ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముంబయి లోని గోరేగాఁవ్లో మంటలు చెలరేగిన కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్నుండి పరిహారాన్ని ప్రకటించారు

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2023 12:50PM by PIB Hyderabad
  • లోని గోరేగాఁవ్ లో మంటలు చెలరేగిన దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున మరియు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ముంబయి లోని గోరేగాఁవ్ లో జరిగిన ఓ అగ్ని ప్రమాదం కారణం గా ప్రాణనష్టం సంభవించిందని తెలుసుకొని ఎంతో బాధపడ్డాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. బాధితుల కు చేతనైన అన్ని విధాల సహాయాన్ని అధికారగణం అందిస్తున్నారు.

 

మృతుల యొక్క దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున మరియు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.

*****

DS/TS


(రిలీజ్ ఐడి: 1965049) సందర్శకుల సూచీ సంఖ్య : : 147
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam