ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అత్యవసర ఆరోగ్య సేవల గరిష్ట విస్తరణ కోసం 2023 సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆయుష్మాన్ భవ్ అభియాన్


గత మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా 30 వేలకు పైగా ఆయుష్మాన్ మేళాలు

ఆయుష్మాన్ భవ్ అభియాన్ లో భాగంగా గత మూడు రోజుల్లో 2.6 లక్షల మంది రోగుల నమోదు
గత మూడు రోజుల్లో 8 లక్షలకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ

గడిచిన మూడు రోజుల్లో 2.50 లక్షలకు పైగా ఎబిహెచ్ఎ ఐడీల తయారు
గత మూడు రోజుల్లో 10 లక్షల మందికి పైగా ఉచిత మందులు

Posted On: 20 SEP 2023 5:19PM by PIB Hyderabad

సేవా పఖ్వాడాలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా అత్యవసర ఆరోగ్య సేవల కోసం ఆయుష్మాన్ భవ్ అభియాన్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 13, 2023 న గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన 'ఆయుష్మాన్ భవ్' ప్రచారం దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ ప్రాప్యత, సమ్మిళితతను పునర్నిర్వచించడం , మొత్తం దేశం, మొత్తం సమాజ దృక్పథాన్ని ప్రతిబింబించడం లక్ష్యంగా పెట్టుకుంది. భౌగోళిక అడ్డంకులను అధిగమించి, ఎవరూ వెనుకబడకుండా చూడటం ద్వారా ప్రతి గ్రామం, పట్టణానికి సమగ్ర ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరించడం సేవా పఖ్వాడా ప్రధాన లక్ష్యం. 

ఆయుష్మాన్ భవ్ అభియాన్ లో భాగంగా, 2023 సెప్టెంబర్ 17 నుండి 30,000 కు పైగా ఆయుష్మాన్ మేళాలు పూర్తయ్యాయి, 2023 సెప్టెంబర్ 19 నాటికి 2.5 లక్షల మందికి పైగా రోగులు వచ్చారు. సెప్టెంబర్ 17, 2023 నుండి ఆయుష్మాన్ మేళాల సూచికలు ,లబ్ధిదారుల సమగ్ర జాబితా ఈ క్రింది విధంగా ఉంది:

దిగువ పట్టికలు ఆయుష్మాన్ భవ్ కింద ఆయుష్మాన్ మేళాల విజయాలను వివరిస్తాయి.

సూచీలు

17 సెప్టెంబర్ 2023 నుంచి మొత్తం నివేదిక 

వరస నెం

సూచీలు

17 సెప్టెంబర్ 2023 నుంచి మొత్తం  నివేదిక

1.

వెల్ నెస్/యోగా/మెడిటేషన్ సెషన్లు

21659

2.

నిర్వహించిన టెలికన్సల్టేషన్ల సంఖ్య

217896

3.

ఉచిత మందులు పొందిన వారి సంఖ్య

1018238

4.

ఉచిత రోగ నిర్ధారణ సేవలుపొందిన వారి సంఖ్యసేవలు

847760

5.

ఎ బి హెచ్ఎ (హెల్త్ ఐడీ) సృష్టి

250206

6.

ఆయుష్మాన్ కార్డు జారీ

133205

7.

ఆయుష్ సేవలు 

128391

8.

జీవన శైలి కౌన్సిలింగ్ 

930279

9.

మొదటి త్రైమాసికంలో రిజిస్టర్ చేసుకున్న , మొదటి ఎ ఎన్ సి చెకప్ పూర్తి చేసిన మొత్తం గర్భిణీ తల్లుల సంఖ్య

86036

10.

గుర్తించిన ఎస్ ఎ ఎం  పిల్లలు .

16997

11.

తల్లులకు ఇమ్యూనైజేషన్

49545

12.

చిన్నారులకు టీకాలు 

82281

13.

క్షయవ్యాధి స్క్రీనింగ్ ల సంఖ్య

261812

14.

హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ ల సంఖ్య

855616

15.

డయాబెటిస్ స్క్రీనింగ్ ల సంఖ్య

796620

16.

నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ ల సంఖ్య

613692

17.

రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ల సంఖ్య

332455

18.

గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ లసంఖ్య

196248

19.

కంటిశుక్లం స్క్రీనింగ్ ల సంఖ్య

261770

 

ఆయుష్మాన్ భవ్ క్యాంపెయిన్ లో భాగంగా గత మూడు రోజుల్లోనే 2.5 లక్షలకు పైగా ఎబిహెచ్ఎ ఐడీలు జనరేట్ అయ్యాయని, 10 లక్షల మందికి పైగా ఉచిత మందులు పొందారని, ఎనిమిది లక్షల మందికి పైగా ఉచిత  సేవలు పొందారని తెలిపారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీ, ఎ బి హెచ్ ఎ ఐడీల తయారీ,  నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, క్షయ (నిక్షయ్ మిత్ర), సికిల్ సెల్ వంటి కీలక ఆరోగ్య పథకాలు, వ్యాధి పరిస్థితులపై అవగాహన పెంచడం, రక్తదానం, అవయవ దానం ప్రచార కార్యక్రమాలలో  కీలక పాత్ర పోషించడం సేవా పఖ్వాడా లక్ష్యం.

సేవా పఖ్వాడా కింద అందించే సేవలను పొందడానికి, పౌరులు తమ సమీప ఆరోగ్య,  వెల్ నెస్ కేంద్రాలను సందర్శించేలా ప్రోత్సహించారు. 

వరస నెం

సూచీలు

17 సెప్టెంబర్ నుంచి మొత్తం నివేదిక 

1.

పూర్తి అయిన మొత్తం ఆరోగ్య మేళాలు 

2271

2.

నమోదైన రోగులు

2,64,042

వరస నెం

సూచీలు

17 సెప్టెంబర్ నుంచి లబ్ది పొందిన వారి సంఖ్య 

1.

జనరల్ ఒ పి డి నిసంప్రదించిన రోగులు

1,98,835

2.

స్పెషలిస్ట్ ఒ పి డి ని సంప్రదించిన రోగులుV

80601

3.

ముఖ్యమైన శస్త్రచికిత్సలు

870

4.

మైనర్ ఆపరేషన్లు 

2376

5.

హైపర్ టెన్షన్ నిర్ధారణ

27067

6.

చక్కెర వ్యాధి నిర్ధారణ

23594

7.

నోటి క్యాన్సర్ పరీక్ష/నిర్ధారణ 

3597

8.

రొమ్ము క్యాన్సర్ పరీక్ష/నిర్ధారణ 

2089

9.

సెర్వికల్ క్యాన్సర్ పరీక్ష/నిర్ధారణ 

1602

10.

క్యాటరాక్ట్ నిర్ధారణ

4884

11.

ఉపయోగించుకున్న ఆర్ సిహెచ్ సేవలు

23191

12.

ల్యాబ్ టెస్టులు 

103212

13.

రిఫర్ చేసినవి

5519

 


(Release ID: 1959290) Visitor Counter : 114