మంత్రిమండలి
azadi ka amrit mahotsav

డిజిటల్ పరివర్తన కై జనాభాస్థాయి లో విజయవంతం గా అమలు పరచిన డిజిటల్ పరిష్కారాల ను శేర్ చేసుకొనే రంగం లో సహకారంఅనే అంశం లో భారతదేశాని కి మరియు పపువా న్యూ గినీ కి మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి ఆమోదాన్ని తెలియజేసిన మంత్రిమండలి

Posted On: 11 OCT 2023 3:20PM by PIB Hyderabad

డిజిటల్ పరివర్తన కై జనాభా స్థాయి లో విజయవంతం గా అమలు పరచినటువంటి డిజిటల్ పరిష్కారాల ను శేర్ చేసుకొనే రంగం లో సహకారం కోసం భారతదేశం గణతంత్రాని కి చెందిన ఎలక్ట్రానిక్స్ ఎండ్ ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ ల మంత్రిత్వ శాఖ (ఎమ్ఇఐటివై) కి మరియు పపువా న్యూ గినీ యొక్క ఇన్ ఫర్ మేశన్ ఎండ్ కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ కు మధ్య 2023 జులై 28 వ తేదీ న సంతకాలు జరిగిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన ఆమోదాన్ని తెలియజేసింది.

 

 

వివరాలు:

ఈ ఎంఒయు ఇరు దేశాల లో డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేశన్ సంబంధి కార్యక్రమాల అమలు లో సన్నిహిత సహకారానికి, అనుభవాల ను మరియు డిజిటల్ టెక్నాలజీ ఆధారితమైన పరిష్కారాలు.. అంటే ఇండియా స్టాక్ (INDIA STACK) ను ఒక పక్షాని కి మరొక పక్షం అందజేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.

 

ఈ ఎంఒయు ఉభయ పక్షాలు సంతకాలు చేసిన తేదీ నాటి నుండి మొదలవుతుంది, ఇది మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.

 

 

ప్రభావం:

 

డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) రంగం లో జి2జి, ఇంకా బి2బి.. ఈ రెండిటి లో కూడ ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందింపజేసుకోవడం జరుగుతుంది.

 

 

ఐటి రంగం లో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే విధం గా ఉండేటటువంటి మెరుగైన సహకారాన్ని ఈ ఎంఒయు లక్షిస్తున్నది.

 

పూర్వరంగం:

ఐసిటి రంగం లో ద్వైపాక్షిక మరియు బహుళ పక్షీయ సహకారాన్ని పెంపొందింప చేసుకోవడాని కి గాను అనేక దేశాల తోను, బహుళ పక్షీయ సంస్థల తోను ఎమ్ఇఐటివై సమన్వయాన్ని ఏర్పరుచుకొంటున్నది. ఈ క్రమం లో, ఐసిటి డమేన్ లో సహకారం మరియు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం ఎమ్ఇఐటివై వివిధ దేశాల కు చెందిన సరిసాటి సంస్థల తో/ ఏజెన్సీల తో ఎంఒయు లను/ఎంఒసి లను/ఒప్పందాల ను కుదుర్చుకొన్నది. ఇది దేశాన్ని డిజిటల్ మాధ్యం పరం గా సాధికారిత కలిగిన సమాజం గాను, మరియు జ్ఞాన ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ గాను తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి వివిధ కార్యక్రమాల కు అనుగుణం గా ఉన్నది. ఈ పరివర్తన క్రమం లో, పరస్పర సహకారాన్ని పెంపొందింప చేసుకోవాలనే ఉద్దేశ్యం తో వ్యాపార అవకాశాల ను గా అన్వేషించవలసిన, సర్వోత్తమమైన కార్య ప్రణాళికల ను ఇచ్చి పుచ్చుకోవలసిన మరియు డిజిటల్ రంగం లోకి పెట్టుబడుల ను ఆకర్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

 

గత కొన్నేళ్ళలో, భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) అమలు లో నాయకత్వాన్ని చాటింది. కోవిడ్ మహమ్మారి కాలం లో సైతం ప్రజల కు సేవల ను విజయవంతం గా అందిస్తూ వచ్చింది. దీని ఫలితం గా, అనేక దేశాలు భారతదేశం యొక్క అనుభవాల నుండి నేర్చుకొనే విషయం లో మరియు భారతదేశం తో అవగాహనపూర్వక ఒప్పంద పత్రాల ను కుదుర్చుకోవడం లో ఆసక్తి ని కనబరచాయి.

 

ఇండియా స్టాక్ సాల్యూశన్స్ (India Stack Solutions) సార్వజనిక సేవల వరకు విస్తరించడం మరియు ఆ యా సేవల ను అందజేయడం కోసం జనాభా స్థాయి లో భారతదేశం ద్వారా అభివృద్ధి పరచినటువంటి, అమలులోకి తీసుకువచ్చినటువంటి ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోవకు చెందిన కార్యక్రమంలో భాగం. దీని ఉద్దేశ్యాలు కనెక్టివిటీ ని పెంచడమూ, డిజిటల్ ఇన్ క్లూఝను ను ప్రోత్సహించడమూ, సార్వజనిక సేవల ను ఎటువంటి అడ్డంకులు లేకుండా అందరి అందుబాటు లోకి తీసుకు పోవడమూను. దాపరికాని కి తావు లేనటువంటి సాంకేతికత ల పునాది మీద వీటి ని నిర్మించడమైంది. ఇవి ఇంటర్ ఆపరబల్ తరహా వి. అంతేకాక, పరిశ్రమ మరియు సాముదాయిక భాగస్వామ్యం ద్వారా ఉపయోగించుకోండం కోసం వీటి ని రూపుదిద్దడం జరిగింది. ఇవి నూతనమైన మరియు అన్ని వర్గాల ను కలుపుకు పోయే పరిష్కారాల ను ప్రోత్సహిస్తాయి. ఏమైనా, డిపిఐ రూపకల్పన లో ప్రతి ఒక్క దేశాని కి ప్రత్యేకమైనటువంటి అవసరాలు మరియు సవాళ్ళు ఎదురవుతాయి, అయినప్పటికీ మౌలికమైన కార్యసామర్థ్యం సమానం గా ఉన్నది. ఈ కారణం గా అది ప్రపంచ స్థాయి లో సహకారాని కి బాట ను పరుస్తుంది.

 

 

***

 


(Release ID: 1966882) Visitor Counter : 98