రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
'స్వయంచాలిత పరీక్ష కేంద్రాల' ద్వారా రవాణా వాహనాలకు తప్పనిసరిగా సామర్థ్య పరీక్ష చేయించాలన్న తేదీని పొడిగిస్తూ ప్రకటన జారీ, తప్పనిసరి పరీక్ష తేదీని 1 అక్టోబర్ 2024గా మార్పు
Posted On:
21 SEP 2023 12:14PM by PIB Hyderabad
సీఎంవీఆర్ 1989లోని 175వ నియమం కింద నమోదైన 'స్వయంచాలిత పరీక్ష కేంద్రాల' ద్వారా రవాణా వాహనాలను తప్పనిసరిగా పరీక్షించాలన్న తేదీని కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పొడిగించింది. దీనిపై, 12 సెప్టెంబర్ 2023 తేదీన జీఎస్‌ఆర్ 663(ఇ) ప్రకటన విడుదల చేసింది.
కొత్త తేదీని ఇప్పుడు 1 అక్టోబర్ 2024కు మంత్రిత్వ శాఖ మార్చింది. నమోదుల కార్యాలయం పరిధిలో పని చేస్తున్న 'స్వయంచాలిత పరీక్ష కేంద్రాల్లో' మాత్రమే వాహన సామర్థ్యాన్ని పరీక్షించాలన్న నియమం కూడా ఈ ప్రకటన ద్వారా అమల్లోకి వస్తుంది.
ఇంతకుముందు, ఏప్రిల్ 5, 2022 నాటి జీఎస్‌ఆర్ ప్రకటన 272(ఇ)లో ఈ విధంగా ఉంది: (i) భారీ స్థాయి వస్తువుల రవాణా వాహనాలు/భారీ స్థాయి ప్రయాణీకుల మోటారు వాహనాలకు 01 ఏప్రిల్ 2023 నుంచి (ii) మధ్యస్థ స్థాయి వస్తువుల రవాణా వాహనాలు/మధ్యస్థ స్థాయి ప్రయాణీకుల మోటారు వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాలకు (రవాణా) 01 జూన్ 2024 నుంచి తప్పనిసరి పరీక్షలు చేయించాలి.
గెజిట్ ప్రకటన చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 1959321)
Visitor Counter : 157