ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎన్ డబ్ల్యుటిఒ ద్వారా అత్యుత్తమ పర్యటన గ్రామం పురస్కారం దక్కినందుకు గుజరాత్ లోని ధోర్ డో ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 20 OCT 2023 3:34PM by PIB Hyderabad

ఐక్య రాజ్య సమితి ప్రపంచ పర్యటన సంస్థ (యుఎన్ డబ్ల్యుటిఒ) ద్వారా అత్యుత్తమ పర్యటన గ్రామం పురస్కారం గుజరాత్ లోని కచ్ఛ్ జిల్లా లో గల ధోర్ డో గ్రామాని కి దక్కినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధోర్ డో గ్రామాన్ని ఈ రోజు న ప్రశంసించారు.

ధోర్ డో కు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ప్రాప్తించాలి అని ఆయన కోరుకొంటూ, 2009 వ సంవత్సరం లో మరియు 2015 వ సంవత్సరం లో ఆ గ్రామాన్ని తాను సందర్శించినప్పటి చిత్రాలు కొన్నిటిని శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘కచ్ఛ్ లోని ధోర్ డో గ్రామం తన సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాని కి మరియు ప్రాకృతిక శోభ కు గాను కీర్తి ని దక్కించుకోవడం చూసి బలే పులకరించాను. ఈ యొక్క గౌరవం భారతదేశం పర్యటన రంగం యొక్క సామర్థ్యాన్ని కళ్ళ కు కట్టడం ఒక్కటే కాకుండా మరీ ముఖ్యం గా కచ్ఛ్ యొక్క ప్రజల సమర్పణ భావాన్ని కూడాను చాటి చెబుతున్నది.

ధోర్ డో గ్రామం ఇదే విధం గా వెలుగులీనుతూ మరి ప్రపంచం నలుమూలల నుండి సందర్శకుల ను ఆకట్టుకొంటూ ఉండు గాక.

నేను 2009 వ సంవత్సరం లోను, 2015 వ సంవత్సరం లోను ధోర్ డో గ్రామాన్ని సందర్శించినప్పటి జ్ఞాపకాల ను కొన్నిటిని శేర్ చేస్తున్నాను. మీరు ధోర్ డో గ్రామాని కి ఇంతకు ముందు వెళ్లినప్పటి మీ యొక్క స్మృతుల ను కూడాను వెల్లడి చేయవలసిందని మిమ్మల్ని కూడ నేను ఆహ్వానిస్తున్నాను. ఇది మరింత మంది అక్కడికి వెళ్ళేందుకు ప్రేరణ ను అందిస్తుంది. మరి, #AmazingDhordo ను ఉపయోగించడం మరచిపోకండి’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT



(Release ID: 1969716) Visitor Counter : 104