ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో గల తులసి పీఠ్ లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
‘‘అష్టాధ్యాయిఅనేది భారతదేశం యొక్క భాషా విజ్ఞానం, భారతదేశం యొక్క వివేకంమరియు మన పరిశోధన ప్రధానమైన సంస్కృతి లయొక్క ఒక వేయి సంవత్సరాల పాతదైన గ్రంథం గా ఉన్నది’’
‘‘కాలం సంస్కృతానికి మెరుగులు దిద్దుతుందే తప్ప దానిని ఎన్నడూ కలుషితం చేయజాలదు, సంస్కృతం చిరస్థాయి గా నిలచివుంటుంది’’
‘‘భారతదేశం లో మీరు ఏ జాతీయ పార్శ్వం లో చూసినా సరే సంస్కృతం యొక్క తోడ్పాటు ను మీరు గమనిస్తారు’’
‘‘సంస్కృతంసంప్రదాయల భాష ఒక్కటే కాదు, అది మన ప్రగతి మరియు మన గుర్తింపుల కు చెందిన భాష గా కూడాను ఉంది’’
‘‘చిత్రకూట్ లో ఆధ్యాత్మిక జ్ఞానం తో పాటు, ప్రాకృతిక శోభ కు కూడా నెలకొంది’’
Posted On:
27 OCT 2023 4:46PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్రకూట్ లో తులసి పీఠ్ ను ఈ రోజు న సందర్శించారు. కాంచ్ మందిర్ లో జరిగిన దర్శనం, మరియు పూజ కార్యక్రమాల లో ఆయన పాలుపంచుకొన్నారు. తులసి పీఠ్ కు చెందిన జగద్గురు రామానందాచార్య గారి ఆశీర్వాదాల ను అందుకొన్నారు, అలాగే ఒక సార్వజనిక కార్యక్రమం లో ఆయన పాల్గొని, అక్కడ మూడు గ్రంథాలు.. ‘అష్టాధ్యాయి భాష్య’, ‘రామానందాచార్య చరితం’ మరియు ‘భగవాన్ శ్రీ కృష్ణ కీ రాష్ట్రలీల’ లను ఆవిష్కరించారు.
సార్వజనిక సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, అనేక ఆలయాల లో భగవాన్ శ్రీ రాముని దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో పాలుపంచుకోవడం పట్ల మరియు సాధువుల ఆశీసస్సులను ప్రత్యేకించి జగద్గురు రామానందాచార్య గారి దీవెనల ను అందుకోవడం పట్ల కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ఆయన మూడు పుస్తకాల ను విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భం లో ప్రస్తావించారు. ఆ పుస్తకాలు ఏవేవి అంటే.. వాటిలో ‘అష్టాధ్యాయి భాష్య’, ‘రామానందాచార్య చరితం’, ఇంకా ‘భగవాన్ శ్రీ కృష్ణ కీ రాష్ట్రలీల’ ఉన్నాయి. ఆ పుస్తకాలు భారతదేశం యొక్క జ్ఞాన పరంపర ను మరింత బలపరుస్తాయి అని ఆయన అన్నారు. ‘‘ఈ గ్రంథాలు జగద్గురువు యొక్క దీవెనల కు ప్రతిరూపాలు అని నేను భావిస్తాను’’ అని ఆయన స్పష్టం చేశారు.
‘‘అష్టాధ్యాయి అనేది భారతదేశం యొక్క భాషా విజ్ఞానం, భారతదేశం యొక్క వివేకం మరియు మన పరిశోధన ప్రధానమైనటువంటి సంస్కృతి కి సంబంధించిన వేల సంవత్సరాల ప్రాచీన గ్రంథం అని ప్రధాన మంత్రి అన్నారు. అష్టాధ్యాయి పుస్తకం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆ పుస్తకం లో వ్యాకరణాన్ని మరియు భాష పరమైన విజ్ఞానాన్ని సారగర్భితమైన ఓ కేప్స్యూల్ వలె ఇమడ్చడం జరిగింది అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. ఎన్నో భాష లు వచ్చాయి, వెళ్ళాయి, కానీ సంస్కృతం మాత్రం శాశ్వతం గా నిలచింది అని ఆయన అన్నారు. ‘‘కాలం సంస్కృతాని కి మెరుగులు పెడుతుందే తప్ప ఎన్నటికీ కలుషితం చేయజాలదు’’ అని ఆయన అన్నారు. సంస్కృతం యొక్క పరిపక్వ వ్యాకరణం ఈ స్థిరత్వం యొక్క పునాది లో ఉన్నది అని ఆయన అన్నారు. కేవలం 14 మహేశ్వర సూత్రాల పైన ఆధారపడి ఈ భాష శాస్త్ర్ మరియు సహస్ర (ఉపకరణాలు మరియు విద్వత్తు) ల జనని గా ఉన్నది అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో మీరు ఏ జాతీయ పార్శ్వాన్ని చూసినా, అక్కడ మీకు సంస్కృతం యొక్క తోడ్పాటు కనిపిస్తుంది’’ అని ఆయన అన్నారు.
ఒక వేయి సంవత్సరాల నాటి బానిసత్వం కాలం లో భారతదేశం యొక్క సంస్కృతి ని మరియు వారసత్వాన్ని పెకలించివేసేందుకు జరిగిన ప్రయత్నాల ను గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తూ, సంస్కృత భాష నుండి వేరు చేయాలని చూశారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కొందరు వ్యక్తులు ప్రచారం చేసిన బానిసత్వ మనస్తత్వం ఫలితం గా సంస్కృతం పట్ల శత్రుత్వ భావన తలెత్తింది అని ఆయన పేర్కొన్నారు. మాతృభాష ను నేర్చుకోవడం విదేశాల లో ప్రశంసార్హమైన మనస్తత్వం గా ఉన్నప్పటి కీ, భారతదేశం లో ఆ వైఖరి వర్తించకుండా ఉండడం విచారకరం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సంస్కృతం అనేది సంప్రదాయాల కు చెందిన భాష ఒక్కటే కాకుండా అది మన ప్రగతి మరియు గుర్తింపు ల తాలూకు భాష గా కూడా ఉంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశం లో ఈ భాష ను బలపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ‘‘అష్టాధ్యాయి భాష్య వంటి ధర్మ గ్రంథాలు ఆధునిక కాలాల్లో జరుగుతున్న విజయవంతమైన ప్రయత్నాల దిశ లో ఒక కీలకమైన పాత్ర ను పోషిస్తాయి’’ అని ఆయన అన్నారు.
జగద్గురు రామానందాచార్య గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. ఆయన కు ఉండినటువంటి అపార జ్ఞానాన్ని గురించి ఆయన అందించిన తోడ్పాటు ను గురించి ప్రధాన మంత్రి పేర్కొన్నారు. జ్ఞానం తాలూకు ఈ స్థాయి ఎన్నటికీ వ్యక్తిగతమైంది గా కాక జాతీయ సంపద గా ఉన్నదని ప్రధాన మంత్రి అన్నారు. స్వామీ జీ కి 2015 వ సంవత్సరం లో పద్మ విభూషణ్ పురస్కారం అందింది. స్వామీ జీ యొక్క జాతీయవాద మరియు సామాజిక పార్శ్వాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో కీలకమైనటువంటి తొమ్మిది మంది ప్రచారకర్తల లో ఒకరు గా ఆయన అందించిన క్రియాశీలమైన తోడ్పాటు ను గుర్తు కు తెచ్చారు.
స్వచ్ఛత, ఆరోగ్యం మరియు స్వచ్ఛ గంగ వంటి జాతీయ లక్ష్యాలు ప్రస్తుతం సాకారం అవుతూ ఉండడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘దేశం లో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి మరొక కల ను నెరవేర్చడం లో జగద్గురు రామభద్రాచార్య గారు ఒక ప్రధానమైన పాత్ర ను పోషించారు. ఏ రామాలయం కోసం మీరు న్యాయస్థానం లోపల మరియు వెలుపల ఎంతటి తోడ్పాటు ను అందించారో అది కూడా తయారవుతున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అయోధ్య లో చేపట్టిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకోవలసింది గా తన కు ఆహ్వానం అందిన సంగతి ని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.
అమృత కాలం లో దేశం అభివృద్ధి తో పాటు వారసత్వాన్ని కూడా వెంటబెట్టుకు సాగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. తీర్థయాత్ర స్థలాల అభివృద్ధి కి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోందని శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, చిత్రకూట్ లో ఆధ్యాత్మిక జ్ఞానం తో పాటు, ప్రాకృతిక శోభ కూడా ఉంది అన్నారు. కెన్-బెత్ వా లింక్ ప్రాజెక్టు, బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే, మరియు డిఫెన్స్ కారిడార్ లను గురించి ఆయన ప్రస్తావిస్తూ, వాటితో ఈ ప్రాంతం లో క్రొత్త అవకాశాలు లభిస్తాయి అన్నారు. అభివృద్ధి లో క్రొత్త శిఖరాల ను చిత్రకూట్ అందుకొంటుందనే నమ్మకాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. జగద్గురు రామానందాచార్య సమక్షం లో ప్రణామాన్ని ఆచరించి ప్రధాన మంత్రి ప్రసంగాన్ని ముగించారు.
ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో తులసి పీఠాని కి చెందిన జగద్గురు రామానందాచార్య గారు, మధ్య ప్రదేశ్ యొక్క గవర్నరు శ్రీ మంగుభాయి పటేల్, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ తదితరులు ఉన్నారు.
పూర్వరంగం
తులసీ పీఠ్ మధ్య ప్రదేశ్ లో గల చిత్రకూట్ లో ఒక ముఖ్యమైనటువంటి ధార్మిక మరియు సామాజిక సంస్థ గా ఉంది. దీనిని 1987 వ సంవత్సరం లో జగద్గురు రామభద్రాచార్య గారు నెలకొల్పారు. తులసీ పీఠ్ హిందూ ధార్మిక సాహిత్యాన్ని ప్రచురించేటటువంటి అగ్రగామి సంస్థల లో ఒకటి గా ఉంది.
*****
DS/TS
(Release ID: 1972284)
Visitor Counter : 134
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam