ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్య ప్రదేశ్ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘క్రొత్త గాఉద్యోగాల లో నియమితులు అయిన వారు జాతీయ విద్య విధానం అమలు లో ఒక ముఖ్య పాత్ర నుపోషించనున్నారు’’

‘‘ఇప్పుడున్న ప్రభుత్వంపాఠ్య ప్రణాళిక లో ప్రాంతీయ భాషా పుస్తకాల కు ప్రాధాన్యాన్నిఇస్తున్నది’’

‘‘నిర్ణయాల నుసకారాత్మకమైన ఆలోచనల తో, సరియైన ఉద్దేశ్యం తో మరియు పూర్తి చిత్తశుద్ధి తో తీసుకొన్నప్పుడు యావత్తుపరిసరాల లో సానుకూలత నిండిపోతుంది’’

‘‘వ్యవస్థ లో లీకేజీని ఆపిన ఫలితం గా పేదల సంక్షేమాని కి ఖర్చు చేసే మొత్తాన్ని పెంచేందుకుప్రభుత్వాని కి వీలు చిక్కింది’’

‘‘విశ్వకర్మ ల యొక్క సాంప్రదాయక కౌశలాన్ని 21వ శతాబ్దం అవసరాల కు అనుగుణం గా మలచడం కోసం పిఎమ్విశ్వకర్మ యోజన ను రూపొందించడమైంది’’

Posted On: 21 AUG 2023 1:12PM by PIB Hyderabad

ఈ రోజు న మధ్య ప్రదేశ్ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో లింక్ మాధ్యం ద్వారా ప్రసంగించారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు న నియామక లేఖ లను అందుకొంటున్న వ్యక్తులు ఈ చరిత్రాత్మకమైనటువంటి కాలం లో విద్య బోధన తాలూకు ముఖ్యమైన కర్తవ్య పాలన లో అడుగిడుతున్నారని పేర్కొన్నారు. దేశాభివృద్ధి లో జాతీయ గుణగణాల పాత్ర కీలకం అని వివరిస్తూ, ఎర్ర కోట నుండి తాను ఇచ్చిన ఉపన్యాసం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి ఈ రోజు న ఉద్యోగాల ను అందుకొంటున్న వారంతా భారతదేశం యొక్క భావి తరాల ను తీర్చిదిద్దేటటువంటి, వారిని ఆధునికులు గా తీర్చిదిద్దేటటువంటి మరియు వారి కి ఒక క్రొత్త దిశ ను ఇచ్చేటటువంటి బాధ్యత ను స్వీకరిస్తున్నారు అని స్పష్టం చేశారు. రోజ్ గార్ మేళా లో భాగం గా ఈ రోజు న మధ్య ప్రదేశ్ లో ప్రాథమిక పాఠశాల ల ఉపాధ్యాయులు గా నియమితులైన అయిదున్నర వేల మంది కి పైగా అభ్యర్థుల కు ఆయన తన శుభాకాంక్షల ను తెలియ జేశారు. గడచిన మూడు సంవత్సరాల లో మధ్య ప్రదేశ్ లో సుమారు ఏభై వేల మంది గురువుల ను నియమించడమైందని కూడా ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఈ కార్యాని కి గాను రాష్ట్ర ప్రభుత్వాని కి అభినందనల ను వ్యక్తం చేశారు.

నూతనం గా నియమితులైన వ్యక్తులు జాతీయ విద్య విధానంఅమలు లో ఒక ముఖ్య పాత్ర ను పోషించనున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. అభివృద్ధి చెందిన దేశం గా భారతదేశం అనేటటువంటి ఒక సంకల్పాన్ని సాకారం చేయడం లో వారి తోడ్పాటు ఎంతో ప్రధానమైందని ఆయన చెప్తూ, రాబోయే కాలాని కి చెందిన సాంకేతిక విజ్ఞానాని కి, అలాగే సాంప్రదాయక జ్ఞానాని కి సమానమైన ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. మాతృ భాష లో విద్య బోధన పరం గా పురోగతి ని సాధిస్తూనే, ప్రాథమిక విద్య రంగం లో ఒక నూతన పాఠ్యక్రమాని కి సైతం రంగాన్ని సిద్ధం చేయడమైందని ఆయన అన్నారు. ఇంగ్లీషు అంటే తెలియనటువంటి విద్యార్థుల కు మాతృభాష లో చదువు చెప్పకపోవడం అనేది ఘోరమైన అన్యాయం అని ఆయన అంటూ, పాఠ్య ప్రణాళిక లో పుస్తకాల ను ప్రాంతీయ భాషల లో తీసుకు రావడానికి ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ ను తీసుకొంటోంది అని తెలియ జేశారు. ఈ విధానం దేశం లో విద్య వ్యవస్థ లో ఒక పెద్ద మార్పునకు ఆధారం అవుతుంది అని ఆయన చెప్పారు.

‘‘నిర్ణయాల ను సకారాత్మకమైన ఆలోచనల తో, సరి అయినటువంటి ఉద్దేశ్యం తో, పూర్తి నిజాయితీ తో తీసుకొన్నప్పుడు యావత్తు పరిసరాలు సకారాత్మకత తో నిండిపోతాయి’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అమృత కాలం లోని ఒకటో సంవత్సరం లో రెండు సకారాత్మకమైన కబురు లు అందాయి అని ఆయన నొక్కి చెప్తూ, ఆ కబురుల లో ఒకటి పేదరికం తగ్గడం మరియు రెండో కబురు దేశం లో సమృద్ధి వృద్ధి చెందడం అని పేర్కొన్నారు. ఒకటో అంశం నీతి ఆయోగ్ నివేదిక లో వెల్లడి అయింది. కేవలం అయిదు సంవత్సరాల లో 13.5 కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారు. రెండో విషయం ఏమిటి అంటే, ఈ సంవత్సరం లో దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య తో గత తొమ్మిది సంవత్సరాల కాలం లో ప్రజల సగటు ఆదాయం లో భారీ వృద్ధి ఉందన్న విషయాన్ని తెలియజేసింది అనేదే అని ప్రధాన మంత్రి అన్నారు. ఐటిఆర్ డాటా ను బట్టి చూస్తే, 2014 వ సంవత్సరం లో సుమారు 4 లక్షల రూపాయలు గా ఉన్న సగటు ఆదాయం కాస్తా 2023 వ సంవత్సరం లో 13 లక్షల రూపాయల కు వృద్ధి చెందింది అని ప్రధాన మంత్రి వివరించారు. అల్పాదాయ సమూహం నుండి ఉన్నత ఆదాయ సమూహం లోకి చేరుకొన్న ప్రజల సంఖ్య కూడా వృద్ధి చెందింది అని ఆయన తెలిపారు. ఈ సంఖ్య లు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని, దేశం లోని ప్రతి ఒక్క రంగం తొణికిస లాడుతున్న ఉత్సాహం తో బలపడుతోంది అంటూ పూచీ ని ఇస్తున్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ఆదాయం పన్ను రిటర్నుల తాలూకు క్రొత్త సంఖ్యల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇది దేశ పౌరుల కు ప్రభుత్వం పట్ల నిరంతరం గా పెరుగుతున్న విశ్వాసాన్ని చాటుతోంది అన్నారు. ఈ కారణం గా పౌరులు వారి పన్నుల ను నిజాయతీ తో చెల్లించడం కోసం పెద్ద సంఖ్య లో ముందుకు వస్తున్నారు, వారి పన్నుల తాలూకు ప్రతి ఒక్క పైసా ను దేశం యొక్క అభివృద్ధి కై ఖర్చుపెట్టడం జరుగుతోంది అనే విషయం వారికి తెలుసు, 2014 వ సంవత్సరాని కంటే పూర్వం పదో స్థానం లో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అయిదో స్థానాని కి చేరుకొందన్న విషయం కూడా వారికి తెలుసు అని ఆయన అన్నారు. 2014 వ సంవత్సరం కంటే పూర్వం కాలం లో కుంభకోణాలు మరియు అవినీతి పెచ్చరిల్లాయి; ఆ కాలం లో పేదల హక్కుల ను వారు దక్కించుకొనే లోపే అవి దోపిడి కి గురి అయ్యాయి అన్న సంగతి ని దేశ పౌరులు మరువ జాలరు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రస్తుతం పేదల కు దక్కవలసిన ధనమంతా నేరు గా వారి ఖాతాల లోకి చేరుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

వ్యవస్థ లో లీకేజి ని అడ్డుకొన్న ఫలితం గా పేదల సంక్షేమం పై వెచ్చించవలసిన మొత్తాన్ని పెంచే వీలు ప్రభుత్వాని కి కలిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. అంత పెద్ద స్థాయి లో పెట్టిన పెట్టుబడి దేశం లో మూల మూల న ఉపాధి అవకాశాల ను సృష్టించింది అని ఆయన చెప్తూ, ఈ సందర్భం లో కామన్ సర్వీస్ సెంటర్ ను గురించి ఉదాహరణ గా పేర్కొన్నారు. 2014 వ సంవత్సరం నాటి నుండి గ్రామాల లో 5 లక్షల క్రొత్త కామన్ సర్వీస్ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరిగింది, మరి ఆ తరహా కేంద్రం ఒక్కొక్కటి ఇవాళ ఎంతో మంది కి బ్రతుకు తెరువు ను కల్పిస్తోంది అని ఆయన వెల్లడించారు. ‘‘దీని అర్థం పేద ల, పల్లె ల సంక్షేమం తో పాటే ఉపాధి అవకాశాల సృష్టి కూడాను’’ అని ఆయన వివరించారు.

విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పన రంగాల లో అనేక ఫలితాల ను అందించేటటువంటి విధానాల తోను మరియు నిర్ణయాల తోను ప్రస్తుతం కృషి జరుగుతున్నదని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్య్ర దినం నాడు ప్రధాన మంత్రి ఎర్ర కోట నుండి తాను ఇచ్చిన ప్రసంగం లో ప్రకటించిన పిఎమ్ విశ్వకర్మ యోజన ను గురించి ప్రస్తావించి, సదరు పథకం ఈ దృష్టికోణం యొక్క ప్రతిబింబమే అన్నారు. విశ్వకర్మ ల సాంప్రదాయిక ప్రావీణ్యాల ను 21వ శతాబ్దం అవసరాల కు అనుగుణం గా మలచడానికే పిఎమ్ విశ్వకర్మ యోజన ను రూపొందించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కోసం సుమారు 13 వేల కోట్ల రూపాయల ను వెచ్చించడం జరుగుతుంది. మరి ఇది 18 వివిధ రకాల నేర్పుల ను కలిగివుండేటటువంటి వారి కి ప్రయోజనకరం గా ఉంటుంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. ఈ పథకం సమాజం లో ఒక వర్గం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి చర్చ జరిగినప్పటికీ ఆ వర్గం యొక్క స్థితి ని మెరుగు పరచడాని కి ఎటువంటి తదేక ప్రయాస జరుగని అటువంటి వారి విషయం లో మేలు ను చేస్తుంది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. విశ్వకర్మ పథకం లో భాగం గా లబ్ధిదారుల కు శిక్షణ తో పాటు వారు ఆధునిక పనిముట్టుల ను కొనుగోలు చేయవడం కోసం వౌచర్ లను కూడా ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘యువతీ యువకుల కు వారి నేర్పుల కు మరింత మెరుగులు దిద్దుకొనేందుకు అనేక అవకాశాలు పిఎమ్ విశ్వకర్మ ద్వారా లభిస్తాయి’’ అని ప్రధాన మంత్రి చెప్పారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో ఈ రోజు న ఉపాధ్యాయులు గా అయిన వారు కఠోర శ్రమ ద్వారా ఈ స్థానాని కి చేరుకొన్నారని పేర్కొంటూ, వారు నేర్చుకొనే ప్రక్రియ ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రూపొందించినటువంటి ఆన్ లైన్ లర్నింగ్ ప్లాట్ ఫార్మ్ - ఐజిఒటి కర్మయోగి (IGoT Karmayogi ) ని గురించి ఆయన ప్రముఖం గా పేర్కొంటూ, ఉద్యోగాల లో క్రొత్త గా నియమితులైన వారు ఈ సదుపాయాన్ని గరిష్ఠ స్థాయి లో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

 



(Release ID: 1950850) Visitor Counter : 135