ధర 29 అక్టోబర్ 2023 నుంచి 31 డిసెంబర్ 2023 వరకు అమలులో ఉంటుంది. ఉల్లి ఎగుమతుల పరిమాణాన్ని అరికట్టడం ద్వారా నిల్వ చేసిన రబీ 2023 ఉల్లి పరిమాణం తగ్గుతున్నందున దేశీయ వినయోగదారులకు సరసమైన ధరలకు ఉల్లి తగినంత లభ్యతను కొనసాగించేందుకు ఈ చర్యను తీసుకున్నారు. ఒక మెట్రిక్ టన్నుకు యుఎస్‌డి 800 కనీస మద్దతు ధరను కేజీకి రూ. 67గా పరిగణించవచ్చు.
ఉల్లి ఎగుమతులకు కనీస మద్దతుధరను విధించాలన్న నిర్ణయంతో పాటు ప్రభుత్వం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లి సేకరణను ప్రకటించింది. ఇది మధ్యస్త నిల్వగా ఉంటుంది. ఇప్పటివరకూ 5 లక్షల టన్నులకు పైగా ఇప్పటికే సేకరించింది. నిల్వ ఉంచిన ఉల్లిని దేశంలో ప్రధానంగా వినియోగించే కేంద్రాలలో ఆగస్టు రెండవ వారం నుంచే విక్రయించడాన్ని కొనసాగిస్తోంది. దీనితో పాటుగా ఎన్‌సిసిఎఫ్, ఎన్ఎఎఫ్ఇడి నిర్వహించే సంచార వాహనాల ద్వారా కేజీ రూ. 25 చొప్పున రిటైల్ వినియోగదారులకు సరఫరా చేసింది. నేటివరకు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని బఫర్ నుంచి విక్రయించారు. ఉల్లి రైతులకు లాభదాయకమైన ధరలను ఖరారు చేస్తూనే వినియోగదారులకు ఒక మాదిరి ధరలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉల్లి బఫర్‌కు నిరంతర సేకరణ, విక్రయాలను చేపట్టారు.
ప్రతి ఎంటికి యుఎస్‌డి 800ను కనీస మద్దతు ధరను విధించాలన్న నిర్ణయం దేశీయ వినియోగదారులకు ఉల్లిపాయలను అందుబాటులో ఉంచాలనే ప్రభుత్వం సంకల్పాన్ని వెల్లడిస్తుంది.
***
(Release ID: 1972714)
Visitor Counter : 97