బొగ్గు మంత్రిత్వ శాఖ
జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష - ఎన్ఇఇటి కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌ను అందించనున్న ఎస్ఇసిఎల్
లబ్ధి పొందనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కోల్‌బెల్ట్ ప్రాంతాలకు చెందిన నిరుపేద నేపథ్యం ఉన్న విద్యార్ధులు
Posted On:
22 AUG 2023 1:51PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్ కు చెందిన కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్ఇసిఎల్ తన సిఎస్ఆర్ చొరవ అయిన ఎస్ఇసిఎల్ కె సుశ్రూత్ కింద 12వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా రెసిడెన్షియల్ మెడికల్ కోచింగ్‌ను అందించనుంది. జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష -నీట్ (ఎన్ఇఇటి)కి తయారయ్యేందుకు కంపెనీ విద్యార్ధులకు మార్గదర్శనం చేస్తూ, శిక్షణను అందిస్తుంది.
ఆర్ధికంగా వెనుకబడినవారు, పేద నేపథ్యమున్న విద్యార్ధులకు ఈ చర్య ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా, వైద్యులు కావాలని ఆకాంక్షిస్తున్నా, మెడికల్ కోచింగ్‌ను పొందలేని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ బొగ్గు గనులున్న ప్రాంతాలలోని గ్రామాలకు చెందిన పేద విద్యార్ధులకు ఇది చేయూత అవుతుంది.
శిక్షణ కోసం విద్యార్ధుల ఎంపికను నీట్ తరహాలో నిర్వహించే పోటీ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమం కింద మొత్తం 35 విద్యార్ధులతో కూడిన బ్యాచ్‌కి బిలాస్‌పూర్‌లోని ప్రైవేటు శిక్షణా సం్థ భాగస్వామ్యంతో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం పూర్తిగా రెసిడెన్షియల్ తరహాలో బస, ఆహార సదుపాయాలతో ఉండటమే కాక క్రమం తప్పకుండా జాతీయ స్థాయి పరీక్షలను, మార్గదర్శనాన్ని అందిస్తారు.
ఈ కార్యక్రమానికి నమోదు చేసుకోవాలనుకున్న, నిబంధనలు, షరతులను వివరణాత్మకంగా తెలుసుకోగోరే విద్యార్ధులు ఎస్ఇసిఎల్ వెబ్‌సైట్ ను- https://secl-cil.in/index.php అన్న లింక్ ద్వారా సందర్శించాలి. ఆన్‌లైన్ లో నమోదు చేసుకునేందుకు ఆఖరు తేదీ 6 సెప్టెంబర్ 2023. ఎంపిక నిమిత్తం 10 సెప్టెంబర్‌న పరీక్షను నిర్వహిస్తారు.
కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్ధులు కనీసం 60% మార్కులతో 12వ తరగతిని 2023లో ఉత్తీర్ణులై ఉండటమే అర్హత.
దరఖాస్తుదారు ఎంపి లేదా ఛత్తీస్‌గఢ్ వాసి అయి ఉండటమే కాక ఛత్తీస్‌గఢ్‌లో జిల్లాలైన కోర్బా, రాయ్‌గఢ్, కొరియా, సుర్గుజా, సురాజ్‌పూర్, బలరాంపూర్ & మనేంద్ర గఢ్- చిర్మిరి - భరత్‌పూర్ జిల్లాలు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉమేరియా, అన్నుపూర్ & షహదోల్ జిల్లాలలో ఎస్ఇసిఎల్ సంస్థ కార్య కలాపాలు సాగించే ప్రాంతానికి 25 కిమీల పరిధిలో గల పాఠశాలల్లో చదివి ఉండాలి, లేదా నివసిస్తూ ఉండాలి.
ఇందుకు అదనంగా, ఈ దరఖాస్తుదారు తల్లిదండ్రులు/ గార్డియన్‌ల స్థూల ఆదాయం రూ.8,00,000 (ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయలు)కన్నా ఎక్కువగా ఉండకూడదు. కోచింగ్ కార్యక్రమంలో ప్రవేశానికి ముందు సముచిత ప్రభుత్వ అధికారి/నఉంచి ఆదాయ ధృవీకరణ పత్రం/ తల్లిదండ్రుల ఆదాయపు పన్ను రిటర్న్ లేదా విద్యార్ధి పేరు జోడించిన దారిద్య్రరేఖకు దిగువన (బిపిఎల్) కార్డు/ అంత్యోదయ అన్న యోజన కార్డ్‌ను సమర్పించాలి.
కోచింగ్ కోసం ఉద్దేశించిన మొత్తం సీట్లలో బొగ్గు మంత్రిత్వ శాఖ విధానం ప్రకారం ఎస్‌సీలకు 14%, ఎస్టీలకు 23%, ఒబిసిలకు 13% సీట్లను రిజర్వ్ చేస్తారు.
***
(Release ID: 1951255)
Visitor Counter : 148