వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం 6467 స్టాండర్డ్ క్లబ్‌లను ఏర్పాటు చేసిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్


'ప్రామాణిక తరగతి' కోసం లక్ష రూపాయలు, ల్యాబ్‌ల కోసం 50,000 ఆర్థిక సహకారం

“స్టాండర్డ్స్ క్లబ్‌లు” ద్వారా యువతను తీర్చిదిద్దుతున్నబిఐఎస్

Posted On: 19 SEP 2023 10:10AM by PIB Hyderabad

  దేశవ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలల్లో 6467 స్టాండర్డ్ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు జాతీయ స్థాయిలో ప్రమాణాల అమలు కోసం కృషి చేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ( బిఐఎస్)  ప్రకటించింది.  ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే అంశంలో ప్రమాణాల ప్రాముఖ్యతపై యువతకి అవగాహన పెంపొందించే లక్ష్యంతో స్టాండర్డ్ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్టు బిఐఎస్ పేర్కొంది. 

“బలమైన, శక్తివంతమైన, చైతన్యవంతమైన భారతదేశం నిర్మాణంలో పిల్లలు  వాస్తుశిల్పులు గా ఉంటారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా పాఠశాలలు,కళాశాలల్లో స్టాండర్డ్స్ క్లబ్‌లను  ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  యువ మనస్సులలో నాణ్యత, ప్రమాణాలు, శాస్త్రీయ అంశాల పట్ల అవగాహన కల్పించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చి దిద్దడం లక్ష్యంగా “స్టాండర్డ్స్ క్లబ్‌లు” ఏర్పాటు అవుతాయి.వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సాధించడానికి   నాణ్యత పట్ల  స్పృహ, ప్రామాణీకరణ సూత్రాల అవగాహన కీలక అంశాలుగా ఉంటాయి. స్టాండర్డ్స్ క్లబ్‌ల ద్వారా    నాణ్యత, ప్రమాణాలు, ప్రామాణీకరణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి సమాజాభివృద్ధికి అవసరమైన వనరులను అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతుంది." అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్   తెలియజేసింది.

2021లో  స్టాండర్డ్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  ప్రణాళిక సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 6,467 పాఠశాలలు, కళాశాలల్లో స్టాండర్డ్స్ క్లబ్‌లను  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏర్పాటు చేసింది.  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏర్పాటు చేసిన స్టాండర్డ్స్ క్లబ్‌లలో   సైన్స్ నేపథ్యం గల  1.7 లక్షల మందికి పైగా  విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు  బిఐఎస్   ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన సంబంధిత పాఠశాల సైన్స్  ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.   పాఠశాల స్థాయిలో  5,562 స్టాండర్డ్స్ క్లబ్‌లు,  కళాశాల స్థాయిలో  905 క్లబ్‌లు, ఇంజినీరింగ్ కాలేజీల్లో 384 క్లబ్‌లు ఏర్పాటు అయి పనిచేస్తున్నాయి. 

 

ఈ స్టాండర్డ్స్ క్లబ్‌ల విద్యార్థి సభ్యులు 

•          ప్రామాణిక వ్యాస రచన  పోటీలు

•          క్విజ్ పోటీలు

•          చర్చలు, వ్యాసరచన, పోస్టర్ తయారీ

•          ప్రయోగశాలలు, పారిశ్రామిక యూనిట్లు సందర్శన వివిధ రకాల కార్యకలాపాలలో పాల్గొంటారు, 

“ యువ ప్రతిభావంతులకు నాణ్యత, ప్రామాణీకరణ రంగాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించే విధంగా క్లబ్బులు ఏర్పాటు అయ్యాయి. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు క్లబ్బులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.  ఈ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన  ఆర్థిక సహాయాన్ని ఆయా పాఠశాల/కళాశాల ద్వారా బిఐఎస్ అందిస్తోంది.   స్టాండర్డ్ క్లబ్‌ల నిర్వాహకులకు అవసరమైన  శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి,  విద్యార్థుల సభ్యుల  ల్యాబ్‌లు, పరిశ్రమ విభాగాలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అవగాహన పొందేలా చూసేందుకు సందర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు" అని బిఐఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

“ప్రాక్టికల్ లెర్నింగ్ ప్రాముఖ్యతను గుర్తించిన బిఐఎస్ ఆర్థిక సహాయాన్ని మరింత ఎక్కువ చేసింది. . స్టాండర్డ్స్ క్లబ్‌లు కలిగిన ఉన్నత, హయ్యర్ సెకండరీ అర్హత గల ప్రభుత్వ పాఠశాలలు గరిష్టంగా  వన్-టైమ్ లాబొరేటరీ గ్రాంటుగా  50,000/-  పొందుతాయి.  సైన్స్ ల్యాబ్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి అత్యాధునిక ల్యాబ్ పరికరాల ఏర్పాటుకు ఈ గ్రాంటు ఉపయోగపడుతుంది" అని బిఐఎస్ వివరించింది. 

“అభ్యాస వాతావరణం ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా జరిగేలా చూసేందుకు బిఐఎస్   1,00,000 రూపాయల వరకుఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. స్టాండర్డ్స్ క్లబ్‌లు ఏర్పాటైన ప్రభుత్వ సంస్థలలో 'ప్రామాణిక తరగతి గది'ని అభివృద్ధి చేయడానికి ఈ నిధులు సహకరిస్తాయి. ఈ కార్యక్రమం కింద  పాఠశాలలోని ఒక గదిలో  స్మార్ట్ టీవీలు, ఆడియో వీడియో సిస్టమ్‌లు, సరైన వెలుతురు, గోడలను అలంకరించడం మొదలైన ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తారు.  పునరుద్ధరించబడుతుంది.  భవిష్యత్తు నాయకుల పెరుగుదలను పెంపొందించడానికి,  ఉత్సుకత కలిగించడానికి  ఆవిష్కరణల పట్ల ఆకర్షితులు అయ్యే విధంగా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి అని బిఐఎస్ పేర్కొంది. 

“నాణ్యత ప్రమాణాల అమలుకు కృషి చేస్తున్న బిఐఎస్  యువతకు నాణ్యత, ప్రమాణాల పట్ల అవగాహన పెంపొందించి నవ భారతదేశం నిర్మాణానికి సహకారం అందిస్తోంది. దూరదృష్టితో బిఐఎస్ అమలు చేస్తున్న కార్యక్రమాలు నాణ్యత,  ప్రమాణాలను ప్రోత్సహించడమే కాకుండా బాధ్యతాయుతమైన, నాణ్యతపై  స్పృహ కలిగిన పౌరులుగా మారడానికి యువ తరానికి అవకాశం కల్పిస్తుంది." అని బిఐఎస్ వివరించింది. 

 

***


(Release ID: 1958725) Visitor Counter : 154