ప్రధాన మంత్రి కార్యాలయం

సెప్టెంబర్‌ 24న తొమ్మిది వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లకు జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.


ఈ 9 వందే భారత్‌ రైళ్లు 11 రాష్ట్రాలమధ్య అనుసంధానతను పెంపొందిస్తాయి.

ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రాలైన పూరి, మధురై, తిరుపతిలకు వందే భారత్‌ అనుంసధానత ఏర్పడనుంది.

ఈ రైళ్లు, ఆయా రూట్లలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లుగా ఉంటాయి. ఇవి ప్రయాణికులకు చెప్పుకోదగిన సమయం ఆదా చేస్తాయి.

కొత్త రైళ్లు ప్రపంచశ్రేణి ప్రయాణ అనుభవాన్ని ప్రయాణికులకు కల్పించనున్నాయి. ఇది పర్యాటకాన్ని మరింతగా పెంపొందించనుంది.

Posted On: 23 SEP 2023 1:00PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023 సెప్టెంబర్‌ 24 వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా 9 వందేభారత్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ కొత్త వందేభారత్‌ రైళ్లు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య అనుసంధానతను పెంచాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా , అలాగే, రైలు ప్రయాణికులకు ప్రపంచశ్రేణి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలన్న సంకల్పంలో భాగంగా వీటిని ప్రారంభిస్తారు.
ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించే వందేభారత్‌ రైళ్లు కింది విధంగా ఉన్నాయి.
1. ఉదయ్‌పూర్‌` జైపూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌
2. తిరునల్వేలి` మధురై`చెన్నై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌
3.హైదరాబాద్‌ `బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌
4.విజయవాడ` చెన్నై (వయారేణిగుంట) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌
5.పాట్నా` హౌరా వందే భారత్‌ఎక్స్‌ప్రెస్‌
6. రాసర్‌ గోడ్‌`తిరువనంతపురం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌
7. రూర్కేలా` భువనేశ్వర్‌` పూరి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌
8. రాంచి` హౌరా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌
9. జామ్‌ నగర్‌` అహ్మదాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌
ఈ తొమ్మిది రైళ్లు 11 రాష్ట్రాలతో అంటే రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌,కర్ణాటక, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ, ఒడిషా, జార్ఖండ్‌ గుజరాత్‌లతో అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.

ఈ వందే భారత్‌ రైళ్లు అవి ప్రయాణించే మార్గాలలో అత్యంత వేగంగా వెళ్ళేరైళ్లుగా ఉంటాయి.వీటితో ప్రయాణికులకు తమ గమ్య స్థానం చేరడానికి చెప్పుకోదగిన సమయం ఆదా అవుతుంది. రూర్కేలా ` భువనేశ్వర్‌ `పూరి మార్గంలో నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అలాగే కాసర్‌ గోడ్‌` తిరువనంతపురం  వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆరూట్లో నడిచే రైళ్లకన్న  మూడు గంటలు ఆదా చేస్తు వేగంగా వెళతాయి. అలాగే హైదరాబాద్‌, బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయాన్ని రెండున్నర గంటలు ఆదా చేస్తుంది. తిరునల్వేఇ` మదురై`చెన్నై వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో రెండు గంటలు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రాంచీ `హౌరా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, పాట్నా` హౌరా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, జామ్‌నగర్‌`అహ్మదాబాద్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ లు గంట ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తాయి. ఉదయ్‌పూర్‌` జైపూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అరంగంట ప్రయాణసమయాన్ని ఆదాచేస్తుంది.

దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మికకేంద్రాలతో అనుసంధానత మెరుగుపడాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, రూర్కేలా` భువనేశ్వర్‌ ` పూరి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరునల్వేలి`మదురై`చెన్నై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలు పూరి , మదురై వంటి ప్రధాన ఆథ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేస్తాయి. అలాగే విజయవాడ
` చెన్నై మధ్య రేణిగుంట మీదుగా నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తిరుపతి పుణ్యక్షేత్రానికి అనుసంధానత పెంచుతుంది.
ఈ వందే భారత్‌ రైళ్లను ప్రశేశపెట్టడం వల్ల దేశంలో రైలుసేవలలో నూతన ప్రమాణాలను నెలకొల్పినట్టు అవుతోంది.ఈ రైళ్లు ప్రపంచశ్రేణి సదుపాయాలు కలిగిఉంటాయి. అలాగే భద్రతాపరంగా ఆధునిక ఫీచర్లు కలిగి ఉంటాయి. కవచ్‌సాంకేతికత కూడా ఇందులో ఉంది. ఆధునిక, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని సామాన్యుడికి, ప్రొఫెషనల్స్‌కు, వ్యాపారరంగంలోని వారికి,విద్యార్థులకు, పర్యాటకులకు అందుబాటులోకి తేవడంలో ఇది ఒక కీలక ముందడుగు.

 

***(Release ID: 1960018) Visitor Counter : 144