సహకార మంత్రిత్వ శాఖ

“సహకార రంగం ద్వారా మెరుగైన మరియు సాంప్రదాయ విత్తనాల ఉత్పత్తిపై జాతీయ సింపోజియం” లో కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తారు. దీనిని భారతీయ బీజ్ సహకరి సమితి లిమిటెడ్ (బీ బీ ఎస్ ఎస్ ఎల్ ) 26 అక్టోబర్, 2023న న్యూఢిల్లీ లో నిర్వహిస్తోంది.


శ్రీ అమిత్ షా బీ బీ ఎస్ ఎస్ ఎల్ యొక్క లోగో, వెబ్‌సైట్ మరియు బ్రోచర్‌ను కూడా ఆవిష్కరిస్తారు. బీ బీ ఎస్ ఎస్ ఎల్ సభ్యులకు సభ్యత్వ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేస్తారు.

సింపోజియం సందర్భంగా, బీ బీ ఎస్ ఎస్ ఎల్ లక్ష్యాలు, పీ ఏ సీ ఎస్ ద్వారా విత్తనోత్పత్తి ప్రాముఖ్యత మరియు ఉత్పాదకత మరియు పంటల పోషణలో విత్తనాల పాత్ర, చిన్న మరియు సన్నకారు రైతుల అభ్యున్నతిలో సహకార సంఘాల పాత్ర చర్చించబడతాయి.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క "సహకార్ సే సమృద్ధి" దార్శనికతకు, నాణ్యమైన విత్తనోత్పత్తి మరియు బీ బీ ఎస్ ఎస్ ఎల్ ద్వారా దాని పంపిణీ ద్వారా దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం లో ఇది మరో ముఖ్యమైన ముందడుగు.

ఇది వ్యవసాయం మరియు సహకార రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది, దిగుమతి చేసుకున్న విత్తనాలపై ఆధారపడటం తగ్గిస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది, "మేక్ ఇన్ ఇండియా"ను ప్రోత్సహిస్తుంది మరియు 'ఆత్మనిర్భర్ భారత్'కు మార్గం సుగమం చేస్తుంది.

Posted On: 25 OCT 2023 1:57PM by PIB Hyderabad

26 అక్టోబర్ 2023న (గురువారం) న్యూఢిల్లీలో భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ (బీ బీ ఎస్ ఎస్ ఎల్) నిర్వహించే “సహకార రంగం ద్వారా మెరుగైన మరియు సాంప్రదాయ విత్తనాల ఉత్పత్తిపై జాతీయ సింపోజియం” లో కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తారు. శ్రీ అమిత్ షా లోగో, వెబ్‌సైట్ మరియు బ్రోచర్‌ను కూడా ఆవిష్కరిస్తారు. బీ బీ ఎస్ ఎస్ ఎల్ సభ్యులకు సభ్యత్వ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేస్తారు. సింపోజియం సందర్భంగా, బీ బీ ఎస్ ఎస్ ఎల్ లక్ష్యాలు, పీ ఏ సీ ఎస్ ద్వారా విత్తనోత్పత్తి ప్రాముఖ్యత మరియు ఉత్పాదకత మరియు పంటల పోషణలో విత్తనాల పాత్ర, చిన్న మరియు సన్నకారు రైతుల అభ్యున్నతిలో సహకార సంఘాల పాత్ర చర్చించబడతాయి.

సహకార రంగం ద్వారా ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్‌తో పాటు అధునాతన మరియు సాంప్రదాయ విత్తన పరిశోధన మరియు ఉత్పత్తి కోసం  ఒక ఛత్ర సంస్థగా వ్యవహరించడానికి జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార సంఘాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి తెచ్చిన ఒత్తిడిని అనుసరించి బీ బీ ఎస్ ఎస్ ఎల్ ఉనికిలోకి వచ్చింది. డిమాండ్ ఆధారిత విత్తనోత్పత్తి, విత్తనాల నిల్వ, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా మద్దతు, నాణ్యత పెంపుదల మరియు ప్రామాణీకరణ, ఉత్పత్తి చేసిన విత్తనాలకు అవసరమైన ధృవీకరణ మరియు మార్కెటింగ్‌లో ఇది దేశవ్యాప్తంగా సహకార సంఘాలకు సహాయం చేస్తుంది. బీ బీ ఎస్ ఎస్ ఎల్ వివిధ పంటలు మరియు వివిధ రకాల సంప్రదాయ విత్తనాలను అభివృద్ధి చేయడం మరియు పరిరక్షించడంలో సహకార సంఘాలకు  సహాయం చేస్తుంది.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క "సహకార్ సే సమృద్ధి" దార్శనికతకు ఇది మరో ముఖ్యమైన ముందడుగు. నాణ్యమైన విత్తనోత్పత్తి మరియు బీ బీ ఎస్ ఎస్ ఎల్ ద్వారా పంపిణీ చేయడం వల్ల దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది వ్యవసాయం మరియు సహకార రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది, దిగుమతి చేసుకున్న విత్తనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది, "మేక్ ఇన్ ఇండియా"ను ప్రోత్సహిస్తుంది మరియు 'ఆత్మనిర్భర్ భారత్'కు మార్గం సుగమం చేస్తుంది.

 

సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు గత 27 నెలల్లో చేపట్టిన 54 కొత్త కార్యక్రమాలపై సహకార మంత్రిత్వ శాఖ అధికారుల ప్రదర్శనతో సింపోజియం ప్రారంభమవుతుంది. దేశం నలుమూలల నుండి దాదాపు 2000 మంది ప్రతినిధులతో పాటు, వేలాది మంది కూడా వర్చువల్ మీడియం ద్వారా ఈ ఒక రోజు సింపోజియంలో పాల్గొంటారు.

 

దేశంలోని మూడు ప్రధాన సహకార సంఘాలు - ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో), క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) మరియు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) మరియు భారత ప్రభుత్వం యొక్క రెండు ప్రధాన చట్టబద్ధమైన సంస్థలు - నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్ డీ డీ డీబీ) మరియు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీ డీ సి) సంయుక్తంగా  బీ బీ ఎస్ ఎస్ ఎల్ని స్థాపించారు.

 

***



(Release ID: 1971013) Visitor Counter : 42