పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

విమానయాన రంగంలో భద్రత, సులభతర వ్యాపార నిర్వహణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ విమాన నిబంధనలు, 1937 కు సవరణలు


ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్, కమర్షియల్ పైలట్ లైసెన్స్ చెల్లుబాటు ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంపు

Posted On: 16 OCT 2023 11:40AM by PIB Hyderabad

విమానయాన రంగంలో భద్రత,సులభతర వ్యాపార నిర్వహణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ విమాన నిబంధనలు, 1937 కు ప్రభుత్వం సవరణలు చేసింది.సవరణలకు సంబంధించి 2023 అక్టోబర్ 10న గెజిట్‌ విడుదల అయ్యింది. వ్యాపారాన్ని సులభతరం చేయడం, విమానయాన రంగంలో  భద్రతా అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లో సవరణలు జరిగాయి. 

విమానయాన రంగంతో సంబంధం ఉన్న వివిధ వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రస్తుతం అమలులో ఉన్న నియంత్రణ భద్రత, భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైన  చర్యలు అమలు చేయడం లక్ష్యంగా నిబంధనలకు  సవరణలు చేశారు. ఈ సవరణ వల్ల అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు, సిఫార్సు చేసిన పద్ధతులకు సమానంగా   భారతదేశ విమానయాన నిబంధనలు అమలు జరుగుతాయి. భారత విమానయాన రంగంలో  అంతర్జాతీయ ప్రమాణాలు అమలు లోకి వస్తాయి. విమానయాన రంగంలో అమలు చేయనున్న కొన్ని  సంస్కరణలకు సంబంధించి 13.04.2023న  గెజిట్ నోటిఫికేషన్‌ వెలువడింది. విమాన నిబంధనలు, 1994 కు చేసిన  సవరణ (భవనం మరియు చెట్లు మొదలైన వాటి వల్ల ఏర్పడే అడ్డంకులను కూల్చివేయడం) పై నోటిఫికేషన్ వెలువడింది. 

విమాన నిబంధనలు, 1937 కు చేసిన సవరణల్లో రూల్ 39C కు చేసిన  సవరణ ముఖ్యమైన సవరణ.  ఈ సవరణ ప్రకారం ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ (ATPL) , కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) చెల్లుబాటును ఐదేళ్ల నుంచి  పదేళ్లకు పెరుగుతుంది.  ఈ మార్పు పైలట్‌లు,డిజిసిఏ  వంటి విమానయాన అధికారులపై పరిపాలనా భారాన్ని తగ్గించి మరింత క్రమబద్ధీకరించబడిన, సమర్థవంతమైన లైసెన్సింగ్ ప్రక్రియ అమలుకు దోహదపడుతుంది. 

విమాన నిబంధనలు,1937 రూల్ 66కు చేసిన సవరణ ప్రకారం విమానాశ్రయం  పరిసరాల్లో "ఫాల్స్ లైట్ల" వల్ల  ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సవరణ ప్రకారం . "కాంతి" అనే పదం పరిధిలోకి  లాంతరు లైట్లు, విష్ కైట్‌లు, లేజర్ లైట్లు వస్తాయి.  విమానాశ్రయం చుట్టూ 5 కిలోమీటర్ల నుండి 5 నాటికల్ మైళ్ల వరకు ప్రభుత్వ అధికార పరిధి అమలులో ఉంటుంది. విమానాల సురక్షిత నిర్వహణకు అంతరాయం కలిగించే లేదా ఆపరేటింగ్ సిబ్బందికి ప్రమాదాలను కలిగించే లైట్లను ప్రదర్శించే వ్యక్తులపై చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని సవరణలో స్పష్టంగా పేర్కొన్నారు. . అలాంటి లైట్లు 24 గంటలపాటు  ఉంటే  ఆ ప్రదేశంలోకి ప్రవేశించి వాటిని ఆర్పే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అదే సమయంలో, భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద చట్టపరమైన చర్య కోసం సంబంధిత పోలీసు స్టేషన్‌కు ఈ విషయం నివేదించబడుతుంది. గమనించిన కాంతి  మూలం గుర్తించబడనప్పుడు లేదా ఏర్పాటు చేసిన ప్రాంతం  మార్చినట్లయితే విమానాశ్రయం లేదా ఎయిర్‌లైన్ ఆపరేటర్ సంఘటనను చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి  వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయాల్సి  ఉంటుంది.

 విదేశీ లైసెన్సుల ధృవీకరణ కోసం అమలులో ఉన్న రూల్ 118  అనవసరం అని గుర్తించిన ప్రభుత్వం దానిని తొలగించింది. మారుతున్న  విమానయాన రంగం అవసరాలకు అనుగుణంగా   నిబంధనలను అమలు  సవరణ వీలు కల్గిస్తుంది. 

 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లైసెన్స్ కలిగి ఉన్నవారి నిరంతర యోగ్యతను నిర్ధారించేటప్పుడు రీసెన్సీ,  యోగ్యత అవసరాలను సరళీకృతం చేయడానికి  షెడ్యూల్ III కింద ఒక నిబంధన  అదనంగా జోడించబడింది. ఈ మార్పు పరిమిత కదలికలు లేదా వీక్షణ గంటలతో పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన సౌలభ్యాన్ని అందిస్తుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లైసెన్స్ కలిగి ఉన్నవారు  అత్యవసర పరిస్థితులతో సహా కనీసం పది గంటల అనుకరణ వ్యాయామాలను పూర్తి చేయాలి. తదనంతరం, వారు ఈ వ్యాయామాలను ప్రారంభించిన తర్వాత వరుసగా పది రోజులలోపు వారి సంబంధిత రేటింగ్ కోసం నైపుణ్యాన్ని అంచనా వేస్తారు. 

విమాన నిబంధనలు, 1937 కు చేసిన ఈ సవరణలు భారతదేశంలో విమానయాన రంగంలో విమానయాన భద్రత,  వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసం ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయి. ఈ సంస్కరణలు విమానయాన రంగం అభివృద్ధి, స్థిరత్వానికి  దోహదపడి  ప్రపంచ విమానయాన ప్రమాణాలు అమలు చేయడానికి అవకాశం కల్పిస్తాయి. 

 

***



(Release ID: 1968349) Visitor Counter : 66