మంత్రిమండలి

జాపాన్ - ఇండియా సెమికండక్టర్ సప్లయ్ చైన్ పార్ట్ నర్శిప్ అంశం లో భారతదేశాని కి మరియు జాపాన్ కు మధ్య సహకారాని కి సంబంధించిన జ్ఞాపనపత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 25 OCT 2023 3:20PM by PIB Hyderabad

జాపాన్- ఇండియా సెమికండక్టర్ సప్లయ్ చైన్ పార్ట్ నర్ శిప్ అంశం లో భారతదేశ గణతంత్రాని కి చెందిన ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ ఫర్మేశన్ టెక్నాలజి మంత్రిత్వ శాఖ కు మరియు జాపాన్ కు చెందిన ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ కు మధ్య 2023వ సంవత్సరం జులై లో సంతకాలైన సహకారం సంబంధి జ్ఞాపన పత్రం (ఎంఒసి) యొక్క వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది.

పరిశ్రమలు మరియు డిజిటల్ సాంకేతికతల లో పురోగతి కై సెమికండక్టర్ లు పోషించే పాత్ర కు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ, సెమికండక్టర్ సప్లయ్ చైన్ ను వృద్ధి చెందింప చేసే విషయం లో భారతదేశాని కి మరియు జాపాన్ కు మధ్య సహకారాన్ని బలపరచాలనేది ఎంఒసి ఉద్దేశ్యం గా ఉంది.

ఈ ఎంఒసి ఇరు పక్షాలు సంతకాలు చేసిన రోజు నుండి అమలై, అయిదు సంవత్సరాల పాటు వర్తింపు లో ఉంటుంది.

ప్రతికూల స్థితి లో సైతం కార్యకలాపాలను సమర్థం గా జరిపేటట్లు గా సెమి కండక్టర్ సప్లయ్ చైన్ ను తీర్చిదిద్దేందుకు పరస్పర పూరక సామర్థ్యాల ను మరియు అవకాశాల ను వినియోగించుకోవడం కోసం జి2జి మరియు బి2బి ల పరం గా ఉభయ పక్షాలు ఒకదాని తో మరొకటి సహకరించుకోనున్నాయి.

సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐటి) రంగం లో ఉపాధి అవకాశాల కై మెరుగైన సహకారాన్ని అందించాలనేది ఈ ఎంఒసి యొక్క ఉద్దేశ్యం గా ఉంది.

పూర్వరంగం:

ఎలక్ట్రానిక్స్ తయారీ లో అనుకూల స్థితి ని కల్పించడం కోసం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజి మంత్రిత్వ శాఖ (ఎమ్ఇఐటివై) చురుకు గా పనిచేస్తోంది. భారతదేశం లో ఒక బలమైన మరియు దీర్ఘకాలం పాటు మనుగడ లో ఉండేటటువంటి సెమికండక్టర్ ఎండ్ డిస్ ప్లే ఇకో సిస్టమ్ ను అభివృద్ధి పరచడానికి పూచీపడడం కోసమని ప్రోగ్రామ్ ఫార్ డెవలప్ మెంట్ ఆఫ్ సెమికండక్టర్ ఎండ్ డిస్ ప్లే మేన్యుఫేక్చరింగ్ ఇకో సిస్టమ్ ను ప్రవేశ పెట్టడమైంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటి అంటే అది సెమికండక్టర్ ఫాబ్స్, డిస్ ప్లే ఫాబ్స్, ఫాబ్స్ ఫార్ కాంపౌండ్ సెమికండక్టర్/ సిలికాన్ ఫొటోనిక్స్/ సెన్సర్ స్/ డిస్ క్రీట్ సెమికండక్టర్ ఎండ్ సెమికండక్టర్ అసెంబ్లి, టెస్టింగ్, మార్కింగ్ ఎండ్ ప్యాకేజింగ్ (ఎటిఎమ్ పి) /అవుట్ సోర్స్ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) సదుపాయాల ను ఏర్పాటు చేయడాని కి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేయడం. దీని అదనం గా, దేశం లో సెమికండక్టర్ ఎండ్ డిస్ ప్లే మేమాన్యుఫేక్చరింగ్ ఇకోసిస్టమ్ ను అభివృద్ధి పరచడం కోసం తగిన వ్యూహాల ను అమలు చేయడాని కి గాను డిజిటల్ ఇండియా కార్పొరేశన్ (డిఐసి) లో భాగం గా ఇండియా సెమికండక్టర్ మిశన్ (ఐఎస్ఎమ్) ను స్థాపించడమైంది.

 

సమాచార సాంకేతికత రంగం లో అగ్రగామి రంగాలలో మరియు కొత్త గా ఉనికి లోకి వస్తున్న రంగాల లో అంతర్జాతీయ సహకారాన్ని ద్వైపాక్షిక ఫ్రేమ్ వర్క్ మరియు ప్రాంతీయ ఫ్రేమ్ వర్క్ లను ఆసరా గా తీసుకోవాలని ఎమ్ఇఐటివై ని ఆదేశించడం జరిగింది. ఈ ఉద్దేశ్యంతో . ఎమ్ఇఐటివై ద్వైపాక్షిక సహకారాన్ని, ఇంకా సమాచారం ఆదాన ప్రదానాన్ని మరియు సప్లయ్ చైన్ లో ఆటుపోటులను తట్టుకొనే స్వభావాన్ని పెంపుచేయడం కోసం వివిధ దేశాల కు చెందిన సరిసాటి సంస్థల తో /ఏజెన్సీల తో ఎంఒయు లను/ఎంఒసి లను/ ఒప్పందాల ను కుదుర్చుకొంది. భారతదేశాన్ని ఒక విశ్వసనీయమైన భాగస్వామి గా ఎదగాలన్నది దీని వెనుక లక్ష్యం గా ఉంది. ఈ ఎంఒయు మాధ్యం అనేది భారతదేశ కంపెనీలకు మరియు జాపాన్ కంపెనీల కు మధ్య పరస్పర లాభదాయకమైన సెమికండక్టర్ సంబంధి వ్యాపార అవకాశాల ను మరియు భాగస్వామ్యాల ను ముందుకు తీసుకు పోయే దిశ లో మరొక ముందడుగు గా ఉంటుంది.

రెండు దేశాల మధ్య నెలకొన్న అనుబంధాన్ని దృష్టి లో పెట్టుకొని, 2018 వ సంవత్సరం అక్టోబరు లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాపాన్ ను సందర్శించిన సందర్భం లో ఇప్పటికే సహకారం కొనసాగుతున్న రంగాల ను మరింత గా ప్రోత్సహిస్తూనే ‘‘డిజిటల్ ఐసిటి టెక్నాలజీస్’’ పైన కూడాను శ్రద్ధ ను తీసుకొంటూ ఎస్&టి/ఐసిటి ల పరం గా సహకారాని కి సంబంధించిన సరిక్రొత్త కార్యక్రమాల ను చేపట్టడానికని ‘‘ఇండియా-జాపాన్ డిజిటల్ పార్ట్ నర్ శిప్ (ఐజెడిపి) ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే అమలవుతున్న ఐజెడిపి మరియు ఇండియా-జాపాన్ ఇండస్ట్రియల్ కంపిటిటివ్ నెస్ పార్ట్ నర్ శిప్ (ఐజెఐసిపి) లను దన్ను గా తీసుకొని, దానికి తోడు ప్రస్తుత జాపాన్-ఇండియా సెమికండక్టర్ సప్లయ్ చైన్ పార్ట్ నర్ శిప్ సంబంధి ఎంఒసి సైతం ఎలక్ట్రానిక్స్ ఇకోసిస్టమ్ రంగం లో సహకారాన్ని మరింత విస్తృతం గాను, గాఢం గాను మలచనుంది. పరిశ్రమలు మరియు డిజిటల్ సాంకేతికతలు పురోగమించడం లో సెమికండక్టర్ లు పోషించే ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ, ఈ ఎంఒసి సెమికండక్టర్ సప్లయ్ చైన్ లో ఎటువంటి ఆటుపోటులనైనా సరే ఎదుర్కొనే స్థోమత ను అందించనుంది.

 

***(Release ID: 1970929) Visitor Counter : 130