ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద రాష్ట్ర సామర్ధ్య నిర్మాణ వర్క్‌షాప్‌లను ప్రారంరంభించిన ఎన్ఇజిడి
Posted On:
10 OCT 2023 11:02AM by PIB Hyderabad
రాష్ట్ర సామర్ధ్య నిర్మాణ వర్క్‌షాప్‌లను జాతీయ ఇ- గవర్నెన్స్ విభాగం, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, తన సామర్ధ్య నిర్మాణ పథకం వారి నాలెడ్జ్ భాగస్వాముల సహకారంతో అందిస్తోంది. సేవల బట్వాడాను మెరుగుపరచడంలో ఉద్భవిస్తున్న సాంకేతికతల సామర్ధ్యాన్ని విప్పిచెప్పి, విధానాలను రూపొందించి, నూతన డిజిటల్ రంగాలకు చోటిచ్చేందుకు వ్యూహాలను రూపొందించడం ఈ వర్క్‌షాప్‌ల లక్ష్యం.
ఇందులో భాగంగా మొదటి వర్క్‌షాప్‌ను 9-12 అక్టోబర్ 2023న మహారాష్ట్రలో నిర్వహిస్తున్నారు. ఇందులో మహారాష్ట్రలోని వివిధ విభాగాలకు చెందిన 28కి పైగా అధికారులు పాల్గొననున్నారు.నాలుగు రోజుల లోతైన శిక్షణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కార్యక్రమాలను అవలంబించడం, అమలు చేయడాన్ని కొనసాగించడాన్ని నిర్వహించేందుకు విధాన రూపకల్పన చేసే ప్రభుత్వ అధికారుల కింద పని చేసే బృందాన్ని పరిచయం చేసేందుకు ఉద్దేశించింది. వర్క్‌షాప్‌ను ఐటి డైరెక్టర్ & ఎన్ఇజిడి, వాధ్వానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & పాలసీ (డబ్ల్యుఐటిపి) సినియర్ అధికారులు ప్రారంభిస్తారు.
ప్రారంభం అయిన వెంటనే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఏవి తమ శాఖలకు ఉన్న అవసరాలకు సరైన పరిష్కారాన్ని అమలు చేయడానికి తోడ్పడతాయో నిర్ణయించడానికి సీనియర్ ప్రభుత్వ అధికారులకు తోడ్పడేలా ఉండే సెషన్ల శ్రేణిని మొదలు పెట్టారు. నిజ జీవిత కేస్ స్టడీలపై ముఖాముఖి సెషన్లు, పరికరాల ప్రదర్శనలు, ఐడియాలను కల్పనలు, పైలట్‌లు లేదా ప్రాజెక్టులకు రుజువుగా మార్చే దార్శనికత కోసం వర్క్‌షాప్ పరిశ్రమ, ప్రభుత్వం నుంచి విషయ నిపుణుల శ్రేణిని ఈ వర్క్‌షాప్ ఒక దగ్గరకు తీసుకువస్తుంది.
ఆగస్టు 2023న ప్రారంభమైన ఈ వర్క్‌షాప్‌లు ప్రభుత్వం, పరిశ్రమల సహసంస్థల మధ్య భాగస్వామ్యంతో విశిష్టమైనవి. వీటిద్వారా ప్రభుత్వ సేవలను అందించడం, పాలనను పటిష్టం చేయడం, మెరుగైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రభుత్వం సమర్ధవంతంగా ఉపయోగించవచ్చు. తదనంతర వర్క్‌షాప్‌లను కేరళ, లడాఖ్, తెలంగాణ, తదితర ప్రాంతాలలో నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
***
(Release ID: 1966632)
Visitor Counter : 74