ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ సంస్కృత దినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి


ఈ సందర్భాన్ని వేడుక వలె జరుపుకోవడం లో భాగం గా, సంస్కృతం లో ఒక వాక్యాన్ని శేర్ చేయండి అంటూ అందరికి విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి

Posted On: 31 AUG 2023 10:06AM by PIB Hyderabad

ప్రపంచ సంస్కృత దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  సంస్కృతం పట్ల మక్కువ కలిగి ఉన్న వారందరికీ ఆయన ప్రశంసల ను వ్యక్తం చేశారు.  ఈ సందర్భాన్ని వేడుక వలె జరుపుకోవడం లో భాగం గా, సంస్కృతం లో ఒక వాక్యాన్ని ప్రతి ఒక్కరు శేర్ చేయండి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

సామాజిక మాధ్యం  ‘X’ లో కొన్ని పోస్ట్ లను ప్రధాన మంత్రి పెడుతూ, వాటిలో -

 విశ్వ సంస్కృత్ దివసే మమ శుభకామనాః . అహం సర్వాన్ అభినందామి యే ఏతదర్థం భావుకాః సంతి . సంస్కృతేన్ సహ భారతస్య సంబంధః విశిష్టః .’’

‘‘ ప్రపంచ సంస్కృత దినం సందర్భం లో ఇవే అభినందన లు.  ఆ భాష పట్ల మక్కువ ను కలిగి ఉన్న వారందరి కి నేను ప్రశంస ను వ్యక్తం చేస్తున్నాను.  భారతదేశాని కి సంస్కృతం తో చాలా విశిష్టమైనటువంటి సంబంధం ఉన్నది.  ఈ గొప్ప భాష ను వేడుక వలె జరుపుకోవడం లో భాగం గా, సంస్కృతం లో ఒక వాక్యాన్ని శేర్ చేయండి అంటూ మిమ్మల్ని నేను కోరుతున్నాను.  ఈ క్రింద కనిపించే ఒక పోస్టు లో, నేను సైతం ఒక వాక్యాన్ని శేర్ చేస్తున్నాను.   #CelebratingSanskrit  ను ఉపయోగించడం మరచిపోకండి. ’’

 

 అగ్రిమ దినేషు భారతం జి20 సమ్మేళనస్య ఆతిథ్యం కరిష్యతి.  సంపూర్ణవిశ్వతః జనాః భారతమ్  ఆగమిష్యన్తి.  అస్మాకం శ్రేష్ఠసంస్కృతిం జ్ఞాస్యంతి చ.  #CelebratingSanskrit  అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/ST


(Release ID: 1953655) Visitor Counter : 180