ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ లోని పిత్తోర్ గఢ్ లో రూ.4200 కోట్ల విలువ గల అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రధానమంత్రి
"జాతి రక్షణకు, విశ్వాసానికి చిహ్నం అయిన ఈ భూమిపై మీ అందరితో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను"
"ఉత్తరాఖండ్ పౌరుల పురోగతి, సంక్షేమం ప్రభుత్వ మిషన్ లో కీలకాంశం"
"ఈ దశాబ్ది ఉత్తరాఖండ్ దశాబ్ది కానుంది"
"ఉత్తరాఖండ్ లోని ప్రతి గ్రామంలోను దేశ రక్షకులున్నారు"
"ఈ గ్రామాల నుంచి విడిచి పోయిన వారందరినీ తిరిగి తీసుకురావాలని మేం ప్రయత్నిస్తున్నాం"
"తల్లులు, సోదరీమణులు ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని, అసౌకర్యాన్ని తొలగించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది"
"ఉత్తరాఖండ్ లో పర్యాటకం, తీర్థ యాత్రలను అభివృద్ధి చేయాలన్న డబల్ ఇంజన్ ప్రభుత్వం ప్రయత్నం ఇప్పుడు ఫలాలు అందిస్తోంది"
"ఉత్తరాఖండ్ లో అనుసంధానత విస్తరించడం వల్ల రాష్ట్రాభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది"
"దేశంలో ప్రతి ఒక్క ప్రాంతానికి, ప్రతి ఒక్క వర్గానికి సౌకర్యాల అనుసంధానత, గౌరవం, సుసంపన్నత కల్పించే సమయం అమృత కాలం"
Posted On:
12 OCT 2023 4:58PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ లోని పిత్తోర్ గఢ్ లో రూ.4200 కోట్ల విలువ గల బహుళ అభివృద్ధి ప్రొజెక్టలులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభించారు. వాటిలో గ్రామీణాభివృద్ధి, రోడ్డు, పవర్, నీటి పారుదల, మంచి నీరు, ఉద్యానవనాలు, విద్య, ఆరోగ్యం, విపరీత్య నిర్వహణ ప్రాజెక్టులున్నాయి.
ఈ సందర్బంగా ప్రజనుద్దేశించి ప్రసంగిస్తూ తన పర్యటన సందర్బంగా వారు చూపిన అసాధారణ ప్రేమాభిమానాలు, అందించిన లెక్క లేనన్ని ఆశీస్సుల పట్ల ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ "ఇది ప్రేమాభిమానాల గంగ వర్షించినట్టుంది" అన్నారు. ఆధ్యాత్మికత, సాహసానికి మారు పేరైన ప్రత్యేకించి ధైర్యవంతులైన మాతృమూర్తుల భూమికి శ్రీ మోదీ శిరసు వంచి వందనం చేశారు. బైద్యనాథ్ ధామ్ వద్ద జై బద్రి విశాల్ అన్న గఢ్వాల్ రైఫిల్స్ సైనికుల ఉత్సాహం, ఉత్సుకత; గంగోలీహాట్ కాళీ మందిర్ వద్ద గంటల మోత కుమామ్ రెజిమెంట్ సైనికుల్లో కొత్త సాహసాన్ని నింపుతాయని అయన నొక్కి చెప్పారు. బైద్యనాథ్, నందాదేవి, పూరంగిరి, కాసర్ దేవి, కాంచీ ధామ్, కటార్ మాల్, నానక్ మట్ట, రీతా సాహిబ్...ఇంకా లెక్కలేని మందిరాలు మానస్ ఖండ్ లో ప్రధానమంత్రి గుర్తు చేస్తూ అవి ఈ భూమి వైభవాన్ని, వారసత్వ సంపదను చాటి చెబుతాయన్నారు. "ఉత్తరాఖండ్ లో మీ అందరితో ఉండడం ఎల్లప్పుడూ అదృష్టంగా భావిస్తాను" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
అంతకు ముందు పార్వతి కుండ్ లో ప్రధానమంత్రి పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్నారు. "ప్రతి ఒక్క భారతీయుని మంచి ఆరోగ్యం, వికసిత భారతం పటిష్ఠత కోసం నేను ప్రార్థించాను. ఉత్తరాఖండ్ ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరేలా ఆశీస్సులు అందించాలని నేను కోరాను" అని ప్రధానమంత్రి చెప్పారు.
సైనికులు, కళాకారులు, స్వయం సహాయక బృందాలతో తన సమావేశం గురించి ప్రస్తావిస్తూ భద్రత, సంపన్నత, స్సంస్కృతికి మూల స్తంభాలను కలుసుకోవడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ దశాబ్ది ఉత్తరాఖండ్ దశాబ్ది కానుంది అన్నారు. "ఉత్తరాఖండ్ ప్రజల పురోగతి, జీవన సౌలభ్యం కోసం అంకిత భావం, సమగ్రతతో పని చేసేందుకు మా ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పని చేస్తోంది" అన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలతో తన దీర్ఘకాలిక అనుబంధం, సన్నిహితత్వాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్ గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రం నుంచి తనకు మద్దతు, స్పందన లభించిందని చెప్పారు.
భారతదేశం వేస్తున్న అభివృద్ధి అడుగుల గురించి ప్రధానమంత్రి వివరించారు. "ప్రపంచం నేడు భారతదేశం, భారత ప్రజల వాటాను గుర్తిస్తోంది" అన్నారు. గత కాలం నాటి నిరాశావాహ స్థితికి భిన్నంగా నేడు భారత్ ప్రపంచ యవనికఫై నేటి సవాళ్లకు దీటుగా తన వాక్కును బలంగా వినిపిస్తోంది అన్నారు. భారత జి-20 అధ్యక్షతకు, శిఖరాగ్రం నిర్వహణ తీరుకు ప్రపంచ ప్రశంసలు అందిన విషయం గుర్తు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రజలు కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి ఆ ఘనతను ప్రజలకు ఆపాదించారు. ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించడంలో తాను 140 కోట్ల మంది విశ్వాసం, నమ్మకం పొందానన్నారు.
గత 5 సంవత్సరాల కాలంలో 13.5 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయపడ్డారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. అందరినీ చేర్చుకుంటూ పోయే వైఖరే ఇందుకు కారణమని పేర్కొంటూ దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నాయన్నారు, ‘‘ఈ ప్రపంచం ఒక అద్భుతం’’ అని చెబుతూ ఆ 14.6 కోట్ల మంది ప్రజల్లో మారుమూల, కొండ ప్రాంతాల్లో నివశిస్తున్న వారు కూడా ఉన్నారని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించగలదనేందుకు ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.
గతంలోని ప్రభుత్వాలు కూడా ‘‘గరీబీ హటావో’’ నినాదం ఇచ్చినా యాజమాన్య, బాధ్యత కల్పించడం ద్వారా మాత్రమే పేదరికం నిర్మూలించగలమని మోదీ చెప్పే మాట అని ప్రధానమంత్రి తెలిపారు. ‘‘మనందరం కలిసికట్టుగా పేదరికాన్ని నిర్మూలించగలం’’ అని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం చంద్రమండలం దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ ను విజయవంతంగా దింపగలిగిందంటూ ఇంతవరకు ఏ దేశం కూడా అది సాధించలేదని ఆయన గుర్తు చేశారు. ‘‘చంద్రయాన్ దిగిన ప్రదేశానికి శివశక్తిగా పేరు పెట్టారు, ఉత్తరాఖండ్ గుర్తింపు ఇప్పుడు చంద్రునిపై ఉంది’’ అన్నారు. ఉత్తరాఖండ్ లో ప్రతీ అడుగులోనూ శివశక్తి యోగ్ కనిపిస్తుందని ఆయన చెప్పారు.
భారతదేశ క్రీడాశక్తి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగ ప్రస్తావిస్తూ దేశం చారిత్రక గరిష్ఠ స్థాయిలో పతకాలు పొందిన విషయం గుర్తు చేశారు. ఆసియా క్రీడోత్సవాలకు ఉత్తరాఖండ్ 8 మంది అథ్లెట్లను పంపిందని, లక్ష్యసేన్, వందనా కటారియా నాయకత్వంలోని బృందాలుపతకాలు గెలుచుకున్నాయని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు సభలో పాల్గొన్న వారందరూ మొబైల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లు వెలిగించడం ద్వారా ఆ విజయానికి అభినందనలు తెలిపారు. అథ్లెట్లకు శిక్షణ, మౌలికవసతులు కల్పించడం ద్వారా ప్రభుత్వం వారికి పూర్తి మద్దతు ఇస్తున్నదని ప్రధానమంత్రి వెల్లడించారు. నేడు హల్ద్వానిలో హాకీ మైదానానికి, రుద్రాపూర్ లో వెలోడ్రోమ్ కు శంకుస్థాపన చేసినట్టు ప్రధానమంత్రి చెప్పారు. నేషనల్ గేమ్స్ కు హృదయపూర్వకంగా ఏర్పాట్లు చేస్తున్నందుకు రాష్ర్ట ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ఉత్తరాఖండ్ లోని ప్రతీ గ్రామం భారతదేశ సరిహద్దు రక్షకులను తయారుచేసింది’’ అని ప్రధానమంత్రి చెప్పారు. దశాబ్ది క్రితం నాటి ఒక ర్యాంక్, ఒకే పెన్షన్ డిమాండును ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. ఒక ర్యాంక్ ఒక పెన్షన్ పథకానికి ఇప్పటివరకు రూ.70,000 కోట్లు పైగా సొమ్ము బదిలీ చేశామని, దీని ద్వారా 75,000 మంది మాజీ సైనికుల కుటుంబాలు భారీగా ప్రయోజనం పొందాయని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి మా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి’’ అని ఆయన చెప్పారు. కొత్త సేవల అభివృద్ధి కూడా వేగంగా చోటు చేసుకుంటోందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి చోటు చేసుకోలేదని ఆయన సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించిన నిధులు పొరుగుదేశాలు ఆక్రమిస్తాయన్న భయాలుండేవని చెప్పారు. ‘‘నవ భారతం దేనికీ భయపడదు, ఇతరుల్లో కూడా భయాన్ని చొప్పించదు’’ అని ప్రధానమంత్రి అన్నారు. గత 9 సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో 4,200 కిలోమీటర్ల నిడివి గల రోడ్లు, 250 వంతెనలు, 22 సొరంగ మార్గాల నిర్మాణం జరిగినట్టు ఆయన తెలియచేశారు. నేటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ సరిహద్దు ప్రాంతాలకు రైల్వేలను తెచ్చే ప్రణాళికలు కూడా ప్రస్తుతం అమలులో ఉన్నాయన్నారు.
వైబ్రెంట్ గ్రామాల పథకం సరిహద్దు గ్రామాలను దేశంలో ప్రథమ గ్రామాలుగా మార్చాయని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘ఈ గ్రామాలను వదిలి వెళ్లిన వారికి వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో పర్యాటకం పెంచాలని మేం కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు. నీరు, ఔషధాలు, రోడ్లు, విద్య, వైద్య సదుపాయాల విషయంలో గతంలోని తప్పుడు విధానాల కారణంగా ప్రజలు గ్రామాలు వదిలిపోయారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో కొత్త సదుపాయాలు, మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. రోడ్లు, నీటిపారుదల వసతుల కల్పన ద్వారా యాపిల్ వ్యవసాయం కూడా విశేష ప్రయోజనం పొందుతుందని, నేడు ఈ ప్రాంతానికి పాలీ హౌస్ పథకం ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులపై రూ.1100 కోట్లు వ్యయం చేయనున్నట్టు ఆయన తెలిపారు. ‘‘ఉత్తరాఖండ్ లోని చిన్న రైతుల జీవితాలు మెరుగుపరిచేందుకు చాలా సొమ్ము ఖర్చు చేస్తున్నాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఉత్తరాఖండ్ రైతులు ఇప్పటివరకు రూ.2200 కోట్లకు పైగా నిధులు అందుకున్నారు’’ అని చెప్పారు.
ఉత్తరాఖండ్ లో తరతరాలుగా పండిస్తున్న శ్రీ అన్న గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ వాటిని ప్రపంచం అంతటా విస్తరించడానికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఉత్తరాఖండ్ లోని చిన్న రైతులు భారీ ప్రయోజనం పొందేలా దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభమయిందన్నారు.
మహిళా చోదక అభివృద్ధికి ప్రభుతవ్ తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూ ‘‘తల్లులు, సోదరీమణుల కష్టాలు, అసౌకర్యం తొలగించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే పేదవర్గాలకు చెందిన సోదరీమణులకు శాశ్వత ఇళ్ల నిర్మాణాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది, బ్యాంకు ఖాతాలు తెరిపించింది. ఉచిత చికిత్స, ఉచిత రేషన్ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది. హర్ ఘర్ జనల్ యోజన కింద ఉత్తరాఖండ్ లోని 11 లక్షల కుటుంబాల్లోని సోదరీమణులు పైప్ ల ద్వారా నీరందుకుంటున్నారు’’ అని చెప్పారు. ఎర్రకోట బురుజుల నుంచే మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించనున్నట్టు ప్రకటించిన పథకం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ డ్రోన్లు వ్యవసాయానికి, ఉత్పత్తుల రవాణాకు కూడా ఎంతో సహాయపడతాయని ఆయన చెప్పారు. ‘‘స్వయం సహాయక బృందాలకు అందించే డ్రోన్లు ఉత్తరాఖండ్ ను ఆధునికతలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి’’ అని ప్రధానమంత్రి చెప్పారు.
‘‘ఉత్తరాఖండ్ లోని ప్రతీ గ్రామంలోనూ గంగ, గంగోత్రి ఉన్నాయి. భగవాన్ శివుడు, నందా మంచుశిఖరాలపై కొలువై ఉన్నారు’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ లో సంతలు, కౌతింగ్, ధౌల్, పాటలు, సంగీతం, ఆహారం ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయి. పాండవ్ నాట్యం, చోళియా నాట్యం, మంగళ్ గీత్, ఫూల్దీ, హరేలా, భగ్వాల్, రమ్మాన్ వంటి సాంస్కృతిక ఉత్సవాలు ఉత్తరాఖండ్ ను సుసంపన్నం చేస్తాయి. అలాగే ఆర్సే, ఝాంగోర్ కీ ఖీర్, కఫులి, పకోడాలు, రైతాలు, అల్మోరాలు, బాల్ మిఠాయి, సింగోరి వంటి రుచుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాళీ గంగా, చంపావత్ లోని అద్వైత ఆశ్రమం వంటి ప్రదేశాల ద్వారా ఈ ప్రాంతంతో తనకు గల జీవితకాల బంధాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. చంపావత్ లోని అద్వైతాశ్రమంలో త్వరలోనే మరింత సమయం గడపాలన్న ఆకాంక్ష ఆయన ప్రకటించారు.
ఉత్తరాఖండ్ లో పర్యాటకం, తీర్థయాత్రల అభివృద్ధికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. ఈ ఏడాది ఉత్తరాఖండ్ కు చార్ ధామ్ యాత్రకు వస్తున్న యాత్రికుల సంఖ్య 50 లక్షలకు చేరుతోందన్నారు. బాబా కేదార్ ఆశీస్సులతో కేదార్ నాథ్ ధామ్ తొలి దశ పునర్నిర్మాణం పూర్తయిందని చెప్పారు. వందలాది కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ బద్రీనాథ్ ధామ్ అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయన్నారు. కేదార్ నాథ్ ధామ్, హేమ్ కుంట్ సాహిబ్ లలో రోప్ వేల నిర్మాణంతో ప్రయాణం తేలికైన విషయం కూడా ప్రస్తావించారు. కేదార్ నాథ్, మానస్ ఖండ్ మధ్య అనుసంధానత పెంచడం గురించి ప్రస్తావిస్తూ నేడు ప్రారంభించిన మానస్ ఖండ్ మందిర్ మాలా మిషన్ పథకం కుమాం ప్రాంతంలో పలు దేవాలయాల సందర్శన తేలిక చేస్తుందని, భక్తులు ఈ దేవాలయాల సందర్శించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
ఉత్తరాఖండ్ లో కనెక్టివిటీ పెంపునకు జరుగుతున్ ప్రయత్నాలతో రాష్ర్టాభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. చార్ ధామ్ మెగా ప్రాజెక్టు, అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన రోడ్ల నిర్మాణం, హృషీకేశ్-కర్ణప్రయాగ రైలు ప్రాజెక్టు వంటి వాటిని కూడా ఆయన ప్రస్తావించారు. ఉడాన్ ద్వారా అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాన్ని ఈ ప్రాంతం అంతటికీ విస్తరిస్తున్నట్టు చెప్పారు. బాగేశ్వర్-కనాలిచైనా, గంగోలిహాట్-అల్మోరా, తనక్ పూర్ ఘాట్-పితోర్ గఢ్ రోడ్డు ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు. ఇది సామాన్య ప్రజలకు సౌకర్యాన్ని పెంచడమే కాదు, పర్యాటకం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెంచుతుందన్నారు. అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేది పర్యాటక రంగం అన్న విషయం గుర్తు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం హోమ్ స్టేలను ప్రోత్సహించడం పట్ల శ్రీ మోదీ హర్షం ప్రకటించారు. ‘‘నేడు ప్రపంచంలో ఎవరైనా భారతదేశం రావాలనుకుంటున్నందు వల్ల రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింతగా విస్తరిస్తాం. భారతదేశాన్ని చూడాలనుకుంటున్న వారందరూ ఉత్తరాఖండ్ కూడా వస్తారు’’ అన్నారు.
ఉత్తరాఖండ్ వైపరీత్యాలకు గురయ్యే స్వభావం గల ప్రదేశం అని ప్రధానమంత్రి అంగీకరిస్తూ రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో వైపరీత్యాలను తట్టుకునే ప్రాజెక్టులపై రూ.4000 కోట్ల వరకు వ్యయం చేయనున్నట్టు తెలిపారు. ‘‘ఉత్తరాఖండ్ లో అలాంటి సదుపాయాలు నిర్మిస్తున్నాం. దీని వల్ల వైపరీత్యాలు ఏర్పడిన సమయాల్లో సహాయ, పునరావాస చర్యలు త్వరితగతిన చేపట్టే అవకాశం కలుగుతుంది’’ అన్నారు.
ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ ‘‘ప్రస్తుతం భారతదేశం అమృత కాలంలో ఉంది. దేశంలోని ప్రతీ ఒక్క ప్రాంతానికి, ప్రతీ ఒక్క వర్గానికి గౌరవంగా, సంపన్నంగా జీవించేందుకు సౌకర్యాలు అందుబాటులోకి తేవలసిన సమయం ఇది’’ అన్నారు. బాబా కేదార్, బద్రీ విశాల్ ఆశీస్సులతో జాతి తన సంకల్పాలను త్వరగా నెరవేర్చాలన్న ఆకాంక్ష ఆయన ప్రకటించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధమీ, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్వాపరాలు
ప్రధానమంత్రి జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుల్లో పిఎంజిఎస్ వై కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన 76 గ్రామీణ రహదారులు, 25 వంతెనలు, 9 జిల్లాల్లో 15 బిడిఓ కార్యాలయ భవనాలు ఉన్నాయి. కేంద్ర రోడ్డు నిధి కింద నిర్మించిన వాటిలో కౌసని-బాగేశ్వర్ రోడ్డు, ధారీ-దౌబా-గిరిచీనా రోడ్డు; నగాలా-కిచ్చా రోడ్డు ఉన్నాయి. అలాగే జాతీయ రహదారులపై అల్మోరా పెట్సాల్-పనువానౌలా-ధన్యా రోడ్డు (ఎన్ హెచ్ 309 బి), తనక్ పూర్-ఛల్తీ రోడ్డు (ఎన్ హెచ్ 125) రెండింటినీ అప్ గ్రేడ్ చేశారు. 38 పంపింగ్ మంచినీటి స్కీమ్ లు, 419 గ్రావిటీ ఆధారిత నీటి సరఫరా స్కీమ్ లు, మూడు గొట్టపు బావులు, పితోర్ గఢ్ లో ఒక కృత్రిమ సరస్సు ఉన్నాయి. అలాగే పితోర్ గఢ్-లోహాఘాట్ (చంపావత్) 132 కెవి ట్రాన్స్ మిషన్ లైన్, ఉత్తరాఖండ్ రాష్ర్టవ్యాప్తంగా 39 వంతెనలు, ప్రపంచ బ్యాంకు వైపరీత్య రికవరీ ప్రాజెక్టు నిధులతో డెహ్రాడూన్ లో నిర్మించిన ఉత్తరాఖండ్ రాష్ర్ట వైపరీత్య నిర్వహణ సంస్థ భవనం కూడా వాటిలో ఉన్నాయి.
శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో ,398 పాలీ-హౌస్ నిర్మాణ ప్రాజెక్టు ఉంది. వీటి వల్ల పూలు, కూరగాయల ఉత్పత్తి, నాణ్యత పెరుగుతాయి. అధిక డెన్సిటీ గల ఇంటెన్సివ్ యాపిల్ ఆర్కడ్స్ పెంపకం స్కీమ్, ఐదు ఎన్ హెచ్ రోడ్ల అప్ గ్రేడేషన్ స్కీమ్, వైపరీత్య నిర్వహణకు సంబంధించి బహుళ అంచెల్లో చర్యలు తీసుకునే ప్రాజెక్టు కింద వంతెనల నిర్మాణం, డెహ్రాడూన్ లోని రాష్ర్ట అత్యవసర ఆపరేషన్ సెంటర్ స్థాయి పెంపు వంటివి ఉన్నాయి. బలియానలా, నైనిటాల్ లలో కొండచరియలు విరిగి పడడాన్ని నిరోధించే ప్రాజెక్టు; అగ్ని, ఆరోగ్య, అటవీ మౌలిక వసతుల మెరుగుదల ప్రాజెక్టు; 20 మోడల్ డిగ్రీ కళాశాలల్లో హాస్టల్, కంప్యూటర్ లాబ్ ల ఏర్పాటు; సోమేశ్వర్ లో 100 పడకల సబ్ జిల్లా ఆస్పత్రి నిర్మాణం; చంపావత్ లో 50 పడకల ఆస్పత్రి నిర్మాణం; నైనిటాల్ లోని హల్ద్వాని స్టేడియంలో ఆస్ర్టో టర్ఫ్ హాకీ గ్రౌండ్ నిర్మాణం; రుద్రాపూర్ లో వెలోడ్రోమ్ స్టేడియం నిర్మాణం ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. అంతే కాదు...జోగేశ్వర్ ధామ్ (అల్మోరా), హాత్ కాళిక (పితోర్ గఢ్), నైనాదేవి (నైనిటాల్) దేవాలయాల మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా మనస్ ఖండ్ మందిర్ మాలా మిషన్ స్కీమ్ కు కూడా శంకుస్థాపన చేశారు.
***
(Release ID: 1967605)
Visitor Counter : 102
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam