యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడలలో షూటింగ్, సెయిలింగ్, వుషు, టెన్నిస్‌లలో పతక విజేతలను కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సత్కరించి నగదు బహుమతులు అందజేశారు.

Posted On: 02 OCT 2023 5:34PM by PIB Hyderabad

ఆసియా క్రీడలు 2022 షూటింగ్, సెయిలింగ్, వుషు మరియు టెన్నిస్ బృందం నుండి తిరిగి వచ్చిన క్రీడాకారులను కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులను అభినందించారు. వారి విజయాలు దేశం గర్వించేలా ఉన్నాయని అన్నారు. క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆయన హామీ ఇచ్చారు. "నేను ఆటగాళ్లందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఫైనల్స్ (ఆసియా క్రీడలు) లో భారతదేశం నుండి క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.  త్వరలో పారిస్ ఒలింపిక్స్ జరుగుతాయి  అందరి దృష్టి దీనిపైనే ఉంది. అన్ని ఆటలలో 100 శాతం శ్రద్ధ ఇవ్వాలని ఆటగాళ్లను ప్రధాని మోడీ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్నారు, ”అని ఆయన అన్నారు.

 

సమాఖ్యల ప్రాముఖ్యత గురించి మరియు క్రీడాకారులకు మద్దతు ఇవ్వడంలో టీ ఓ పీ ఎస్ మరియు ఖేలో ఇండియా వంటి ప్రభుత్వ పథకాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, "ఫెడరేషన్‌లకు క్రీడలలో పెద్ద పాత్ర ఉంది. క్రీడాకారులకు  క్రీడలలో వారి దృష్టిని కొనసాగించాలనే లక్ష్యంతో టీ ఓ పీ ఎస్ 2014లో ప్రారంభించబడింది. ఖేలో ఇండియా పథకం కూడా అదే సహాయాన్ని అందించింది. నేను షూటింగ్ సమాఖ్య మద్దతు కు అభినందనలు తెలియజేస్తున్నాను. 2002 ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో రెండు పతకాలు సాధించగా, ఈసారి క్రీడల్లో ఎప్పుడూ లేనంతగా 22 పతకాలు సాధించాం.

 

“పారిస్ సైకిల్‌లో షూటింగ్ కోసం  మొత్తం 38 కోట్ల రూపాయలు ఖర్చు చేసాము. వుషు కోసం కూడా ఆసియాడ్‌కు ముందు రూ.1.8 కోట్ల వ్యయం తో క్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫైనల్స్ గేమ్స్‌కు 7 రోజులు మిగిలి ఉన్నందున మన దేశం ఇప్పటివరకు సాధించనన్ని అత్యధిక పతకాలను సాధిస్తామని నేను ఇప్పటికీ హామీ ఇస్తున్నాను" అని మంత్రి తెలిపారు.

 

హాంగ్‌జౌ గేమ్‌లలో విజయం సాధించడంలో తమకు సహాయం చేసినందుకు అథ్లెట్లు ప్రభుత్వానికి మరియు వారి సహాయక బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

వుషు రజత పతక విజేత రోషిబినా మాట్లాడుతూ, "మమ్మల్ని ఈ స్థితికి చేర్చినందుకు కోచ్‌లు, ఎస్ ఎ ఐ , ఫెడరేషన్‌కు రుణపడి ఉంటాము. నేను ఎస్ ఎ ఐ, ఎన్ సీ ఓ ఈ ఇంఫాల్‌లో శిక్షణ పొందాను వారు నన్ను ఇన్ని సంవత్సరాలు బాగా చూసుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యం తదుపరిసారి బంగారు పతకం సాధించడం"అన్నారు.

 

50మీ 3పి వ్యక్తిగత స్వర్ణ పతక విజేత సిఫ్ట్ కౌర్ మాట్లాడుతూ, "ఇది నా తొలి ఆసియా క్రీడలు మరియు  నా స్కోర్ ప్రపంచ రికార్డు అవుతుందని నేను ఊహించ లేదు. ఖేలో ఇండియా పథకం నాకు అత్యంత ప్రయోజనకరంగా ఉంది."

 

ఆసియాడ్‌లో కాంస్యం సాధించిన టోక్యో ఒలింపియన్ సెయిలర్ విష్ణు శరవణన్ మాట్లాడుతూ, "ఇది మా అందరికీ గొప్ప ఆసియా క్రీడలు. మాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన కోచ్‌లు, అధికారులు మరియు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇతర నావికులు భారతదేశం పటం పై  సెయిలింగ్‌ను ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఎస్ ఎ ఐ ఎ ఆర్ ఎన్  పూణే అందరికి వారందించిన మద్దతుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఇప్పుడు పారిస్‌ లో మన  ప్రధాన లక్ష్యంపై దృష్టి సారిద్దాం." సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులతో పాటు క్రీడాకారుల కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కూడా పాల్గొన్నారు.

 

***



(Release ID: 1963360) Visitor Counter : 119