యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా సమాఖ్య పోర్టల్ ప్రారంభించిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్


ఫిట్ ఇండియా క్విజ్ మూడవ దశ కార్యక్రమాలు ప్రకటించిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 4x400 మీటర్ల పురుషుల రిలే జట్టును సత్కరించిన మంత్రి

క్రీడారంగం నుంచి చంద్రయాన్‌తో చంద్రుడిపైకి చేరే వరకు నవ భారతదేశం తనదైన ముద్ర వేసింది...
శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 29 AUG 2023 6:25PM by PIB Hyderabad

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జెఎల్ యెన్ స్టేడియంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఫిట్ ఇండియా క్విజ్ మూడో దశ పోటీలను కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్   ప్రారంభించారు.  కార్యక్రమంలో న్యూ ఢిల్లీ లోని వివిధ పార్థసాలలు చెందిన దాదాపు 500 మంది విద్యార్థులు, ప్రముఖ క్రీడాకారులు, యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారులు, జాతీయ క్రీడల సంస్థ, జాతీయ క్రీడా సంస్థల  ప్రతినిధులు పాల్గొన్నారు. 

బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆసియా రికార్డు సృష్టించిన  4x400 మీటర్ల పురుషుల రిలే జట్టును సత్కరించిన మంత్రి  ఖేలో ఇండియా పథకం ,కింద క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి మంజూరైనప్రాజెక్టులపై సమాచార బుక్‌లెట్‌ను  ప్రారంభించారు,  జాతీయ క్రీడా సమాఖ్య పోర్టల్‌ను శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. 

కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ ఠాకూర్ " “హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 లలో హాకీలో వరుసగా మూడు ఒలింపిక్ బంగారు పతకాలను దేశానికి  సాధించారు.   మేజర్ ధ్యాన్ చంద్కు  నివాళులు అర్పించడానికి ఇది సరైన రోజు " అని అన్నారు. దేశంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న .కోచ్‌లు,క్రీడాకారులను మంత్రి అభినందించారు.  కోచ్‌లు, అథ్లెట్లు కృషితో క్రీడా రంగంలో భారతదేశం మరింత రాణిస్తుందని మంత్రి అన్నారు. 

“భారతదేశం అంతటా ఈ రోజు 3526 కార్యక్రమాలు  జరుగుతున్నాయి. క్రీడా రంగంలో దేశం సాధించిన అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం.   భారతీయ క్రీడలు నమ్మశక్యం కాని దశలో ప్రయాణిస్తున్నాయి. ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో గత  60 ఏళ్లలో దేశానికి  18 పతకాలు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది జరిగిన పోటీల్లో దేశం  26 పతకాలు సాధించింది.  చదరంగంలో ప్రజ్ఞానంద నుంచి రెజ్లింగ్‌లో యాంటీమ్ పంఘల్ వరకు, విలువిద్యలో అదితి గోపీచంద్ స్వామి వరకు అన్ని క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు.  బుడాపెస్ట్‌లో జరిగిన  ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో  4x400 మీటర్ల రిలే జట్టు ప్రతిభ కనబరిచింది.  పరుల్ చౌదరితో పాటు ప్రతి అంతర్జాతీయ పోటీలో   నీరజ్ చోప్రా తో కలిసి గొప్ప ప్రదర్శన కనబరిచారు.”అని మంత్రి తెలిపారు.

ఫిట్ ఇండియా క్విజ్  3వ ఎడిషన్ కూడా మంత్రి ప్రకటించారు. గతంలో రెండు సార్లు నిర్వహించిన ఫిట్ ఇండియా క్విజ్ విజయవంతం అయ్యింది. పాఠశాల విద్యార్థుల కోసం భారతదేశం లో నిర్వహిస్తున్న  అతిపెద్ద స్పోర్ట్స్  ఫిట్‌నెస్ క్విజ్ పోటీగా ఫిట్ ఇండియా క్విజ్ గుర్తింపు పొందింది. ఫిట్ ఇండియా క్విజ్ లో  ,  రూ. 3.25 కోట్ల రూపాయల నగదు బహుమతి అందిస్తారు. అండమాన్, సిక్కిం మొదలైన మారుమూల ప్రాంతాలతో పాటు అరుణాచల్‌లోని టెంగా లోయ నుండి విద్యార్థులు ఫిట్ ఇండియా క్విజ్‌లో పాల్గొని విజయం సాధించారని శ్రీ రాకూర్ తెలిపారు. 

క్రీడారంగం నుంచి చంద్రయాన్‌తో చంద్రుడిపైకి చేరే  వరకు నవ భారతదేశం తనదైన ముద్ర వేసింది అని

శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. దేశాన్ని  అగ్రస్థానానికి చేర్చేందుకు  అథ్లెట్లు కృషి చేసి విజయం సాధించారని మంత్రి అన్నారు. దేశానికి క్రీడా రంగంలో గుర్తింపు తెచ్చిన క్రీడా సంస్థలతో పాటు క్రీడాకారుల తల్లిదండ్రులను మంత్రి అభినందించారు. 

 వ్యాపార సౌలభ్యం , సుపరిపాలన కోసం డిజిటల్ ఇండియా కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా  నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ పోర్టల్ ప్రారంభమయింది.జాతీయ క్రీడా సమాఖ్యల  కోసం ఏకీకృత ఆన్‌లైన్ పోర్టల్,గా ఇది పనిచేస్తుంది. గుర్తింపు, వార్షిక పునరుద్ధరణ, జాతీయ క్రీడా సమాఖ్యల ఎన్నికలు మొదలైన వాటి ప్రాసెసింగ్ కోసం ఏక గవాక్ష విధానంగా పోర్టల్ అమలు జరుగుతుంది. 

 ఎన్‌ఎస్‌ఎఫ్‌ల ద్వారా పత్రాలను సమర్పించే భౌతిక విధానం, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా వాటిని పరిశీలించే వ్యవస్థను పోర్టల్  తొలగిస్తుంది. క్రీడల శాఖ, జాతీయ క్రీడా సమాఖ్యల మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధిస్తుంది. 

ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణ,ప్రాసెసింగ్ పోర్టల్ కూడా ప్రారంభమయింది. ఖేలో ఇండియా పథకం  కింద మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, క్రీడా పరికరాల కొనుగోలు కార్యక్రమాల నిర్వహణ కోసం పోర్టల్ ఉపయోగపడుతుంది. పోర్టల్ ద్వారా 2023 సెప్టెంబర్ నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రీడల గ్రాంటుల కోసం ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. 

ఖేలో ఇండియా పథకం కింద మంజూరైన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలతో బుక్‌లెట్ ముద్రించారు. 2016 నుంచి  ఖేలో ఇండియా పథకం కింద సాధించిన క్రీడా నైపుణ్య అభివృద్ధిని కూడా బుక్‌లెట్ లో పొందుపరిచారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో క్రీడల అభివృద్ధికి అమలు జరుగుతున్న కార్యక్రమాలు, అమలు చేయనున్న కార్యక్రమాల వివరాలను దీనిలో పొందుపరిచారు. దేశంలో క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది. 

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్‌కు నివాళులు అర్పించేందుకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రాలు,  ఖేలో ఇండియా కేంద్రాల్లో క్రీడలు, ఫిట్‌నెస్ కార్యకలాపాలు జరిగాయి. జాతీయ క్రీడా సమాఖ్య,  పాఠశాల, కళాశాలలు కార్యక్రమంలో పాల్గొన్నాయి. . 18-40 ఏళ్లు, 40-60 ఏళ్లు, 60+ సంవత్సరాల వయస్సు గల వారికి వయస్సుకు తగిన పోటీలు, ఆటలు జరిగాయి. 

 

***


(Release ID: 1953373) Visitor Counter : 240