కేంద్ర మంత్రివర్గ సచివాలయం

సిక్కింలో పరిస్థితిని సమీక్షించిన నేషనల్ సంక్షోభ నివారణ కమిటీ (ఎన్సిఎంసి)

Posted On: 04 OCT 2023 7:52PM by PIB Hyderabad

క్యాబినెట్ సెక్రటరీ శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన నేషనల్ సంక్షోభ నివారణ కమిటీ (ఎన్సిఎంసి) నిన్న సమావేశమై సిక్కింలో పరిస్థితిని సమీక్షించింది. సిక్కిం ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితుల గురించి కమిటీకి వివరించారు. సహాయ చర్యలను చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా ఆయన కమిటీకి వివరించారు. పరిస్థితిని అత్యున్నత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని హోంశాఖ కార్యదర్శి కమిటీకి తెలియజేశారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు కంట్రోల్ రూమ్‌లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి, సాధ్యమైన అన్ని సహాయాలు అందిస్తుందని చెప్పారు. 

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్) ఇప్పటికే మూడు బృందాలను మోహరించింది. అదనపు బృందాలు గౌహతి, పాట్నాలో సిద్ధంగా ఉన్నాయి. సహాయ పునరుద్ధరణ ప్రయత్నాలలో రాష్ట్రానికి సహాయం చేయడానికి తగిన సంఖ్యలో బృందాలు,  ఆర్మీ, వైమానిక దళం మోహరించారు. కేంద్ర ఏజెన్సీలు, సిక్కిం ప్రభుత్వం  సహాయ చర్యలను సమీక్షిస్తూ, క్యాబినెట్ సెక్రటరీ శ్రీ రాజీవ్ గౌబా మాట్లాడుతూ చుంగ్తాంగ్ డ్యామ్ సొరంగంలో చిక్కుకున్న వ్యక్తులు, పర్యాటకులను ప్రాధాన్యత ఆధారంగా సురక్షితంగా తెస్తున్నట్టు చెప్పారు. ఎన్డిఆర్ఎఫ్ అదనపు బృందాలను మోహరించాలని,  రహదారి, టెలికాం,   విద్యుత్ కనెక్టివిటీని సాధ్యమైనంత తక్కువ సమయంలో పునరుద్ధరించాలని ఆయనస్పష్టం చేశారు. 

అన్ని కేంద్ర ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయని, సహాయానికి అందుబాటులో ఉంటాయని క్యాబినెట్ సెక్రటరీ సిక్కిం ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.

ఈ సమావేశానికి కేంద్ర హోం కార్యదర్శి, సిక్కిం ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, విద్యుత్,  రోడ్ ట్రాన్స్‌పోర్ట్ & హైవేస్,మిలిటరీ వ్యవహారాలు, టెలికమ్యూనికేషన్స్ సెక్రటరీ, సెక్రటరీ, జలవనరులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

***



(Release ID: 1964525) Visitor Counter : 118