ప్రధాన మంత్రి కార్యాలయం
పతక శతం… ఆసియా క్రీడల్లో భారత్ అసమాన ప్రతిభ: ప్రధానమంత్రి
క్రీడాకారుల బృందానికి 10న విందు… వారితో ముచ్చటించనున్న ప్రధానమంత్రి
Posted On:
07 OCT 2023 8:27AM by PIB Hyderabad
ఆసియా క్రీడలలో మన క్రీడాకారులు 100 పతకాల మైలురాయిని అధిగమించడంతో యావద్దేశం పులకించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో క్రీడాకారుల బృందం స్వదేశానికి చేరాక ఈ నెల 10వ తేదీన వారికి విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మన క్రీడాకారులు సాధించిన విజయాలు, అనుభవాల గురించి వారితో ముచ్చటిస్తారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల్లో భారతదేశానికి ఇదెంతో కీలక విజయం! మన క్రీడాకారులు 100 పతకాల మైలురాయిని అధిగమించినందుకు దేశ ప్రజలంతా సంతోషంతో పొంగిపోతున్నారు. ఈ చారిత్రక మైలురాయిని అందుకోవడంలో ప్రతిభా పాటవాలు చూపిన మన ఆటగాళ్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి అద్భుత ప్రదర్శన అబ్బురపరచి, మన హృదయాలను సంతోషంతో, గర్వంతో నింపింది. ఈ నేపథ్యంలో మన క్రీడాకారులు స్వదేశానికి రాగానే 10వ తేదీన వారికి విందు ఇవ్వడం కోసం నేను ఎదురుచూస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1965323)
Visitor Counter : 123
Read this release in:
Kannada
,
English
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam
,
Assamese
,
Odia
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri