సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డిఈపిడబ్ల్యుడీ వినూత్న విధానాలు


వికలాంగుల జీవితాలు మార్చడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేస్తున్న డిఈపిడబ్ల్యుడీ

అంగవైకల్యం హక్కుల పరిధిని విస్తృతం చేసిన డిఈపిడబ్ల్యుడీ

డిఈపిడబ్ల్యుడీ కొత్తగా అమలు చేయనున్న 5 కార్యక్రమాలను ప్రారంభించనున్న కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ సహాయ మంత్రి కుమారి ప్రతిమ భూమిక్

Posted On: 10 SEP 2023 12:53PM by PIB Hyderabad

కార్యక్రమాల అమలులో సమూల మార్పులకు కేంద్ర  వికలాంగుల సాధికారత విభాగం ( డిఈపిడబ్ల్యుడీ ) శ్రీకారం చుట్టింది.సంపూర్ణ  సమగ్ర సమాజం అభివృద్ధి సాధన కోసం వినూత్న విధానాలను అనుసరించి పథకాలు, కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించింది. వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం కోసం వివిధ సంస్థలతో కలిసి పనిచేయడానికి ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించింది. సమాజంలో శాశ్వత మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో  డిఈపిడబ్ల్యుడీ ఒప్పందాలు కుదుర్చుకొంటోంది. దీనిలో భాగంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌తో డిఈపిడబ్ల్యుడీ ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  పరిశోధన కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన సమాచారం యూనిక్ డిసెబిలిటీ ఐడీ  (UDID) పోర్టల్ ద్వారా అందించడానికి, వికలాంగులకు  సాధికారత కల్పించడం, పీఎం దక్ష్ పోర్టల్ ప్రారంభం,  నైపుణ్యాభివృద్ధి  కార్యక్రమాలు అమలు చేయడానికి అవసరం అయిన సహకారం అందించడానికి  కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ అంగీకరించింది.  ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరుగుతాయి. ఒప్పందంలో భాగంగా వివిధ కేసుల్లో  న్యాయస్థానాలు  వైకల్య హక్కులపై ఇచ్చిన  తీర్పుల సంకలనాన్ని సమగ్ర బుక్‌లెట్‌గా రూపొందిస్తారు. వికలాంగుల కోసం ఏర్పాటైన  చీఫ్ కమిషనర్ వికలాంగులకు సంబంధించిన వివిధ  అత్యాధునిక ఆన్‌లైన్ కేస్ మానిటరింగ్ పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తుంది. డిఈపిడబ్ల్యుడీ అమలు చేయనున్న 5 వినూత్న కార్యక్రమాలను  కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత  శాఖ సహాయ మంత్రి  కుమారి ప్రతిమ భూమిక్  ప్రారంభిస్తారు. భారతదేశంలో వికలాంగుల జీవితాలు మెరుగుపరిచేందుకు సమగ్రతను పెంపొందించడం, వైకల్య హక్కుల పరిధిని విస్తరించడం, సాంకేతికతను ఉపయోగించుకోవడానికి డిఈపిడబ్ల్యుడీ ఇస్తున్న ప్రాధాన్యతను  ఈ కార్యక్రమాలు సమిష్టిగా ప్రతిబింబిస్తాయి.

డిఈపిడబ్ల్యుడీ అమలు చేయనున్న ఐదు వినూత్న  కార్యక్రమాలు:-

1. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌తో అవగాహన ఒప్పందం : బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్‌లలో సార్వత్రిక ప్రాప్యత కోర్సులను తప్పనిసరి చేయడానికి డిపార్ట్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA)తో సహకరిస్తుంది. ఈ ఒప్పందం వల్ల  ఆర్కిటెక్ట్‌లు, సివిల్ ఇంజనీర్‌ల కోసం గుర్తించిన రంగాలలో  ఆడిట్‌లను నిర్వహించడం కోసం ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫైడ్ కోర్సును ప్రారంభించడానికి కృషి జరుగుతుంది. 

2.అందుబాటులోకి రానున్న యూనిక్ డిసెబిలిటీ ఐడీ (UDID) సమాచారం:  పరిశోధన కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన సమాచార వివరాలు  పోర్టల్ ద్వారా డిఈపిడబ్ల్యుడీ కి లభిస్తుంది. దీనివల్ల వైకల్యం విభాగంలో సమాచార  ఆధారిత నిర్ణయం తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. అవగాహనను మెరుగుపరచడానికి, లక్ష్య సాధన మార్గాలు  తెలియజేయడానికి వివిధ స్థాయిలలో అవకాశం కలిగిస్తుంది. 

3. పీఎం  దక్ష్ పోర్టల్: వికలాంగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం సమగ్ర డిజిటల్ వేదికగా పీఎందక్ష్ పోర్టల్ ను డిఈపిడబ్ల్యుడీ అభివృద్ధి చేసింది. రిజిస్ట్రేషన్, నైపుణ్య శిక్షణ ఎంపికలు, ఉద్యోగ జాబితాలు, క్రమబద్ధమైన పరిపాలన ప్రక్రియలను పీఎం దక్ష్ పోర్టల్ అందిస్తుంది.

4. అందుబాటులో సమాచారం : వికలాంగుల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులు వెలువరించిన ప్రముఖ తీర్పులను  ఒక బుక్‌లెట్‌గా  రూపొందించారు.ఈ బుక్‌లెట్‌ ద్వారా వికలాంగులు, వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వారికి హక్కులపై పూర్తి సమాచారం సులువుగా తెలుసుకోవడానికి  ఉపయోగపడుతుంది.  

5.ఆన్‌లైన్ లో కేసుల ప్రగతి పర్యవేక్షణ కోసం సీసీపిడీ పోర్టల్: వికలాంగులు దాఖలు చేసిన ఫిర్యాదులను పరిశీలించడానికి  వికలాంగుల ప్రధాన కమిషనర్ ఒక అత్యాధునిక విధానాన్ని అమలు చేస్తారు. , మొత్తం ప్రక్రియనుకాగిత రహితంగా  సమర్ధవంతంగా అమలు జరుగుతుంది.సమస్యలు లేకుండా  ఆన్‌లైన్ లో  ఫిర్యాదు దాఖలు చేయడానికి , ఆటోమేటెడ్ రిమైండర్‌లు,సరళీకృతం వినికిడి సౌకర్యం కలిగించడానికి డిఈపిడబ్ల్యుడీ చర్యలు అమలు చేస్తుంది. 


***(Release ID: 1956041) Visitor Counter : 133