ప్రధాన మంత్రి కార్యాలయం
దుర్గ పూజ నాడు దేశ ప్రజల కు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
అష్టమి సందర్భం లో మాత మహా గౌరి కి ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
22 OCT 2023 10:32AM by PIB Hyderabad
దుర్గ పూజ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన కుటుంబ సభ్యులు అయినటువంటి దేశ వాసులు అందరి కి శుభాకాంక్షల ను తెలియజేశారు. అందరి ని సంతోషం గాను మరియు ఆరోగ్యం గాను ఉంచవలసిందని దేవి ని వేడుకొంటూ ఆయన అర్చన చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో :
‘‘దేశం అంతటా గల నా కుటుంబ సభ్యుల కు దుర్గ పూజ తాలూకు అనేకానేక శుభాకాంక్షలు. దుర్గ మాత ప్రతి ఒక్కరి కి ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని మరియు సుఖవంతమైనటువంటి జీవనాన్ని అనుగ్రహించు గాక.’’ అని పేర్కొన్నారు.
అష్టమి సందర్భం లో మాత మహా గౌరి కి ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరించడం తో పాటు గా ఒక స్తుతి ని కూడా శేర్ చేశారు.
‘‘ఈ రోజు న మహాగౌరి మాత కు విశేషమైనటువంటి పూజ- అర్చన చేసేటటువంటి పవిత్రమైన రోజు. కరుణామయి మరియు అమోఘ ఫలదాయిని అయిన దేవి మాత తన సాధకులు అందరి కి ఆశీస్సుల ను అందించి, వారి కి మేలు ను చేయు గాక అని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1969984)
आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam