సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రెస్ ఇన్ఫర్మేశన్ బ్యూరో కు ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా పదవీబాధ్యతల ను స్వీకరించిన శ్రీ మనీష్ దేశాయి

Posted On: 01 SEP 2023 5:33PM by PIB Hyderabad

పత్రికా సమాచార కార్యాలయం (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.. పిఐబి) యొక్క ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా శ్రీ మనీష్ దేశాయి ఈ రోజు న పదవీబాధ్యతలను స్వీకరించారు. ఈ పదవి ని నిర్వహిస్తూ వచ్చిన శ్రీ రాజేశ్ మల్హోత్ర నిన్నటి రోజున పదవీవిరమణ చేయడంతో ఆయన తరువాత ఈ పదవి ని శ్రీ మనీష్ దేశాయి చేపట్టారు.

శ్రీ మనీష్ దేశాయి 1989 బ్యాచ్ కు చెందిన ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. ఇంతకు ముందు, ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కు ప్రిన్సిపల్ డిజి గా వ్యవహరించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ప్రభుత్వ ప్రకటనల మరియు అవుట్ రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.  

శ్రీ మనీష్ దేశాయి మూడు దశాబ్దాల పాటు సాగిన తన ప్రముఖ వృత్తి జీవనంలో ఫిల్మ్ స్ డివిజన్ కు డిజి గా, ఐఐఎమ్ సికి అడిషనల్ డిజి (పాలన మరియు శిక్షణ) గా, సిబిఎఫ్ సి కి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) గా వివిధ హోదాలలో సేవలను అందించారు. ఆయన ఫిల్మ్ స్ డివిజన్ లో ఉన్న తన పదవీకాలంలో ముంబయి లో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ఏర్పాటు చేయడంలో పాలుపంచుకొన్నారు.

శ్రీ మనీష్ దేశాయి ఒక దశాబ్ద కాలానికి పైగా పిఐబి ముంబయి లో విధులను నిర్వహించారు. అప్పట్లో, గోవా లో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) సహా వేరు వేరు జాతీయ కార్యక్రమాలు మరియు అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగినప్పుడు వాటికి ప్రసార మాధ్యమాలకు సంబంధించిన కార్యకలాపాలను శ్రీ మనీష్ దేశాయి యే పర్యవేక్షించారు.

 

 

 

 

*****

 

 

 

 


(Release ID: 1954161) Visitor Counter : 235