ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘నారీశక్తి వందన్ అధినియమ్’ కు ఆమోదం లభించిన తరువాత ప్రధానమంత్రి తో భేటీ అయిన మహిళా ఎంపీ లు 

प्रविष्टि तिथि: 22 SEP 2023 8:22AM by PIB Hyderabad

చరిత్రాత్మకమైనటువంటి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ కు నిన్నటి రోజు రాత్రి ఆమోదం లభించడం తో పార్లమెంటు మహిళా సభ్యులు వారి యొక్క ప్రసన్నత ను వ్యక్తం చేయడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు.

దీని పై ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘చురుకైన మన మహిళా ఎంపీ లతో సమావేశం అయ్యే గౌరవం నాకు దక్కింది, వారు నారీ శక్తి వందన్ అధినియమ్ కు ఆమోదం లభించినందుకు నిజంగా ఎంతో గొప్ప సంతోషిస్తున్నారు.

పరివర్తన కు మార్గదర్శకులు గా ఉన్నటువంటి వారు అదే శాసనం తాలూకు సంబురాన్ని జరుపుకోవడం కోసం ఒక్కుమ్మడి గా తరలిరావడం చూసి సంతోషం కలుగుతున్నది.

నారీ శక్తి వందన్ అధినియమ్ కు ఆమోదం లభించడం తో, భారతదేశం ఒక ప్రకాశవంతమైనటువంటి మరియు ఇదివరకటి తో పోలిస్తే అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి భవిష్యత్తు యొక్క శిఖరం మీద నిలబడివుంది. మరి ఈ పరివర్తన కు కేంద్ర స్థానం లో ఉన్నది ఎవరంటే అది మన నారీశక్తియే.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1959611) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam