రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

భారత్ ఎన్ సి ఏ పి (కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)ని శ్రీ నితిన్ గడ్కరీ ప్రారంభించారు.


సురక్షితమైన కార్ల కొనుగోలు లో మెరుగైన ఎంపిక చేసుకునేందుకు మా వినియోగదారులను శక్తివంతం చేసే దిశగా ఇది ఒక మైలురాయి: శ్రీ గడ్కరీ

భారత్ ఎన్ సి ఏ పి మరియు ఏ ఐ ఎస్ - 197 కొత్త భద్రతా విధానం తయారీదారులు మరియు వినియోగదారులకు పరస్పర విజయం: శ్రీ గడ్కరీ

కార్యక్రమం 1 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమవుతుంది

Posted On: 22 AUG 2023 2:30PM by PIB Hyderabad

భారతదేశంలోని 3.5-టన్నుల వాహనాలకు వాహన భద్రతా ప్రమాణాలను పెంచడం ద్వారా రహదారి భద్రతను పెంచే లక్ష్యంతో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో భారత్ కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ ఎన్ సి ఏ పి)ని ప్రారంభించారు.

 

సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సురక్షితమైన కార్ల కొనుగోలులో మెరుగైన ఎంపిక చేసుకునేందుకు మా వినియోగదారులను శక్తివంతం చేసేందుకు ఇది ఒక ముందడుగు అని అన్నారు.

 

భారతదేశంలోని వాహనాల భద్రత మరియు నాణ్యతను కూడా భారత్ ఎన్ సి ఏ పి మెరుగ్గా పెంచుతుందని, అదే సమయంలో సురక్షితమైన వాహనాలను తయారు చేసేందుకు ఓ ఈ ఎంల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తుందని శ్రీ గడ్కరీ అన్నారు. భారత్ ఎన్ సి ఏ పి మరియు ఏఐఎస్-197 క్రింద కొత్త భద్రతా పాలన తయారీదారులు మరియు వినియోగదారులకు పరస్పర విజయం మరియు మన పౌరుల ప్రాణాలను రక్షించడానికి మరియు మన ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే ప్రధమ ఆటో తయారీ కేంద్రంగా మార్చడానికి ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు.

 

ఎం 1 కేటగిరీకి చెందిన 3.5 టీ జి వి డబ్ల్యూ కంటే తక్కువ వున్న మోటారు వాహనాలను ఆమోదించటానికి ఈ  ప్రోగ్రామ్ వర్తిస్తుంది. ఇది ఒక స్వచ్ఛంద ప్రోగ్రామ్, ఇందులో ఇచ్చిన మోడల్ యొక్క బేస్ వేరియంట్‌లు పరీక్షించబడతాయి.

 

ఈ కార్యక్రమం 1 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమవుతుంది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 197 ఆధారంగా ఉంటుంది.ఆటోమోటివ్ ఇండస్ట్రీ  పోటీ వినియోగదారులలో అవగాహన పెంచడానికి దారితీసే మెరుగైన భద్రత పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ప్రోగ్రామ్ లక్ష్యం. క్రాష్ టెస్ట్ పరిస్థితుల్లో వాహన పనితీరుపై తులనాత్మక అంచనా వేయడం ద్వారా వినియోగదారులు సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవచ్చు.

 

ఎన్ సి ఏ పి ప్రపంచ భద్రతా ప్రమాణాలతో వాహనాలను తయారు చేయడానికి ఓ ఈ ఎం లకు అవకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్  నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం వాటాదారుల సంప్రదింపుల ఆధారంగా రూపొందించబడింది.

 

***



(Release ID: 1951259) Visitor Counter : 115