హోం మంత్రిత్వ శాఖ
ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా టెక్నోక్రాట్లకు (సాంకేతిక నిపుణులకు) శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
వాసికెక్కిన ఇంజినీరు శ్రీ ఎం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన హోం మంత్రి
ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి రంగానికీ దోహదం చేయడం ద్వారా దేశ నిర్మాణంలో ఇంజినీర్లు కీలక పాత్ర పోషించారు
ఇటీవలి కాలంలో సాంకేతిక విప్లవాన్ని మలచడంలో వారి పాత్ర ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠను ఎంతో పెంచింది
విశ్వేశ్వరయ్యాజీ విస్త్రత స్థాయిలో నిర్మాణాలను రూపకల్పన చేసి, మలచడం ద్వారా తన మేధోపరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాలతో మన నాగరికతను బలోపేతం చేశారు
ఆయన చేసిన అభివృద్ధి నూతన తరాల మనసులోని కలలకు ప్రేరణగా ఉంటుంది
प्रविष्टि तिथि:
15 SEP 2023 1:39PM by PIB Hyderabad
ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా టెక్నోక్రాట్లకు (సాంకేతిక నిపుణులకు) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గొప్ప ఇంజినీరుగా చరిత్రకెక్కిన శ్రీ ఎం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. సర్ ఎం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజినీర్ల దినోత్సవంగా జరుపుకుంటారు.
ఎక్స్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేసిన శ్రీ అమిత్ షా, ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి రంగానికీ దోహదం చేయడం ద్వారా దేశ నిర్మాణంలో ఇంజినీర్లు కీలక పాత్ర పోషించారని అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో సాంకేతిక విప్లవాన్ని మలచడంలో వారి పాత్ర ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠను ఎంతో పెంచిందని అన్నారు. దేశ స్వప్నాలను నెరవేర్చేందుకు మరింతగా దోహదం చేసేలా ఈ దినోత్సవం వారికి స్ఫూర్తి నివ్వాలని ఆయన కోరుకున్నారు.
ఎక్స్‌లో చేసిన మరో పోస్టులో, విశ్వేశ్వరయ్యాజీ విస్త్రత స్థాయిలో నిర్మాణాలను రూపకల్పన చేసి, మలచడం ద్వారా తన మేధోపరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాలతో మన నాగరికతను బలోపేతం చేశారని కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అన్నారు. ఆయన చేసిన అభివృద్ధి నూతన తరాల మనసులోని కలలకు ప్రేరణగా ఉంటుంది, అన్నారు.
***
(रिलीज़ आईडी: 1957772)
आगंतुक पटल : 159