జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మెడికల్ టెక్స్‌టైల్స్‌ రంగంలో ముఖ్యంగా కోవిడ్ కాలంలో భారతదేశం అగ్రగామిగా నిలిచింది: శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్


మెడికల్ టెక్స్‌టైల్స్‌ రంగంలో పరిధి, అభివృద్ధి అంశాలపై 'మెడిటెక్స్ 2023' అంతర్జాతీయ సదస్సు నిర్వహించిన జౌళి మంత్రిత్వ శాఖ

Posted On: 14 SEP 2023 10:43AM by PIB Hyderabad

ది సౌత్ ఇండియా టెక్స్‌టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (SITRA) సహకారంతో  మెడికల్ టెక్స్‌టైల్స్‌ రంగంలో పరిధి, అభివృద్ధి అంశాలపై జౌళి మంత్రిత్వ శాఖ 'మెడిటెక్స్ 2023' అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది.   'మెడిటెక్స్ 2023: నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ (NTTM) కింద జౌళి మంత్రిత్వ శాఖ  సెప్టెంబర్ 13న ముంబైలో సదస్సు నిర్వహించింది. 

సదస్సులో భాగంగా  మెడికల్ టెక్స్‌టైల్స్ రంగంలో  ఇటీవలి చోటు చేసుకుంటున్న మార్పులు, అభివృద్ధికి గల అవకాశాలు, దిగుమతి ప్రత్యామ్నాయం, స్వదేశీ వైద్య వస్త్ర ఉత్పత్తి, డిమాండ్; వైద్య వస్త్రాలలో వ్యవస్థాపక మార్గాలు - భావన నుంచి మార్కెట్ వరకు; మెడికల్ టెక్స్‌టైల్స్ రంగం  భవిష్యత్తు, ప్రమాణాలు, సర్టిఫికేషన్, నియంత్రణ  అవసరాలు  లాంటి వివిధ అంశాలపై సాంకేతిక సదస్సులు నిర్వహించారు.  మెడికల్ టెక్స్‌టైల్స్‌లో 15 సంవత్సరాల కాలంలో జరిగిన  పరిశోధన అంశాల ఆధారంగా రూపొందిన : ఏ క్రిస్టల్ జూబ్లీ పబ్లికేషన్ (2008 - 2023) అనే పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.

సదస్సులో కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వినియోగదారుల విభాగాలు (ఆరోగ్యం, వైద్యం) అధికారులు, ప్రతినిధులు, సంస్థలు, పరిశ్రమల ప్రముఖులు, శాస్త్రీయ నిపుణులు, పరిశోధకులు మెడికల్ టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన నిపుణులు   పాల్గొన్నారు.

సదస్సులో కేంద్ర జౌళి,రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్ ముఖ్య అతిథి పాల్గొన్నారు.  ఆవిష్కరణలపై దృష్టి సారించడం, కొత్త ఉత్పత్తుల వాణిజ్యీకరణను పెంచడం, మెడికల్ టెక్స్‌టైల్స్ రంగంలో కొత్త సాంకేతికతలో పురోగతికి సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే దిశగా పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం మరింత పెరగాలని శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్ అన్నారు. 

పీపీఈ కిట్లు  మాస్క్‌ల ఉత్పత్తిలో భారతదేశం సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు. పీపీఈ కిట్లు, మాస్క్‌ల   ఎగుమతిలో భారతదేశం   ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా  ఎదిగిందని ఆమె తెలిపారు. 

ప్రధానమంత్రి ఆశించిన ఆత్మ నిర్భర్ భారత్,  వోకల్ ఫర్ లోకల్ విజన్‌ విధానాలకు అనుగుణంగా  భారతదేశంలో ముఖ్యంగా మెడికల్ టెక్స్‌టైల్స్ విభాగంలో యువకులు, స్టార్టప్‌లకు అవసరమైన సహకారం అందించి  బలోపేతం చేయాలని ఆమె అన్నారు. 

భారతదేశంలో టెక్స్‌టైల్స్ ,టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్ అన్నారు. దీనిలో భాగంగా జౌళి రంగానికి పిఎల్ఐ పథకం, పీఎం  మిత్రా పార్క్స్ పథకం, నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ (NTTM)తో సహా వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తూ పరిశ్రమ అభివృద్ధికి సహకారం  అందిస్తోందని ఆమె వివరించారు. 

భారతదేశంలో మెడికల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమ  భవిష్యత్తు కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి, కర్తవ్య కాలం లక్ష్యాలు సాధించడానికి అమలు చేయాల్సిన చర్యలు, ప్రణాళికపై సూచనలు, సలహాలు, అభిప్రాయాలు అందించాలని పరిశ్రమ వర్గాలకు మంత్రి సూచించారు.

కేంద్ర జౌళి శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ. రాజీవ్ సక్సేనా మాట్లాడుతూ  భారతదేశంలోని ప్యాక్‌టెక్ , మొబిల్‌టెక్‌తో పోలిస్తే  మెడికల్ టెక్స్‌టైల్స్ రంగం సాధించిన అభివృద్ధి  తక్కువగా ఉందని అన్నారు. అయితే,  జీవన నాణ్యతతో ప్రత్యక్ష సంబంధం కారణంగా మెడికల్ టెక్స్‌టైల్స్ రంగానికి ప్రాధాన్యత ఏర్పడిందని అన్నారు. 

 భారతదేశంలో  మెడికల్ టెక్స్‌టైల్స్ రంగం అభివృద్ధి సాధిస్తుందని శ్రీ.రాజీవ్ సక్సేనా అన్నారు.  మెడికల్ టెక్స్‌టైల్స్ రంగం  పరిశోధన, అభివృద్ధి, నైపుణ్యం నేపథ్యంలో భారతదేశంలో మెడికల్ టెక్స్‌టైల్స్ మార్కెట్ అభివృద్ధి సాధిస్తున్నదని  ఆయన పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని  మెడికల్ టెక్స్‌టైల్స్‌ ఉత్పత్తి జరగాల్సి ఉంటుందన్నారు. 

మెడికల్ టెక్స్‌టైల్స్‌లో విస్తృత ఆవిష్కరణలు, పరిశోధనలు అవసరమని, ముఖ్యంగా ఆధునిక  సాంకేతికతలపై దృష్టి సారించాలని శ్రీ. రాజీవ్ సక్సేనా అన్నారు.  శానిటరీ ప్యాడ్‌లు, డైపర్‌లు, ఇతర సర్జికల్ సూచర్‌లు వంటి వైద్య వస్త్ర వస్తువులు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయని తెలిపిన శ్రీ.రాజీవ్ సక్సేనా వీటిని దేశంలో అవసరాలకు సరిపోయే విధంగా ఉత్పత్తి చేయడానికి చర్యలు అమలు జరగాలన్నారు.  

 కూడా వివిధ మెడికల్ టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన రెగ్యులేటరీ అంశాలపై CDSCOతో జౌళి మంత్రిత్వ శాఖ కలిసి పని చేస్తుందని ఆయన తెలిపారు. శానిటరీ ప్యాడ్‌లు, డైపర్‌లతో సహా 6 మెడికల్ టెక్స్‌టైల్ వస్తువులకు సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌లను (QCOs) టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ త్వరలో విడుదల చేస్తుందని  ఆయన తెలిపారు.

స్టార్ట్ అప్  ప్రారంభ మార్గదర్శకాలు (గ్రేట్); మరియు విద్యా మార్గదర్శకాలు 2.0, టెక్నికల్ టెక్స్‌టైల్స్ ఉత్పత్తులు,  పరిశోధన, అభివృద్ధి కోసం  నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ (NTTM) లో పొందుపరచిన  వివిధ మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని శ్రీ. రాజీవ్ సక్సేనా పరిశ్రమ, సంస్థలకు సూచించారు.

ఐసిఎంఆర్ సైంటిస్ట్-ఎఫ్ డాక్టర్ శైలేష్ పవార్ భారతదేశంలో వైద్య పరికరాల అభివృద్ధిలో సాధించిన ప్రగతిని వివరించారు. కోవిడ్ -19 మహమ్మారి మాదిరిగానే ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం భారతదేశం సిద్ధమవుతున్నందున వైద్య వస్త్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. పర్యావరణాన్ని కలుషితం చేయని విధంగా వస్తువులు ఉత్పత్తి చేయడానికి మెడికల్ టెక్స్‌టైల్స్‌ రంగం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. 

టెక్నికల్ టెక్స్‌టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జౌళి మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ది సౌత్ ఇండియా టెక్స్‌టైల్ రీసెర్చ్ అసోసియేషన్  సభ్యుడు శ్రీ ఎస్.కే. సుందరరామన్ ప్రశంసించారు.

 

***


(Release ID: 1957291) Visitor Counter : 175