ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జి 20 శిఖరాగ్ర సమావేశం మూడవ సెషన్ లో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం

Posted On: 10 SEP 2023 12:49PM by PIB Hyderabad

అత్యున్నతులారా,

ప్రముఖులారా ,

నిన్న వన్ ఎర్త్ అండ్ వన్ ఫ్యామిలీ సెషన్స్ లో విస్తృతంగా చర్చలు జరిపాం. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే దార్శనికతకు సంబంధించి ఆశావహ ప్రయత్నాలకు రోజు జి-20 ఒక వేదికగా మారిందని నేను సంతృప్తి చెందుతున్నాను.

గ్లోబల్ విలేజ్ అనే కాన్సెప్ట్ ను అధిగమించి గ్లోబల్ ఫ్యామిలీ సాకారం అయ్యే భవిష్యత్తు గురించి మనం ప్రస్తుతం చర్చిస్తున్నాం. దేశాల ప్రయోజనాలు పెనవేసుకోవడమే కాదు, హృదయాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న భవిష్యత్తు ఇది.

మిత్రులారా,

జిడిపి కేంద్రిత విధానానికి బదులుగా మానవ కేంద్రిత దార్శనికత గురించి నేను నిరంతరం మీ దృష్టికి తెస్తున్నాను. నేడు భారతదేశం వంటి అనేక దేశాలు దానిని ప్రపంచంతో పంచుకుంటున్నాయి.

మానవాళి ప్రయోజనాల దృష్ట్యా చంద్రయాన్ మిషన్ డేటాను అందరితో పంచుకోవాలని భారత్ ఆశిస్తోంది. మానవ కేంద్రిత అభివృద్ధి పట్ల మా నిబద్ధతకు ఇది నిదర్శనం.


సమ్మిళిత అభివృద్ధిని పెంపొందించడానికిచివరి మైలు వరకు సేవల లభ్యతను సులభతరం చేయడానికి భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంది. మారుమూల గ్రామాల్లో సైతం చిరు వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు చేయగలుగతున్నారు.

భారతదేశం అధ్యక్షతన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక బలమైన ఫ్రేమ్వర్క్ ను అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా 'అభివృద్ధి కోసం డేటాను వినియోగించుకోవడంపై జీ20 సూత్రాలు' కూడా ఆమోదం పొందాయి.

గ్లోబల్ సౌత్ అభివృద్ధి కోసం 'డేటా ఫర్ డెవలప్ మెంట్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ 'ను ప్రారంభించాలని కూడా నిర్ణయం జరిగింది . జి 20 భారత ప్రెసిడెన్సీ సమయం లో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు కూడా ఒక పెద్ద అడుగు.

మిత్రులారా,

నేడు, కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానంలో అపూర్వమైన స్థాయి , వేగాన్ని మనం చూస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ముందు ఉన్న ఉదాహరణ. 2019లో 'ప్రిన్సిపల్స్ ఆన్ ఏఐ'ని స్వీకరించాం. రోజు మనం మరో అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది.

బాధ్యతాయుతమైన మానవ-కేంద్రీకృత నిర్వహణ కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దీనికి సంబంధించి భారత్ కూడా తన సూచనలు ఇస్తుంది. సామాజిక ఆర్థిక అభివృద్ధి, అంతర్జాతీయ శ్రామిక శక్తి, పరిశోధన- అభివృద్ధి వంటి  వంటి రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలను అన్ని దేశాలు పొందా లనేది మా ప్రయత్నం.

మిత్రులారా,

నేడు, మన ప్రపంచం కొన్ని ఇతర తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొంటోంది, ఇవి మన దేశాల వర్తమాన , భవిష్యత్తు  రెండింటినీ ప్రభావితం చేస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీ సవాళ్లను మనం ఎదుర్కొంటున్నాముక్రిప్టో కరెన్సీ రంగం సామాజికవ్యవస్థ, , ద్రవ్య , ఆర్థిక స్థిరత్వం పరంగా ప్రతి ఒక్కరికీ  కొత్త అంశంగా ఆవిర్భవించింది. అందువల్ల, క్రిప్టో కరెన్సీలను నియంత్రించడానికి మనం ప్రపంచ ప్రమాణాలను అభివృద్ధి చేయాలి. బ్యాంకు నియంత్రణపై బాసెల్ ప్రమాణాలు ఒక నమూనాగా మన ముందు ఉన్నాయి.

వీలైనంత త్వరగా దిశగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా, ప్రపంచ సహకారంసైబర్ భద్రతకు ఒక ఫ్రేమ్వర్క్ కూడా అవసరం.ఉగ్రవాదం సైబర్ ప్రపంచం నుండి కొత్త మార్గాలను , కొత్త నిధుల సమీకరణ పద్ధతులను ఉపయోగించుకుంటోంది, ఇది ప్రతి దేశ భద్రత , శ్రేయస్సుకు కీలకమైన సమస్యగా మారుతోంది.

ప్రతి దేశ భద్రతను, ప్రతి దేశ సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడే ఒకే భవిష్యత్ (వన్ ఫ్యూచర్) అనే భావన బలపడుతుంది.

మిత్రులారా,

ప్రపంచాన్ని మెరుగైన భవిష్యత్తు వైపు తీసుకెళ్లడానికి, ప్రపంచ వ్యవస్థలు వర్తమాన వాస్తవాలకు అనుగుణంగా ఉండటం అవసరం. నేడు " ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి " కూడా దీనికి ఉదాహరణ. ఐక్యరాజ్యసమితి ఏర్పాటయ్యేనాటికి ఆనాటి ప్రపంచం నేటికి పూర్తి భిన్నంగా ఉండేది. సమయంలో ఐక్యరాజ్యసమితిలో 51 వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో చేరిన దేశాల సంఖ్య 200.

అయినప్పటికీ, యు ఎన్ ఎస్ సి లో శాశ్వత సభ్యులు ఇప్పటికీ అలాగే ఉన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచం అన్ని విధాలుగా మారిపోయింది. రవాణా, కమ్యూనికేషన్, ఆరోగ్యం, విద్య ఇలా ప్రతి రంగం రూపురేఖలూ మారిపోయాయి. కొత్త వాస్తవాలు మన కొత్త ప్రపంచ నిర్మాణంలో ప్రతిబింబించాలి.

మారుతున్న కాలానికి అనుగుణంగా మారని వ్యక్తులు, సంస్థలు అనివార్యంగా తమ ఔచిత్యాన్ని కోల్పోవడం ప్రకృతి నియమం. గత కొన్నేళ్లుగా అనేక ప్రాంతీయ వేదికలు ఉనికిలోకి రావడానికి, అవి కూడా ప్రభావవంతంగా ఉండటానికి కారణమేమిటో మనం విశాల దృక్పథంతో ఆలోచించాలి.

మిత్రులారా,

నేడు, ప్రతి ప్రపంచ సంస్థ ను దాని ఔచిత్యాన్ని పెంచడానికి సంస్కరించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిన్న ఆఫ్రికా యూనియన్ ను జీ-20లో శాశ్వత సభ్యత్వం కల్పించే చారిత్రాత్మక చొరవ తీసుకున్నాం. అదేవిధంగా, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకుల ఆదేశాన్ని కూడా మనం విస్తరించాల్సి ఉంటుంది. దిశగా మనం తీసుకునే నిర్ణయాలు తక్షణ మైనవిగాను, ప్రభావవంతంగానూ ఉండాలి.

మిత్రులారా,

వేగవంతమైన మార్పులకు లోనవుతున్న ప్రపంచంలో, మనకు మార్పు మాత్రమే కాదు, సుస్థిరత , స్థిరత్వం కూడా అవసరం. రండిహరిత అభివృద్ధి ఒప్పందం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై కార్యాచరణ ప్రణాళిక, అవినీతి నిరోధక ఉన్నత స్థాయి సూత్రాలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎండీబీ సంస్కరణల తీర్మానాలను కార్యరూపంలోకి తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేద్దాం.

అత్యున్నతులారా,

ప్రముఖులారా ,

ఇప్పుడు నేను మీ ఆలోచనలు వినాలనుకుంటున్నాను.

(డిస్ క్లెయిమర్  - ఇది ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన కు సుమారు అనువాదం. ఒరిజినల్ ప్రెస్ స్టేట్ మెంట్ హిందీలో ఇచ్చారు.)

 

***


(Release ID: 1956234) Visitor Counter : 187