కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 30 ఈఎస్‌ఐసీ ఆసుపత్రులలో కీమోథెరపీ సేవలను ప్రారంభించిన శ్రీ భూపేందర్ యాదవ్
భారతదేశ అమృత్ కాల్‌లో మన శ్రమ యోగుల సర్వతోముఖ సంక్షేమం గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ దృష్టిని సాకారం చేసే దిశలో ఈ ప్రయోగం ఒక అడుగు: శ్రీ యాదవ్
15 కొత్త ఈఎస్‌ఐ హాస్పిటల్స్, 78 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను ఏర్పాటు చేస్తోన్న ఈఎస్‌ఐసీ
Posted On:
31 AUG 2023 1:10PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక & ఉపాధి మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలోని ఈఎస్‌ఐసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈఎస్‌ఐ కార్పొరేషన్ 191వ సమావేశంలో దేశవ్యాప్తంగా 30 ఈఎస్‌ఐసీ ఆసుపత్రులలో కీమోథెరపీ సేవలను ప్రారంభించారు.
భారతదేశ అమృత్ కాల్‌లో మన శ్రమ యోగుల సర్వతోముఖ సంక్షేమం గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ దృష్టిని సాకారం చేసే దిశలో ఈ ప్రయోగం ఒక ముందడుగు అని శ్రీ యాదవ్ అన్నారు. అంతర్గత కీమోథెరపీ సేవల ప్రారంభంతో బీమా చేయబడిన కార్మికులు మరియు వారిపై ఆధారపడినవారు సులభంగా మెరుగైన క్యాన్సర్ చికిత్సను పొందగలుగుతారని తెలిపారు.
ఈఎస్‌ఐసీకి చెందిన డ్యాష్‌బోర్డ్‌లతో కూడిన కంట్రోల్ రూమ్‌ను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ డాష్‌బోర్డ్‌లు ఈఎస్‌ఐసీ ఆసుపత్రులలో వనరులు మరియు పడకల మెరుగైన పర్యవేక్షణ, కొనసాగుతున్న నిర్మాణ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి మొదలైనవాటిని నిర్ధారిస్తాయి.
ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల్లో నైపుణ్యం కలిగిన వైద్య నిపుణుల లభ్యతను నిర్ధారించడానికి ఈఎస్‌ఐసీ వైద్య విద్య రంగంలో తన పనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈఎస్‌ఐ కార్పొరేషన్ నిర్ణయించిందని శ్రీ యాదవ్ చెప్పారు. అవసరాన్ని అంచనా వేసిన తర్వాత కొత్త ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈఎస్‌ఐసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 8 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, ఒక పారా మెడికల్ కాలేజీని స్థాపించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వైద్య సంరక్షణ సేవలు, పరిపాలన, ఆర్థిక విషయాల్లో మెరుగుదలకు సంబంధించిన వివిధ ఎజెండా అంశాలను చర్చించి, కొనసాగుతున్న నిర్మాణ ప్రాజెక్టుల సమీక్షతో పాటు సమావేశంలో నిర్ణయించారు.
15 కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రులు, 78 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, ఈఎస్‌ఐసి హాస్పిటల్, బెల్టోలా, అస్సాం, ఈఎస్‌ఐసి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, కె.కె. నగర్, చెన్నై, తమిళనాడు మరియు ఈఎస్‌ఐసి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, ఫరీదాబాద్, హర్యానాలో బెడ్ స్ట్రెంగ్త్ పెంపుదలకు ఈ సమావేశంలో సూత్రప్రాయంగా ఆమోదం లభించింది.
కార్యక్రమంలో సిటిజన్ చార్టర్, మాన్యువల్ ఆఫ్ ఆడిట్ & అకౌంట్స్ ఆఫ్ ఈఎస్‌ఐసి, రెఫరల్ పాలసీ మరియు ఎక్విప్‌మెంట్ పాలసీని శ్రీ యాదవ్ విడుదల చేశారు.
రాజస్థాన్, కేరళ మరియు బెంగళూరులోని ఈఎస్‌ఐసి కార్యాలయాల నుండి ఐగాట్(కర్మయోగి భారత్) లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఈఎస్‌ఐస్ యొక్క 5 ఐగాట్ అభ్యాసకులను కూడా శ్రీ యాదవ్ సత్కరించారు. పౌర సేవలలో సామర్థ్య అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ వేదిక లక్ష్యం.
శ్రీమతి డోలా సేన్, పార్లమెంటు సభ్యులు, శ్రీ రామ్ కిర్పాల్ యాదవ్, పార్లమెంటు సభ్యులు, శ్రీమతి ఆర్తి అహుజా, సెక్రటరీ (ఎస్&ఈ), డాక్టర్. రాజేంద్ర కుమార్, డైరెక్టర్ జనరల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు/కార్యదర్శులు, యజమానులు, ఉద్యోగులు ప్రతినిధులు మరియు ఇతర ఈఎస్‌ఐ కార్పొరేషన్ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.
****
(Release ID: 1953747)
Visitor Counter : 159