వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హిమాచల్‌ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌ల రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి పథకం,2017 కింద అదనపు నిధులకు క్యాబినెట్ ఆమోదం రూ.1164 కోట్ల అదనపు ఆర్థిక వ్యయానికి ఆమోదం

Posted On: 06 SEP 2023 3:50PM by PIB Hyderabad

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఐడీఎస్),2017 కింద హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌కు రూ.1164.53 కోట్లకు ఆమోదం తెలిపింది.

హిమాచల్‌ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు 23 ఏప్రిల్ 2018 నాటి నోటిఫికేషన్ నెం.2(2)/2018-ఎస్‌పిఎస్‌ ప్రకారం 2018లో భారత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి పథకం,2017ను ప్రకటించింది. ఈ పథకం కింద మొత్తం ఆర్థిక వ్యయం రూ.131.90 కోట్లు కేటాయించబడింది. ఈ కేటాయించిన ఫండ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అయిపోయింది. అయితే 2028-2029 వరకు కట్టుబడి ఉన్న బాధ్యతలను నెరవేర్చేందుకుగాను  అదనపు ఫండ్ అవసరం  రూ.1164.53 కోట్లుగా ఉంది. ఈ అదనపు ఆర్థిక వ్యయం కేటాయింపు కోసం పారిశ్రామిక అభివృద్ధి పథకం, 2017 కింద క్యాబినెట్ ఆమోదం కోరబడింది.

ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో హిమాచల్‌ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లకు అదనపు నిధుల అవసరాల కోసం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ మరియు పారిశ్రామిక అభివృద్ధి పథకం కోసం 2028-29 వరకు పథకం కింద కట్టుబడి ఉన్న బాధ్యతలను నెరవేర్చేందుకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ 2017 కోసం అంతర్గత వాణిజ్యం యొక్క ప్రతిపాదనను పరిశీలించి ఆమోదించింది.పై పథకం కింద అదనపు నిధుల ఆమోదం ప్రకారం పథకంలో ఈ కింద తెలిపిన ప్రోత్సాహకాలు ప్రయోజనం పొందుతాయి.

 

  • సెంట్రల్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ ఫర్ యాక్సెస్ టు క్రెడిట్  (సిసిఐఐఏసి):

హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కడైనా తయారీ మరియు సేవా రంగంలో గణనీయమైన విస్తరణపై అర్హత ఉన్న అన్ని కొత్త పారిశ్రామిక యూనిట్లు మరియు ఇప్పటికే ఉన్న పారిశ్రామిక యూనిట్లు పెట్టుబడిలో 30% క్రెడిట్ యాక్సెస్ కోసం సెంట్రల్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ (సిసిఐఐఏసి) అందించబడుతుంది. రూ.5.00 కోట్ల గరిష్ట పరిమితితో ప్లాంట్ మరియు మెషినరీపై ఇది వర్తిస్తుంది.

  • సెంట్రల్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఇన్సెంటివ్ (సిసిఐఐ):

హిమాచల్‌ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కడైనా వాటి గణనీయమైన విస్తరణపై అర్హత ఉన్న అన్ని కొత్త పారిశ్రామిక యూనిట్లు మరియు ఇప్పటికే ఉన్న పారిశ్రామిక యూనిట్లు వాణిజ్య ఉత్పత్తి/ఆపరేషన్ ప్రారంభ తేదీ నుండి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు భవనం మరియు ప్లాంట్ & మెషినరీ యొక్క బీమాపై 100% బీమా ప్రీమియం రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు.

చేసిన వ్యయం:


హిమాచల్ ప్రదేశ్ & ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఐడీఎస్, 2017 ఆర్థిక వ్యయం రూ.131.90 కోట్లు మాత్రమే. ఇది 2021-2022లో విడుదల చేయబడింది. ఇంకా, 2028-29 వరకు పథకం కింద అదనపు నిధుల అవసరాల ద్వారా కట్టుబడి ఉన్న బాధ్యతలను తీర్చడానికి ఈ పథకం కింద రూ.1164.53 కోట్ల అదనపు ఆర్థిక వ్యయాన్ని మంత్రివర్గం ఆమోదించింది.

ఇది 774 నమోదిత యూనిట్ల ద్వారా దాదాపు 48వేల 607 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పించగలదని అంచనా వేయబడింది.

 

****


(Release ID: 1955141) Visitor Counter : 135