ప్రధాన మంత్రి కార్యాలయం
దిల్లీ మెట్రోప్రయాణికుల యాత్ర లు కోవిడ్ కంటే పూర్వపు స్థాయిల ను అతిగమించడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి
Posted On:
01 SEP 2023 8:18AM by PIB Hyderabad
దిల్లీ మెట్రో లో నిత్యం ప్రయాణించే వ్యక్తుల సంఖ్య లో వృద్ధి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురీ ‘X’ లో ఒక పోస్టు ను పెడుతూ, అందులో దిల్లీ మెట్రో ద్వారా రోజూ ప్రయాణించే వారి సంఖ్య కోవిడ్ కంటే పూర్వం సంఖ్యల ను మించిపోయాయి, మరి ఇది ఇప్పటి వరకు చూస్తే అత్యధిక సంఖ్య అని తెలియజేశారు. దిల్లీ మెట్రో లో నిత్యం ప్రయాణించే వ్యక్తుల సంఖ్య 2020 ఫిబ్రవరి 10 వ తేదీ నాడు 66,18,717 గా ఉన్నది కాస్తా 2023 ఆగస్టు 28 వ తేదీ నాటి కి 68,16,252 కు పెరిగిపోయింది.
దీనికి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘గొప్ప కబురు. మన పట్టణ కేంద్రాల లో ఆధునికమైనటువంటి మరియు హాయి ని చేకూర్చేటటువంటి సార్వజనిక రవాణా సదుపాయాలు లభించేటట్టు పూచీ పడే దిశ లో మా ప్రభుత్వం పాటుపడుతూనే ఉంటుంది.’’ అని ‘X’ లో పెట్టిన ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.
(Release ID: 1953982)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam