ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్‌లో పతక శతంతో భారత్ చరిత్ర సృష్టించడంపై ప్రధానమంత్రి హర్షం
Posted On:
28 OCT 2023 11:41AM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌లో భారత క్రీడాకారులు 100వ పతకంతో చరిత్ర సృష్టించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక ప్రతిభా ప్రదర్శనకుగాను భారత క్రీడాకారులు, శిక్షకులు, సహాయ సిబ్బంది మొత్తానికీ ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“పారా గేమ్స్‌లో మనకు 100 పతకాలు! అపూర్వం.. అద్భుతం. ఇది భారతీయులందరిలోనూ ఆనందోత్సాహాలు పొంగిపొర్లే క్షణం. ఈ కొత్త చరిత్ర మన క్రీడాకారుల అకుంఠిత దీక్ష, ప్రతిభ, నిర్విరామ కృషి ఫలితం. మనవాళ్లు ఒక అద్భుత మైలురాయిని అందుకోవడం మనందరికీ గర్వకారణం. నైపుణ్యంగల క్రీడాకారులు, వారిని పటిష్టంగా తీర్చిదిద్దిన శిక్షకులు, మద్దతుగా నిలిచిన సహాయ సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలతోపాటు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యువత సంకల్ప బలానికి తిరుగులేదని రుజువు చేస్తూ మన క్రీడాకారులు సాధించిన విజయాలు యావద్దేశానికీ స్ఫూర్తిదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1972654)
Visitor Counter : 115
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam