ఆయుష్

ఈశాన్య ప్రాంతంలో అన్ని ప్రధాన ఆసుపత్రులలో సమగ్ర ఆయుష్ వైద్య విభాగాలు ఏర్పాటు కావాలి.. కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్


హిమాలయ ప్రాంతంలో లభిస్తున్న విలువైన వృక్షజాలం ఆయుష్ వైద్య విధానం మరింత సమర్థంగా సహకరిస్తాయి...శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 26 AUG 2023 2:14PM by PIB Hyderabad
* జాతీయ ఆయుష్ మిషన్‌పై జరిగిన ప్రాంతీయ సమీక్ష సమావేశానికి హాజరైన ఈశాన్య ప్రాంతంలోని  అన్ని రాష్ట్రాలు 

* “జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా సమగ్ర  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థని  అభివృద్ధి చేయడానికి  ఆధునిక వైద్యంతో సంప్రదాయ వైద్య వ్యవస్థను సమ్మిళితం చేసి  పెట్టుబడులు , ఆవిష్కరణలు సాధించాలి ”:...  సర్బానంద సోనోవాల్
* అరుణాచల్ ప్రదేశ్‌లో త్వరలో డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు: ఆలో లిబాంగ్
* లోక్‌తక్ సరస్సు మధ్యలో ప్రత్యేక పంచకర్మ కేంద్రం: డాక్టర్ సపం రంజన్ సింగ్ 

....
 ఈశాన్య  రాష్ట్రాల ప్రాంతీయ సమీక్ష సమావేశాన్ని కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా,జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ  సర్బానంద సోనోవాల్, అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మతో కలిసి ఈరోజు ఇక్కడ  ప్రారంభించారు.సమీక్ష సమావేశానికి వేడుకకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, త్రిపుర ఆరోగ్య శాఖ మంత్రులు  మేఘాలయ, నాగాలాండ్‌తో పాటు ఈ ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. కేంద్ర ఆయుష్ , మహిళా,  శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర భాయ్ ముంజ పరా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ  వైద్య రాజేష్ కోటేచా మరియు మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల  సీనియర్ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 
శ్రీ సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన ఈశాన్య ప్రాంత ప్రాంతీయ  సమీక్ష సమావేశానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న ఆయుష్ కార్యక్రమాల వివరాలు, సాధించిన  పురోగతిపై వివరణాత్మక ప్రదర్శనలను అందించారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు మేధోమధన కార్యక్రమంలో పాల్గొన్నారు.  అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆలో లిబాంగ్, మణిపూర్‌కు చెందిన డాక్టర్ సపమ్ రంజన్ సింగ్; మిజోరాం కు చెందిన డాక్టర్ ఆర్ లాల్తాంగ్లియానా; సిక్కింకు చెందిన కుంగ నిమా లెప్చా,  త్రిపుర ఆర్థిక మంత్రి ప్రణజిత్ సింఘా రాయ్ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేసారు. 
ఈ సందర్బంగా మాట్లాడిన శ్రీ సర్బానంద సోనోవాల్ 'ఆయుష్ వైద్య విధానం ప్రాముఖ్యత, ఆయుష్ వైద్య విధానాన్ని మరింత ప్రోత్సహించడానికి సమావేశంలో విలువైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని అన్ని  భారతదేశం, హిమాలయ ప్రాంతంలో సంప్రదాయ వైద్య విధానానికి గుర్తింపు లభిస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ వైద్య విధానాలకు గత వైభవం తీసుకు రావడానికి కృషి ప్రారంభించింది. భారతదేశంలో సాంప్రదాయ ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న శ్రీ నరేంద్ర మోదీ , సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఆధునిక వైద్య రంగంతో పాటు సంప్రదాయ వైద్యాన్ని పెట్టుబడి, ఆవిష్కరణలు తీసుకురావడానికి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నారు" అని అన్నారు. ప్రధానమంత్రి సూచనల మేరకు దేశంలో  మొత్తం 19 ఎయిమ్స్‌లో  విభాగాల ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.  అన్ని ప్రముఖ రాష్ట్ర ఆసుపత్రుల్లో సమగ్ర  ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో ఉన్న అన్ని ప్రముఖ ఆసుపత్రుల్లో సమగ్ర ఆయుష్ విభాగం ఏర్పాటు చేయాలని ఆయన ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు సూచించారు. ఈ ప్రతిపాదనను ఈ రోజు జరిగిన సమావేశంలో పరిశీలించామని మంత్రి వివరించారు. దేశంలో అన్ని ప్రాంతాలలో సమగ్ర ఆయుష్ విభాగం ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు. ఆయుష్ వైద్య విధానం కేంద్రంగా భారతదేశం అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్నారని మంత్రి తెలిపారు. సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ అభివృద్ధి సాధ్యం అవుతుందని శ్రీ సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. 
హిమాలయ రాష్ట్రంలో సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి పూర్తి స్థాయి ఆయుష్ హెల్త్‌కేర్ సర్వీసెస్  డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్య మంత్రి అలో లిబాంగ్ చెప్పారు. లోక్‌తక్ సరస్సు మధ్యలో ప్రత్యేక పంచకర్మ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని  మణిపూర్ ఆరోగ్య మంత్రి డాక్టర్ సపమ్ రంజన్ సింగ్ తెలిపారు.  సంప్రదాయ వైద్యం  ప్రయోజనాలు వివరించిన  మిజోరం ఆరోగ్య మంత్రి డాక్టర్ ఆర్ లాల్తాంగ్లియానా ఆయుష్  వైద్య విధానాన్ని ప్రోత్సహించడానికి  తమ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ఏర్పాటైన  జన్ ఆరోగ్య సమితి కృషి చేస్తుందని తెలిపారు. 

కేంద్ర ప్రాయోజిత పథకంగా  జాతీయ ఆయుష్ మిషన్ అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా వార్షిక కార్యాచరణ ప్రణాళికలో రాష్ట్రాలు  ప్రతిపాదించిన వివిధ కార్యకలాపాల అమలు కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు  ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తన ప్రధాన పథకంగా  జాతీయ ఆయుష్ మిషన్ ను అమలు చేస్తోంది.  

 

***



(Release ID: 1952504) Visitor Counter : 113