ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో స్వర్ణం సాధించిన ప్రమోద్‌ భాగవత్‌కు ప్రధాని ప్రశంసలు

प्रविष्टि तिथि: 27 OCT 2023 7:55PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్‌-3’లో స్వర్ణ పతకం సాధించిన ప్రమోద్‌ భాగవత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ విజయం సాధించడంలో అతడు చూపిన పట్టుదల, నైపుణ్యం అద్వితీయమని ఆయన ప్రశంసించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్‌-3’లో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం కైవసం చేసుకున్న ప్రమోద్‌ భాగవత్‌కు నా అభినందనలు. తుదిపోరులో అతడు చూపిన పట్టుదల, నైపుణ్యం దేశం గర్వించే విజయాన్ని సాధించడంలో తోడ్పడ్డాయి” అని ప్రధానమంత్రి కొనియాడారు.


(रिलीज़ आईडी: 1972417) आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam