సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

కేంద్ర సహ కార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, ఈరోజు న్యూఢిల్లీలో మేరి మాటి– మేరా దేశ్ ప్రచారం కింద, అమృత్ కలశ్ యాత్రను ప్రారంభించారు.


దేశ అభివృద్ధి కృషితోపాటు , దేశంలోని ప్రతి ఒక్కరిని దేశ భవిష్యత్తో భావొద్వేగపరంగా అనుసంధానం చేసేందుకు కృషి చేస్తుండడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి వ్యక్తి దేశానికి నాయకత్వం వహిస్తుండడం దేశం చేసుకున్న అదృష్టం .

‘మేరి మాటి– మేరా దేశ్– అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. ఇది దేశ భవిష్యత్తో అనుసంధానమయ్యే ఒక మాధ్యమం. ఇందులో భాగస్వాములు కావడం, దేశం సమున్నతంగా ఎదగడంలో భాగస్తులు కావడమే.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని రగిలించారు.

అద్భుత భారతావనిని నిర్మించేందుకు భారతీయులందరూ పంచ్ ప్రాణ్ లను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇవి అద్బుత భారతావని నిర్మాణానికి జాతీయ రహదారులవంటివి.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో నూతనదృక్కోణాన్ని ఆవిష్కరిస్తోంది: శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్

Posted On: 02 SEP 2023 11:59AM by PIB Hyderabad

 

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ  అమిత్ షా, ఈ రోజు న్యూఢిల్లీలో అమృత్ కలశ్ యాత్రను ప్రారంభించారు. మేరి మాటి– మేరా దేశ్ ప్రచారంలో భాగంగా దీనిని ప్రారంభించారు.
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర న్యాయ, చట్ట శాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ మతి మీనాక్షి లేఖి, కేంద్ర సాంస్క్రుతిక వ్యవహారాల

శాఖ కార్యదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, ఈ సాయంత్రం, భారత దేశం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు సాయంత్రం లా ఉందని అన్నారు. 2047 ఆగస్టు 15 నాటికి
భారతదేశం అంతర్జాతీయంగా అన్ని రంగాలలో ముందు వరుసలో ఉండేలా రానున్న అమృత్ కాల్ , సంకల్ప్ సే సిద్ధి  చేయనున్నాయని తెలిపారు.
మన స్వాతంత్ర్య సమరయోధులు కలలు కన్న విధంగా దేశాన్ని రాగల 25 సంవత్సరాలలో తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. గత 75 సంవత్సరాలలో ఇండియా ఎన్నో విజయాలు సాధించిందని, అయితే అవి సరిపోవని అన్నారు.
సుదీర్ఘకాలంపాటు లక్షలాది మంది ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, కష్టాలు అనుభవించారని వాటి ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధఙంచిందని, అన్నారు . గత 10 సంవత్సరాలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో,
అద్భుత భారతావని గా దేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కలసికట్టుగా ముందుకు వచ్చి సహకరించేందుకు దేశ పౌరులందరికీ అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు.

కేంద్ర హోం మంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, మేరి మాతి– మేరా దేశ్ కార్యక్రమం, దాని అర్థం ఏమిటో పేరులోనే తెలియజేస్తున్నదని చెప్పారు. మనం ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో నివశిస్తున్నామని,
ఇందుకు 1847 నుంచి 1947 వరకు ఎందరో త్యాగాలు చేశారని అన్నారు. 90 సంవత్సరాల  పాటు సుదీర్ఘంగా స్వాతంత్ర్యం కోసం పోరాటం జిగిందని, మనకు తెలిసిన, తెలియని ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణ త్యాగం చేశారని చెప్పారు.
 గుండెనిండా దేశభక్తిని నింపుకున్న వ్యక్తి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అని ఆయన అన్నారు. వారు. మట్టిని చేతబట్టి సంకల్ప్ సే సిద్ధి ప్రతిజ్ఞ చేశారని ,  ఆ విధంగా వారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఘన నివాళి అర్పించారని అన్నారు.
ఈ ఆలోచన వెనక ఉన్న ఉద్దేశం, ప్రతి వ్యక్తి, కుటుంబం, పౌరుడు, బాలలు అందరూ అద్భుత భారతావని నిర్మాణం అన్న ఆలోచనతో అందరూ ముడిపడేట్టు చేయడం.  సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు, ప్రతి ఇల్లు, వార్డు, గ్రామం నుంచి మట్టి లేదా ధాన్యాన్ని కలశంలో సేకరిస్తారన్నారు. అక్టోబర్ 1నుంచి 13 వరకు దీనిని బ్లాకు స్థాయిలో, ఆ తర్వాత 22 నుంచి 27 వరకు అక్టోబర్లో రాష్ట్రస్థాయివరకు సేకరిస్తారన్నారు. చివరగా అక్టోబర్ 28 నుంచి 30 వరకు 7,500 కళశౄలు న్యూఢిల్లీ చేరుకుంటాయని చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ అమృత కళశాలలోని మట్టిని ఢిల్లీలో ఏర్పాటు చేసిని అమృత వాటికలో ఉంచుతారని , దీనిని మన స్వాతంత్ర్య యోధుఉఉల స్మారకార్థం ఏర్పాటు చేశారని చెప్పారు.ఇది దేశంలోని ప్రతి ఒక్కరికి,
భారతదేశాన్ని ఈ అమృత కాలంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలన్న సంకల్పాన్ని గుర్తుచేస్తుందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ , ఇందుకు అనుగుణంగా పలు కార్యక్రమాలను ప్రారంభించారన్నారు. వీటిలో ప్రతి భారతీయుడు పాల్గొనేందుకు ఏర్పాటు చేశారన్నారు. ఎవరికివారు దేశానికి పునరంకితం అయ్యేందుకు,
5 కార్యక్రమాలను రూపొందించారన్నారు. ఈ కార్యక్రమాల కింద దేశంలోని ప్రతి గ్రామంలో ఇందుకు సంబంధించిన లక్ష్యాలతో ఫలకాన్ని ఎర్పాటు చేస్తారన్నారు. దేశ ప్రజలు చేపట్టిన పంచ్ ప్రాణ్ సంకల్పం, దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు సంబంధించనదని,
వసుధ వందన్ కార్యక్రమం కింద అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 మొక్కలను నాటడం జరిగిందని, ఇది మన స్వాతంత్ర సమరయోధులు, వీరులను  స్మరించుకుంటూ చేపట్టారని,  చెప్పారు.

 
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  కింద 2 లక్షల కార్యక్రమాలను  ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది మరోసారి దేశవ్యాప్తంగా దేశభక్తి ప్రేరణను అందించిందని చెప్పారు.
మేరి మాటి మేరీ దేశ్ కార్యక్రమంతో ఇవి పూర్తి అవుతాయన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు పంచ ప్రాణ్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజుల నుంచి దేశ ప్రజలను కోరారని చెప్పారు.
పంచ్ ప్రాణ్ సంకల్పం దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు ఒక జాతీయ రహదారి వంటిదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపుమేరకు 23 కోట్ల ఇళ్లు, కార్యాలయాలపై  త్రివర్ణపతాకం రెపరెపలాడిందన్నారు.
ప్రధాని పిలుపునందుకుని దేశం యావత్తు ఈ కార్యక్రమంలో పాల్గొనిందని, ఈ స్ఫూర్తితో మన చంద్రయాన్ కార్యక్రమం చంద్రుడిపై శివశక్తి పాయింట్ను చేరిందని చెప్పారు. ఇది దేశ ప్రజలు ఎంతో గర్వించదగ్గ సమయమని అన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసే కార్యక్రమంతో భారతీయులంతా గొప్పగా భావిస్తున్నారన్నారు.

దేశ భవిష్యత్తుతో ప్రతి ఒక్క వ్యక్తిని అనుసంధానం  చేయడం , ప్రతి ఒక్క వ్యక్తి కృషిని  దేశ పురోగతితొ అనుసంధానం చేయడం దేశ నాయకత్వానికి పరీక్ష అని ఇది దాని బాధ్యత అని అమిత్ షా అన్నారు. ఎంతో కాలం తర్వాత మనకు శ్రీ నరేంద్ర మోదీ వంటి వ్యక్తి ప్రధానమంత్రిగా
రావడం మన అదృష్టమన్నారు.ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కాలంలో ప్రపంచంలో మొదటి స్థానంలో భారతదేశం ఉండేట్టు చేస్తున్నారన్నారు. ఇవాళ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11 వ స్థానం నుంచి 5 వ స్థానానికి చేరకుందని,
త్వరలోనే ఇది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగ బోతున్నదని  చెప్పారు. ప్రతి భారతీయుడులో ఆత్మవిశ్వాస చైతన్యం నిండిందని ఆయన అన్నారు. ఇలాంటి ఆత్మవిశ్వాస కార్యక్రమాల ప్రేరణతో
మన సైనికులు సర్జికల్ దాడులు నిర్వహించారన్నారు. ఇదే ప్రేరణ మన శాస్త్రవేత్తలు కోవిడ్ 19 వాక్సిన్ రూపొందించడానికి , ఇస్రొ శాస్త్రవేత్తలు చంద్ర యాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడానికి , సూర్యుడి కక్ష్యకు ఉపగ్రహాన్ని పంపడానికి ప్రేరణనిచ్చిందన్నారు.

మేరి మాటి – మేరా దేశ్ అనేది ఒక కార్యక్రమం కాదని, ఇది ప్రజలను దేశ భవిష్యత్తుతో అనుసంధానం చేసే ఒక మాధ్యమమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములయ్యే లా చేయడం జరుగుతోందన్నారు.
మరో 25 సంవత్సరాల తర్వాత ప్రస్తుత తరం దేశాన్ని నడుపుతుందన్నారు. అప్పుడు వారు , గత తరం దేశాన్ని పటిష్టమైన దేశంగా రూపొందించడానికి సహకరించిందని వారు సంతృప్తి చెందుతారన్నారు..ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రి శ్రీ అర్జున్ రామ్మేఘవాల్, మేరి మాటి మేరాదేశ్ ప్రచారం, దేశ మొత్తం చరిత్రను , సంస్కృతిని , దేశం కోసం   మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తుందన్నారు.
ఇది మన సమష్టి గుర్తింపును ప్రతిబింబించే ఉత్సవమని అన్నారు. ఇండియా భిన్నత్వంతో కూడుకున్నదని, ఎన్నో రకాల మాండలికాలు , భాషలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనకు ఉమ్మడి వారసత్వం ఉన్నదన్నారు.
అందుకే మనం భిన్నత్వంలో ఏకత్వం అని చెబుతామన్నారు.ప్రపంచంలో తమ దేశాన్ని తల్లిగా భావించే ఒకే ఒక్క దేశం భారతదేశమని ఆయన అన్నారు. భరతమాతగా మనం సగర్వంగా పిలుచుకుంటామన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో నూతన కోణాన్ని ఆవిష్కరిస్తున్నదన్నారు.


భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5  వ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని, ప్రస్తుతం మనం 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా ముందుకు సాగిపోతున్నామన్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు మనమందరం,
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకున్నామని, 2047ను అమృత్ కాల్ గా ప్రకటించుకున్నామన్నారు. ఇందుకు కొనసాగింపుగా మనం మేరి మాటి మేరా దేశ్  ప్రచారాన్ని ప్రారంభించుకున్నట్టు తెలిపారు.
మన దేశ సంస్కృతిలో మట్టిని తల్లిగా భావిస్తామని, స్వామి వివేకానంద చికాగోలో భారతీయ సంస్కృతీ పతాకను ఎగురవేసి వచ్చిన అనంతరం భరతగడ్డపై అడుగుపెట్టి ఈ దేశ మట్టికి , భరత మాతకు వందనాలు అర్పించారన్నారు.
అర్పించారన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అద్భుత ప్రచారంలో మేరి మాటి మేరా దేశ్ను దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు గుర్తుగా చేపట్టినట్టు ఆయన తెలిపారు.



(Release ID: 1954766) Visitor Counter : 134