సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకు వచ్చిన ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్ కింద నాలుగు సంవత్సరాల కాలంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి చెందిన 1.8 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల విలువైన ఆస్తులు స్వాధీనం.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రివెన్షన్ ఆఫ్ మనీ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద 2014 నుంచి ఇంతవరకు 12 బిలియన్ యూఎస్ డాలర్లకు మించి విలువ చేసే నేరస్థుల ఆస్తులు జప్తు.. డాక్టర్ జితేంద్ర సింగ్

అక్టోబర్ 2022లో భారతదేశం 90వ ఇంటర్‌పోల్ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇటీవలి సంవత్సరాలలో నేరస్థులు, పారిపోయిన వ్యక్తులను అప్పగించడం ఎక్కువ అయ్యింది.. డాక్టర్ జితేంద్ర సింగ్

యూపీఏ హయాంలో 2005-2013 మధ్య సగటున 4 నేరస్థులు/పరారీలో వున్నవారిని భారతదేశానికి అప్పగించగా 2014లో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 10 కి పెరిగింది... డాక్టర్ జితేంద్ర సింగ్

ఈ సంవత్సరం ఇప్పటివరకు 19 మంది నేరస్థులు/పరారీలో ఉన్నవారిని భారతదేశానికి అప్పగించారు.. గతంలో సగటున 10 మంది నేరస్థులు/పరారీలో ఉన్నవారిని భారతదేశానికి అప్పగించగా 2022 లో 27 మంది, 2021లో 18 మందిని భారతదేశానికి అప్పగించారు.. డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 07 SEP 2023 4:18PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకు వచ్చిన ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్ కింద నాలుగు సంవత్సరాల కాలంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి చెందిన  1.8 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం  స్వాధీనం చేసుకుంది.  ప్రివెన్షన్ ఆఫ్ మనీ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద 2014 నుంచి ఇంతవరకు 12 బిలియన్  యూఎస్ డాలర్లకు మించి విలువ చేసే  నేరస్థుల ఆస్తులను ప్రభుత్వం  జప్తు. చేసుకుంది. ఈ వివరాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక, ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, అణు శక్తి శాఖ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి ( స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. సీబీఐ ప్రధాన కార్యాలయంలో విధి నిర్వహణలో ప్రతిభ చూపిన సీబీఐ అధికారులకు భారతీయ పోలీసు పథకాలు ప్రదానం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పాటైన  "అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవం" ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. 

2022 అక్టోబర్‌లో భారతదేశం 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇటీవలి సంవత్సరాలలో నేరస్థులు, పరారీలో ఉన్న వ్యక్తులను అప్పగించడం ఎక్కువ అయ్యింది అని   మంత్రి చెప్పారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 19 మంది నేరస్థులు/పరారీలో ఉన్నవారిని విదేశాలు భారతదేశానికి అప్పగించాయని డాక్టర్ జితేంద్ర  సింగ్ తెలిపారు.  గతంలో ఈ సంఖ్య సగటున 10 వరకు ఉందని అన్నారు.  2022 లో 27 మంది, 2021లో 18 మందిని భారతదేశానికి  తిరిగి పంపారన్నారు. 

2022 అక్టోబర్ నెలలో  ప్రధానమంత్రి ప్రారంభించిన 90వ ఇంటర్‌పోల్ సమావేశాలు జరిగాయని మంత్రి తెలిపారు. సమావేశాల సందర్భంగా ఆర్థిక నేరగాళ్ల అప్పగింతపై  భారతదేశం, ఇతర దేశాల మధ్య సహకారం పెరిగిందన్నారు.  సహకార పోలీసింగ్ ఫలితంగా నేరస్థులు/పరారీలో ఉన్నవారిని విదేశాలు  పెద్ద సంఖ్యలో  భారతదేశానికి అప్పగిస్తున్నాయని  డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

2018లో ఆర్థిక నేరగాళ్ల చట్టం అమలులోకి వచ్చిందని తెలిపిన  డాక్టర్ జితేంద్ర సింగ్  ఆర్థిక నేరగాళ్లపై మోదీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందని, ఆర్థిక నేరగాళ్లు, పారిపోయిన వ్యక్తులు, మనీలాండరర్ల నుంచి భారీ ఆస్తులను రికవరీ చేయడం, అటాచ్‌మెంట్ చేయడం లాంటి కఠిన చర్యలు అమలు చేస్తోందని మంత్రి వివరించారు. 

రేపు ఢిల్లీలో జీ- 20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో  "అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవం"కు భారతదేశం ఆతిధ్యం ఇచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇప్పటికే సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ  గురుగ్రామ్, రిషికేశ్, కోల్‌కతాలో అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశాలను నిర్వహించిందన్నారు. సమావేశాల్లో అంతర్జాతీయ సహకారంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిందని అన్నారు.  సమాచార భాగస్వామ్యం ద్వారా చట్ట అమలు సహకారం, ఆస్తుల పునరుద్ధరణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, అవినీతి నిరోధక అధికారుల సమగ్రత, ప్రభావాన్నిఎక్కువ చేసే అంశాలపై కలిసి పనిచేయాలని నిర్ణయించామని ఆయన వివరించారు. 

2018లో జరిగిన జీ -20 సదస్సులో  పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లపై చర్యలు, ఆస్తుల రికవరీ కోసం 9 పాయింట్ల ఎజెండాను ప్రధాని మోదీ సమర్పించిన అంశాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా  వర్కింగ్ గ్రూప్ నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేసారని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

2022 డిసెంబర్ 16న జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023 నుంచి సెప్టెంబర్ 7వ తేదీని అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిందని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  ఈ తీర్మానం అంతర్జాతీయ నేరాలను నిరోధించడం, ఎదుర్కోవడం, ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని నిరోధించడం,ఎదుర్కోవడం వంటి వివిధ రంగాలలో అంతర్జాతీయ, ప్రాంతీయ, ఉప-ప్రాంతీయ స్థాయిలలో సహకారం అవసరాన్ని గుర్తు చేసింది అని  ఆయన అన్నారు. ' సెప్టెంబర్  వార్షిక ఆచారం కోసం ఎంచుకున్న తేదీ, తేదీతో సమానంగా ఉంటుంది. ఇంటర్‌పోల్ ముందున్న ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమీషన్ (ICPC) 1923 సెప్టెంబర్ 7వ తేదీన  ప్రారంభమైంది. దీనిని దృష్టిలో వుంచుకొని 7వ తేదీని అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. 

పోలీసింగ్‌లో మహిళలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించడం అనేది ప్రారంభ అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవం యొక్క ప్రత్యేక ఇతివృత్తం అని నిర్వాహకులు  మంత్రికి తెలియజేశారు. 2023లో  ఇంటర్‌పోల్   తన శతాబ్ది ఉత్సవాలు  జరుపుకుంటుంది  ఇంటర్‌పోల్ లో  195 దేశాలు సభ్యత్వం పొందాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పోలీసు సంస్థగా ఇంటర్‌పోల్ గుర్తింపు పొందింది. 

 1941 నుంచి ప్రత్యేక పోలీసు సంస్థగా ఏర్పాటైన సీబీఐ తొలుత యుద్ధం, సరఫరా విభాగానికి సంబంధించిన లావాదేవీలలో లంచం, అవినీతి కేసులు పరిశోధించేదని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1963లో భారతదేశంలో పూర్తి స్థాయి అవినీతి నిరోధక సంస్థగా పని చేయడం ప్రారంభించింది. 

2023 సీబీఐ డైమండ్ జూబ్లీ ఇయర్ అని మరియు దాని 60 సంవత్సరాల కాలంలో  సీబీఐ భారతదేశ ప్రధాన దర్యాప్తు, అవినీతి నిరోధక ఏజెన్సీగా ఉద్భవించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.   లంచం,అవినీతి కేసుల  దర్యాప్తును నిర్వహించగల సామర్థ్యం గల సంస్థగా అంతర్గతంగా అభివృద్ధి చెందిందని మంత్రి అన్నారు.  రాష్ట్రాలు, రాజ్యాంగ న్యాయస్థానాలు అప్పగించిన సంచలనాత్మక, సంక్లిష్టమైన కేసులు, ఆర్థిక నేరాలు , బ్యాంకింగ్ మోసాలు కేసులను పరిపూర్ణ వృత్తి నైపుణ్యం, సమగ్రతతో నిర్వహించిన సీబీఐ కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ, శాసనసభ, ప్రజల  విశ్వాసాన్ని పొందింది.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ' ఏ సంస్థకు అయినా ప్రజల  విశ్వాసాన్ని పొందడం అంతిమ పరీక్షగా ఉంటుంది.సీబీఐ  ప్రజల విశ్వాసాన్ని పొందడమే కాకుండా, వేగంగా మారుతున్న సామాజిక-ఆర్థిక  సాంకేతిక పరిసరాలకు అనుగుణంగా పని తీరు మెరుగు పరుచుకుని ప్రత్యేక గుర్తింపు పొందింది.' అని  అన్నారు. . ఆన్‌లైన్ పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దోపిడీ, మానవుల అక్రమ రవాణా, డ్రగ్స్, వన్యప్రాణులు, సాంస్కృతిక ఆస్తులు, డిజిటల్ స్పేస్‌లో నేరాలకు సంబంధించిన పరిశోధనలను నిర్వహించడానికి సంస్థ పరిశోధనా విభాగాలు ఏర్పాటు చేసిందన్నారు. 

"నేరాన్ని ఎదుర్కోవడంలో ప్రాథమిక సూత్రాలు ఎప్పటికీ మారవు.   బలమైన అంతర్జాతీయ పోలీసు సహకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసుల మధ్య సహకారం పెంపొందిస్తుంది.  21వ శతాబ్దంలో నేరాలు, భద్రతా సవాళ్లతో పోరాడే సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఇది మార్గదర్శక సూత్రం కావాలి" అని  మంత్రి అన్నారు. 

అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్ సీబీఐ అధికారులకు పోలీసు పతకాలు  అందజేసి అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. సీబీఐకి, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

***

 


(Release ID: 1955528) Visitor Counter : 127