ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి 51 ,000 కు పైగా నియామక లేఖల ను- రోజ్ గార్ మేళా లో భాగం గా- ఆగస్టు 28 వ తేదీ నాడు పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్న ప్రధానమంత్రి వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో ఒక అడుగు గా ‘రోజ్ గార్ మేళా’ ఉంది
నూతనంగా ఉద్యోగాల లో నియామకం జరిగిన వారు ‘కర్మయోగి ప్రారంభ్’ అనే ఆన్ లైన్ మాడ్యూల్ ద్వారా వారంతట వారు గా శిక్షణ ను కూడా పూర్తి చేసుకోగలుగుతారు
Posted On:
27 AUG 2023 6:27PM by PIB Hyderabad
ఉద్యోగాల లో నూతనం గా నియమింపబడిన వారికి సంబంధించిన 51,000 కు పైచిలుకు నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 28 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళా జరగనుంది. ఈ రోజ్గార్ మేళా కార్యక్రమం ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి), అస్సాం రైఫిల్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అలాగే ఢిల్లీ పోలీసులు వంటి వివిధ కేంద్ర సాయుధ పోలీసు దళాల (సిఎపిఎఫ్) లో సిబ్బందిని నియమిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపికైన వారు హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ సంస్థల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), సబ్ ఇన్స్పెక్టర్ (జనరల్ డ్యూటీ), నాన్ జనరల్ డ్యూటీ క్యాడర్ పోస్టుల్లో చేరనున్నారు.
కేంద్ర సాయుధ పోలీసు దళాల (సిఎపిఎఫ్) తో పాటు ఢిల్లీ పోలీసులను బలోపేతం చేయడం ద్వారా అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం, తిరుగుబాటు, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, దేశ సరిహద్దులను రక్షించడం వంటి బహుముఖ పాత్రను మరింత ప్రభావవంతంగా పోషించడంలో ఈ దళాలకు సహాయపడుతుంది.
ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చే విషయం లో ప్రధాన మంత్రి వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక అడుగు గా ఉంది. రోజ్ గార్ మేళా ఉద్యోగాల కల్పన ను పెంపొందింప జేయడం లో ఒక ఉత్ప్రేరకం వలె పనిచేయగలదన్న భావన ఉంది. అంతేకాక యువతీ యువకుల సశక్తీకరణ తో పాటు గా దేశాభివృద్ధి లో పాలుపంచుకోవడం లో సార్థకం కాగల అవకాశాల ను కూడా ఈ రోజ్ గార్ మేళా వారికి అందిస్తుందన్న భావన సైతం ఉంది.
నూతనంగా ఉద్యోగాల లో నియామకం జరిగిన వారు ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా వారంతట వారు గా శిక్షణ ను పొందే అవకాశాన్ని కూడా దక్కించుకోనున్నారు. ‘కర్మయోగి ప్రారంభ్’ అనేది ఐజిఒటి కర్మయోగి పోర్టల్ ( iGOT Karmayogi portal ) కు చెందిన ఒక ఆన్ లైన్ మాడ్యూల్. ఈ పోర్టల్ లో 673 కి పైగా ఇ-లర్నింగ్ పాఠ్యక్రమాల ను ‘ఎక్కడయినా ఏ డివైస్ నుండి అయినా’ నేర్చుకొనే ఫార్మేట్ లో అందుబాటు లో కి తీసుకు రావడమైంది.
***
(Release ID: 1952726)
Visitor Counter : 198
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam