ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి నేపథ్యంలో ఆయనకు ప్రధానమంత్రి నివాళి

प्रविष्टि तिथि: 15 OCT 2023 8:42AM by PIB Hyderabad

   భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన వినమ్ర జీవనశైలిని, శాస్త్రవిజ్ఞాన ప్రతిభను శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. డాక్టర్‌ కలామ్‌ దేశానికి అసమాన సేవలందించారని, జాతి హృదయాల్లో ఆయన చిరంజీవిగా నిలిచపోతారని పేర్కొన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“భారతీయుల హృదయాల్లో శాశ్వత స్థానం పొందిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి. డాక్టర్‌ కలామ్‌ నిరాడంబర, వినమ్ర జీవనశైలితోపాటు అసాధారణ శాస్త్రవిజ్ఞాన ప్రతిభను ప్రజలు సదా స్మరించుకుంటారు. దేశ నిర్మాణంలో ఆయన కృషి అనుపమానం.. చిరస్మరణీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1967857) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam