యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చైనాలో కొన‌సాగుతున్న 19 ఆసియా క్రీడ‌ల‌లో 100 ప‌త‌కాల‌ను దాటినందుకు క్రీడాకారుల‌ను అభినందించిన శ్రీ అనురాగ్ ఠాకూర్‌


ప్ర‌ధాని మోడీ దార్శ‌నిక‌త‌, ఆయ‌న క‌ల్పించిన సౌక‌ర్యాలు, క్రీడాకారుల ప‌ట్టుద‌ల, కృషి అన్న‌వి భార‌త్ 100 ప‌త‌కాల‌ను దాటేందుకు దోహ‌దం చేశాయిః శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 07 OCT 2023 12:36PM by PIB Hyderabad

చైనాలో జ‌రుగుతున్న 19వ ఆసియా క్రీడ‌ల‌లో 100కు పైగా ప‌త‌కాల‌ను సాధించినందుకు అందులో పాలుపంచుకుంటున్న క్రీడాకారుల‌కు కేంద్ర యువ‌జ‌న‌, క్రీడా వ్య‌వ‌హారాల మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. 140 కోట్ల భార‌తీయుల త‌ర‌ఫున క్రీడాకారుల‌కు నా అభినంద‌న‌లు. భ‌విష్య‌త్ క్రీడాకారుల‌కే వీరే స్ఫూర్తి అని ఆయ‌న పేర్కొన్నారు. 72 సంవ‌త్స‌రాల ఆసియా క్రీడ‌ల చ‌రిత్ర‌లో, మ‌న క్రీడాకారులు అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు చేయ‌డ‌మే కాక కొత్త ఆసియా రికార్డుల‌ను సృష్టించార‌ని ఆయ‌న అన్నారు. అథ్లెటిక్స్‌లో 29 ప‌త‌కాలు, షూటింగ్‌లో 22 ప‌త‌కాల‌న్న‌ది కొత్త రికార్డు. ప్ర‌ధాన‌మంత్రి మోడీ దార్శ‌నిక‌త‌, ఆయ‌న అందించిన సౌక‌ర్యాలు, క్రీడాకారుల ప‌ట్టుద‌ల‌, క‌ష్టించి కృషి చేయ‌డ‌మ‌న్న‌ది భార‌త్‌కు 100 ప‌త‌కాల‌ను ఖ‌రారు చేసింద‌ని శ్రీ అనురాగ్ ఠాకూర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ఆసియా క్రీడ‌ల‌లో చరిత్ర సృష్టించిన క్రీడాకారులంద‌రికీ త‌న సెల్యూట్ అంటూ ఆయ‌న అభినందించారు. 
ఆసియా క్రీడ‌ల‌లో హాకీ టీమ్ చాలా బాగా రాణించింద‌ని, భ‌విష్య‌త్తులో టోర్న‌మెంటుల‌కు ఆత్మ‌విశ్వాసంతో వెళ్లేందుకు ఇది తోడ్ప‌డుతుంద‌న్నారు. ప్ర‌ధాని మోడీ ఇచ్చిన‌ ఖేలోగే తో ఖిలోగే అన్న ప్ర‌త్యేక నినాదం, ఆలోచ‌న ప్ర‌క్రియ‌ను మార్చ‌డం, సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం ద్వారా ఫ‌లితాలు వ‌స్తాయ‌ని, నేడు అదే జ‌రుగుతోంద‌ని అన్నారు. 

 

***


(Release ID: 1965445) Visitor Counter : 142