హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోం మరియు సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు మరియు ఆయన దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన దార్శనికత, అవిశ్రాంత కృషి మరియు నిస్వార్థ సేవతో కోట్లాది ప్రజల జీవితాల్లో శ్రేయస్సు మరియు విశ్వాసాన్ని తీసుకువచ్చారు.

నాయకత్వం, సున్నితత్వం మరియు కృషి యొక్క అద్వితీయ కలయిక శ్రీ నరేంద్ర మోదీలో ఉన్నాయి.

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధిలో గానీ, చంద్రయాన్‌-3 విజయంలో గానీ, మన దేశ ప్రయత్నాల స్థాయిని పరిధిని శ్రీ నరేంద్ర మోదీ పెంచారు. నేడు మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా సగర్వంగా ఎగురుతోంది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌తి భార‌తీయుని హృదయంతో అనుసంధానించ‌డంతోపాటు దేశాభివృద్ధితో వారిని అనుసంధానం చేయ‌డం చ‌రిత్ర‌లో అపూర్వమైన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

దేశంలోని లక్షలాది మంది నిరుపేద ప్రజలను పేదరికం నుండి విముక్తం చేసి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆయన సంకల్పం కారణంగా శ్రీ మోదీని ఈ రోజు 'దీన్మిత్ర' అని పిలుస్తారు.

మన దేశపు ప్రాచీన వారసత్వం ఆధారంగా గొప్ప మరియు స్వావలంబన కలిగిన భారతదేశానికి బలమైన పునాదిని నెలకొల్పేందుకు కృషి చేసిన శ్రీ నరేంద్ర మోదీ నవ భారతదేశానికి రూపశిల్పి.

అది ఒక సంస్థ అయినా లేదా ప్రభుత్వమైనా మనమ

Posted On: 17 SEP 2023 1:03PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. మరియు ఆయనకు దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యం లభించాలని ప్రార్థించారు. తన దార్శనికత, అవిశ్రాంత కృషి మరియు నిస్వార్థ సేవతో లక్షలాది మంది జీవితాల్లో శ్రేయస్సు మరియు విశ్వాసాన్ని తీసుకువచ్చిన దేశం యొక్క ప్రముఖ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని శ్రీ అమిత్ షా తన ఎక్స్‌ పోస్ట్‌లలో పేర్కొన్నారు. అలాగే ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి మాట్లాడుతూ శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, సున్నితత్వం మరియు కృషిల అద్వితీయ కలయిక అని అన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో అయినా లేదా చంద్రయాన్-3 విజయంలో అయినా అయన మన దేశ స్థాయిని మరియు పరిధిని మార్చారని..తద్వారా నేడు మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా సగర్వంగా ఎగురుతోందని చెప్పారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌తి భార‌తీయుని హృదయంతో అనుసంధానించారని, దేశాభివృద్ధితో వారిని అనుసంధానం చేయ‌డంచతో చ‌రిత్ర‌లో అపూర్వ‌మైన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించార‌ని శ్రీ అమిత్ షా అన్నారు. దేశంలోని లక్షలాది మంది నిరుపేదలను పేదరికం నుండి విముక్తం చేసి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆయన సంకల్పం కారణంగా శ్రీ మోదీని ఈరోజు 'దీన్మిత్ర' అని పిలుస్తారని తెలిపారు.

కేంద్ర హోం మరియు సహకార మంత్రి మాట్లాడుతూ శ్రీ నరేంద్ర మోదీ నవ భారతదేశానికి రూపశిల్పి అని, మన దేశ  ప్రాచీన వారసత్వం ఆధారంగా ఒక గొప్ప మరియు స్వావలంబన భారతదేశం కోసం బలమైన పునాదిని నెలకొల్పడానికి కృషి చేశారని చెప్పారు. అది ఒక సంస్థ అయినా లేదా ప్రభుత్వం అయినా మనమందరం శ్రీ మోదీ యొక్క 'నేషన్ ఫస్ట్' విధానం నుండి ప్రేరణ పొందామమని అలాంటి అపూర్వ నాయకుడి మార్గదర్శకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర సమరయోధులు ఊహించిన విధంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 9 సంవత్సరాలుగా భారతదేశం నిర్మితమవుతోందని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన ఎక్స్‌ లో ఒక వీడియోను కూడా పంచుకున్నారు.

 

***


(Release ID: 1958230) Visitor Counter : 162